ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambati Rayudu : ‘అంబటి’ అడుగులు ఎటువైపు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ కేక్‌గా మారిన రాయుడు.. వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేస్తారన్న వార్తల్లో నిజమెంత..?

ABN, First Publish Date - 2023-06-06T21:41:59+05:30

అంబటి రాయుడు (Ambati Rayudu).. ఈయనొక క్రికెటర్.. ఈ మధ్యనే రిటైర్మెంట్(Retirement) తీసుకున్నారు.. అలా రిటైర్మెంట్ ఇచ్చారో లేదో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అంబటి పేరు మోతెక్కిపోతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబటి రాయుడు (Ambati Rayudu).. ఈయనొక క్రికెటర్.. ఈ మధ్యనే రిటైర్మెంట్(Retirement) తీసుకున్నారు.. అలా రిటైర్మెంట్ ఇచ్చారో లేదో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అంబటి పేరు మోతెక్కిపోతోంది. క్రీడల పరంగా అనుకుంటున్నారేమో అస్సలు కాదండోయ్.. రాజకీయ పరంగా ఈయన వార్తల్లో నిలుస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌గా అంబటి రాజకీయాల్లోకి (Ambati Rayudu Politics) రావాలని తహతహలాడుతున్నారట. అందుకే ఈయన కోసం ఏపీ, తెలంగాణలోని (AP, Telangana) అధికార, ప్రతిపక్షాలు క్యూ కడుతున్నాయి.. మా పార్టీలోకి రండి.. కాదు కాదు మా పార్టీలోకే రండి అని ఆహ్వానాలు పంపిస్తున్నాయట. ఈ రేంజ్‌లో ఆహ్వానాలు వస్తుంటే ఎటువైపు అడుగులు వేయాలనేది తెలియక డైలామాలో పడ్డారట. ఈయన్ను పార్టీలోకి ఎవరెవరు మంతనాలు జరిపారు..? అసలు అంబటి చేస్తున్న సమాలోచనలు ఏంటి..? ఈయన స్వగ్రామం ఏపీ.. అక్కడి పార్టీలు ఆహ్వానించాయనడంలో అర్థముంది సరే.. తెలంగాణ పార్టీలు ఎందుకు ఈయన్ను ఆహ్వానించాయి..? ఈయన్నుంచి పార్టీలు ఏం కోరుకుంటున్నాయి..? తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది నాయకులు ఉండగా అంబటి కోసమే ఎందుకు రాజకీయ పార్టీలు ఇంతలా క్యూ కడుతున్నాయి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ఒక్కడి కోసం ఇన్ని పార్టీలా..?

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా (Gunturu) పొన్నూరు మండలం వెల్లలూరు అంబటి రాయుడు స్వగ్రామం. జన్మస్థలం గుంటూరే అయినా హైదరాబాద్‌లోనే (Hyderabad) క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకున్నాడు. వన్డే, టెస్ట్, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో తనదైన శైలిలో రాణించిన అంబటి కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో ఆవేశంలో క్రికెట్‌కు గుడ్ బై చెప్పక తప్పలేదు. త్వరలోనే రాజకీయాలతో సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల యూత్‌లో అంబటికి మంచి ఫాలోయింగ్ ఉంది. వీటన్నింటికీ మించి నేషనల్ టీమ్‌లో (National Team) చోటు లభించలేదనే సానుభూతి క్రీడాభిమానుల్లో, తెలుగు ప్రజల్లో బలంగా ఉంది. ఈయన అలా రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారో లేదో.. ఏపీలోని వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) పార్టీల అధిష్టానాలు.. తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ అధిష్టానాలు కూడా తమ నేతల నుంచి రాయబారాలు పంపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పార్టీలు అంబటి వైపు చూస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ కేక్‌గా మారారు.!

- అంబటి రాయుడు తాత టీడీపీ తరఫున గెలిచి సర్పంచ్‌గా పనిచేశారు. దీంతో ఆయన్ను పార్టీలోకి తీసుకుని ఎంపీ లేదా ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలన్నది టీడీపీ టార్గెట్. ఇప్పటికే గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లతో అధిష్టానం మంతనాలు జరిపించదని కూడా టాక్. గుంటూరులో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్‌లో ఫాలోయింగ్, కాపు సామాజిక వర్గం వ్యక్తి కావడంతో అంబటి వస్తే పార్టీకి కలిసొస్తుందని పార్టీ భావిస్తోందట. అయితే అంబటి ఏం చెప్పారు..? అనే విషయాలు మాత్రం బయటికి రావట్లేదు.

