Mythri Movie Makers : మైత్రీ మూవీ మేకర్స్‌లో పెట్టుబడులపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన బాలినేని.. అసలు కథేంటో పూసగుచ్చినట్లుగా...
ABN, First Publish Date - 2023-04-23T13:34:58+05:30
టాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై (Mythri Movie Makers) ఇటీవల ఐటీ సోదాలు (IT Raids) జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు..
టాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై (Mythri Movie Makers) ఇటీవల ఐటీ సోదాలు (IT Raids) జరిగిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖ రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్. ఇంతకీ ఆ నేతలు ఎవరబ్బా..? అని జనలంతా గూగుల్‌లో తెగ వెతికే పనిలో పడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సోదాలు అటు టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీని.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను (Telugu States Politics) ఒక్కసారిగా షేక్ చేశాయి. ముఖ్యంగా ఈ అక్రమ లావాదేవీల విషయంలో ఏపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై (Balineni Srinivasa Reddy) సంచలన ఆరోపణలే వచ్చాయి. బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు కుండా భాస్కరరెడ్డి, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులపై విచారణ జరిపించాలని జనసేన (Janasena) డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై విశాఖలోని ఆదాయ పన్నుల శాఖ నిఘా అమలు విభాగం కమిషనర్‌కు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌లో బాలినేని పేరు రావడం.. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీయడంతో ఎట్టకేలకు ఆయన మీడియా ముందుకొచ్చి అసలు కథేంటి..? ఇందులో నిజానిజాలేంటి..? అని వివరణ ఇచ్చుకున్నారు.
నిరూపిస్తే.. రాసిచ్చేస్తా..!
‘ సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు (Dil Raju) లాంటి స్నేహితులు చాలా మంది నాకు ఉన్నారు. అంతమాత్రాన సినిమాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించడం సరికాదు. మైత్రీ మూవీస్‌లో నేను పెట్టుబడులు పెట్టాననటం అవాస్తవం. అందరినీ ప్రశ్నిస్తా అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను (Janasena Chief Pawan Kalyan) నేను ఒకే ఒక్కటే ప్రశ్నిస్తున్నా. పవన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలందరినీ అడిగి తెలుసుకోండి. మైత్రీ మూవీస్‌లో నేను కానీ.. మా కుటుంబ సభ్యులు కానీ పెట్టుబడులు పెట్టామని నిరూపిస్తే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాను. రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను. వీరసింహారెడ్డి (Veera Simha Reddy) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సహకరిస్తే మైత్రీ మూవీస్‌లో పెట్టుబడులు పెట్టినట్లా..?. వీరసింహారెడ్డి సినిమాకే కాదు ఏ సినిమాకు అయినా అవసరమైతే సహకరిస్తా. వైజాగ్‌లో మా కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయటం సరికాదు. జనసేన కార్పొరేటర్ చేసిన ఆరోపణలపై పవన్ కళ్యాణ్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. మైత్రీ మూవీస్‌లో కానీ, వైజాగ్ భూకబ్జా సంబంధం ఉందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్దం. మైత్రీ మూవీస్‌లో పెట్టుబడులు ఇక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే పెడుతున్నారో అందరికీ తెలుసు. ప్రజల్లో ఆదరణ ఉందని బురద చల్లాలని కొందరు చూస్తున్నారు. ఈ విషయంలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలి. సంబంధం లేకుండా అభియోగాలు చేస్తున్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు’ అని బాలినేని చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. మైత్రీ మూవీస్ వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆరోపణలపై బాలినేని అయితే స్పందించారు కానీ.. జనసేన నుంచి ముఖ్యంగా పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? బాలినేని ఛాలెంజ్‌పై ఎలా స్పందిస్తారు..? అనేది తెలియాల్సి ఉంది మరి.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
TS BJP : అమిత్‌షా తెలంగాణ టూర్‌తో సడన్‌గా తెరపైకి పొంగులేటి, జూపల్లి పేర్లు.. ఏం జరుగుతుందో..!?
******************************
Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఎవరూ ఊహించని వ్యక్తిని విచారించిన సీబీఐ.. రెండు గంటలపాటు ప్రశ్నల వర్షం..!
******************************
Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణలో కొత్తకోణం.. సడన్‌గా ఆయన సీబీఐ ఆఫీసులో ప్రత్యక్షమవ్వడంతో..
******************************
YS Jagan Reddy : ప్చ్.. వైసీపీలో అంతా అయోమయం.. సడన్‌గా ఇంత మౌనమెందుకో.. భయం మొదలైందా..!?
******************************
BRS No Bidding : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేసీఆర్ సర్కార్ బిడ్ వేయకపోవడం వెనుక పెద్ద కథే ఉందిగా.. గులాబీ బాస్ కంగుతిన్నారా..!?
******************************
Etela Vs Revanth : ప్రమాణానికి భాగ్యలక్ష్మి గుడికెళ్లి రేవంత్ కంటతడి.. ఇంట్లోనే ఉండిపోయిన ఈటల చెప్పే లాజిక్ ఏమిటంటే..
******************************
Updated Date - 2023-04-23T13:43:13+05:30 IST