- ఇక వైసీపీ విషయానికొస్తే.. అంబటితో టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లారని తెలుసుకున్న వైసీపీ అధిష్టానం వెంటనే పార్టీలో సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy), మంత్రి అంబటి రాంబాబును (Minister Ambati Rambabu) రంగంలోకి దింపిందట. ఆ తర్వాత కాస్త పరిస్థితులు మారినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (CM YS Jagan Mohan Reddy) పలుమార్లు ప్రశంసల్లో ముంచెత్తడంతో పక్కాగా వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అర్థమైపోయింది. అంతేకాదు.. ఆ మధ్య సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి డైరెక్టుగా జగన్‌ను కలిశారని టాక్ కూడా రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అప్పట్లో అంబటి ఇక వైసీపీ కండువా కప్పుకోవడం తరువాయి అన్నంతగా వార్తలు వచ్చేశాయి. గతంలో ఓడిపోయిన గుంటూరు ఎంపీ సీటును కైవసం చేసుకోవడానికి సరైన అభ్యర్థి వైసీపీ దొరకట్లేదట. అందుకే అంబటిని ‘పార్టీలోకి రండి..’ వెంటాడుతోందట. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

- కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేన (Janasena) నేతలు, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Sekhar) కూడా టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పట్లో మంత్రి హరీష్ రావుతో (Minister Harish Rao) కలిసి వేదికను కూడా పంచుకున్నారు. హరీషన్న అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కూడా కురిపించారు. తెలంగాణలో అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. బీఆర్ఎస్‌లో చేరాలని హరీష్ ఆహ్వానించారని కూడా టాక్ వచ్చింది. అయితే ఆయన బీఆర్ఎస్‌లో చేరితో ఏపీ బీఆర్ఎస్ కీలక పదవి ఇవ్వడంతో పాటు.. గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా బరిలోకి దింపాలన్నది అధిష్టానం టార్గెట్ అని తెలుస్తోంది.

- ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin) కూడా అంబటికి టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఏం చేస్తావో తెలియదు.. అంబటి పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత మీదే’ అని అజారుద్దీన్‌కు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయట. అంబటి పార్టీలోకి వస్తే మల్కాజిగిరి (Malkajgiri) నుంచి ఎంపీగా బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy).. కొడంగల్ (Kodangal) నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని ఉన్నారట. అందుకే బలమైన వ్యక్తిగా, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా ఉన్న అంబటిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపితే బాగుంటుందని నిశ్చయించుకున్నారట. ఏపీకి చెందిన వ్యక్తి, కాపు సామాజిక వర్గం, పైగా ఏపీ సెటిలర్లు ఎక్కువగా ఉండే పార్లమెంట్ పరిధి కావడం, యూత్‌ను ఆకర్షించే వ్యక్తి కావడంతో ఈయన్ను చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు విశ్వప్రయాత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి పోటీచేయడానికి ఒప్పుకోకపోతే.. ఏపీలో కోరుకున్న స్థానం నుంచి పోటీచేయడానికి అంబటికి చాయిస్ కూడా ఇచ్చారట.

మొత్తానికి చూస్తే.. రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న అంబటికి తెలుగు రాష్ట్రాల పార్టీలు బోలెడన్ని ఆఫర్లు అయితే ఇస్తున్నాయి. ఇన్ని ఆప్షన్లు ఉండటంతో అంబటి కూడా కన్ఫూజ్‌తో ఏం చేయాలో తెలియక డైలామాలో పడ్డారని అభిమానులు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. మరి ఫైనల్‌గా అంబటి.. ‘సైకిల్’ ఎక్కి సవారీ చేస్తారో.. ‘ఫ్యాన్’ కిందికెళ్లి సేదతీరాలని చూస్తారో.. లేకుంటే కలిసుంటే కలదు సుఖం అన్నట్లు ‘చేయి’ చేయి కలుపుతారో.. ఇవన్నీ కాదని ‘కారు’ ఎక్కుతారో వేచి చూడాల్సిందే మరి. ఎన్నికల ముందు ఏం జరుగుతుందో చూద్దాం..!

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం.. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఆప్.. కవితలో పెరిగిన టెన్షన్..?

******************************

Telangana Politics : తెలంగాణ ఎన్నికల్లో త్రిముఖ పోరా.. ద్విముఖ పోరా..? బీజేపీని కేసీఆర్ పక్కనెట్టారా.. సరెండర్ అయ్యారా.. అసలేం జరుగుతోంది..!

******************************

KCR Vs Congress : సీఎం కేసీఆర్ వింత వైఖరి.. ఆలోచనలో పడిన బీఆర్ఎస్ నేతలు.. సడన్‌గా ఇలా యూటర్న్ తీసుకున్నారేంటో..?


******************************

Updated Date - 2023-06-06T22:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising