Perni Nani : జగన్ సర్కార్‌పై పేర్ని నానికి ఇంత కోపమెందుకో.. మీడియా ముందే ఎందుకిలా..!?
ABN, First Publish Date - 2023-07-20T18:44:21+05:30
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..! ఇవన్నీ ఒక ఎత్తయితే టీడీపీ యువనేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర (Yuvagalam Padayatra).. నిన్న, మొన్నటి వరకూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి యాత్ర’తో (Varahi Yatra) జగన్ సర్కార్‌ను, ఎమ్మెల్యేల తప్పొప్పులను ఎత్తిచూపుతూ కడిగిపారేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా రాజీనామా చేసి బయటికి వస్తున్న పరిస్థితి. పంచకర్ల రమేష్ (Panchakarla Ramesh) రాజీనామా చేయడం త్వరలో మరికొందరు రాజీనామా చేస్తారని వైసీపీ వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని (Perni Nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ శ్రేణులు ప్రభుత్వంపైన ఈయన ఎందుకింత కోపంగా ఉన్నారు..? మీడియా ముందే ఎందుకింత రచ్చ..? అని ఒకింత రగిలిపోతున్నారట.
అసలేం జరిగింది..!?
మచిలీపట్నంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశం పేర్ని నాని ఆధిపత్య ప్రదర్శనకు వేదికైన విషయం తెలిసిందే. ఏకంగా కలెక్టర్లనే లక్ష్యంగా చేసుకుని పేర్ని నానా హడావిడి చేశారు. ఏలూరు జిల్లా నుంచి 32 మంది అధికారులు వచ్చారు మొర్రో అంటూ సమావేశంలో ప్రదర్శనగా నిలబడినా అవేవీ పట్టించుకోకుండా తనపాటికి తాను జిల్లా నుంచి ఒక్క అధికారీ రాలేదంటూ హడావిడి చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికో లేక కీలకమైన అంశాలను సమీక్షించేందుకో నాని ఈ హడావిడి చేయలేదనడానికి ఇదే నిదర్శనం. అయితే ఈ ఘటనతో నాని వర్సెస్ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌గా (Collector Prasanna Venkatesh) పరిస్థితి మారిపోయింది. ఈ ఎపిసోడ్‌పై సీఎస్ జవహర్ రెడ్డిని (AP CS Jawahar Reddy) పేర్ని కలిశారు. జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతోన్న జెడ్పీ సమావేశాలకు పలువురు కలెక్టర్లు హాజరు కావడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఏలూరు కలెక్టర్ తీరుపై సీఎం వైఎస్ జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తాననని నాని చెప్పడం గమనార్హం. నిన్న ఏలూరు కలెక్టరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాని.. ఇవాళ సీఎస్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన వ్యవహారం సర్వాత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఈ వ్యవహారంపై ఇప్పటికే సీఎంవోకు ఏలూరు కలెక్టర్ వచ్చారు. దీంతో కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య రోజురోజుకూ గొడవ పెరుగుతోందే తప్ప ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తామని నాని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు కంగుతిన్నాయి. ధర్నా చేయడమేంటి..? ఈయన ప్రభుత్వంలో ఉన్నారా లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అని చిత్రవిచిత్రాలుగా నానిపై మాట్లాడుకుంటున్న పరిస్థితట.
నాని కామెంట్స్ ఇవీ..
‘2019 ఎన్నికల్లో జిల్లాల విభజన చేస్తామని జగన్ (YS Jagan Reddy) హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో భాగంగా విభజన చేశారు. అయితే అప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోవడంతో జడ్పీ సర్వ సభ్య సమావేశాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన జరుగుతున్నాయి. రాష్ట్రానికి సీఎంకు సర్వాధికారం ఎలా ఉందో.. అలాగే జిల్లాల్లో కలెక్టర్లకి అలాగే సర్వాధికారాలు ఉన్నాయి.ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో కలిపాయి. ఏలూరు జిల్లా నుంచి వ్యవసాయ జేడీఈ తప్ప.. హోదా ఉన్న అధికారులెవ్వరూ రాలేదు. ఏలూరు జిల్లా నుంచి చిన్న అధికారులనో.. గుమాస్తాలనో పంపారు. ఇలాగైతే ప్రజల సమస్యల పరిష్కారం అయ్యేది ఎలా..?. ప్రజలు ఓట్లేయడం దేనికి..?. వచ్చే సమావేశాలకు ఏలూరు కలెక్టర్ రాకుంటే సీఎం జగన్ వద్ద కూర్చొంటానన్న మాట నుంచి వెనక్కు వెళ్లడం లేదు’ అని మరోసారి నాని స్పష్టం చేశారు.
ఈ మాటలకు అర్థమేంటో..!?
‘నేనేదో ప్రభుత్వాన్ని.. జగన్‌ను విమర్శించానని కొందరు అంటున్నారు. రాష్ట్ర పెద్దగా సీఎంగా ఉన్న జగన్‌కు కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాం. ఇందులో నేనేం ప్రిస్టేజీకి పోవడం లేదు. ఆరు నెలల్లో రిటైర్డ్ అయ్యేవాడిని నాకేం ప్రిస్టేజ్ ఉంటుంది. అధికార పార్టీలో ఉన్నా వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తే తప్పా..?. నిన్ననే (బుధవారం) ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేషుతో మాట్లాడాను. వ్యవస్థలకు భంగం కలగకూడదనే నేను మాట్లాడానని ప్రసన్న వెంకటేషుకు చెప్పాను. జడ్పీ సమావేశానికి హాజరు కావడం తప్పనిసరి కాదని ఏలూరు కలెక్టరు అన్నారు. అదే కరెక్ట్ అయితే సరి చేయమని చెప్పడానికే సీఎస్‌ను కలిశాను. కలెక్టర్లు జెడ్పీ సమావేశాలకు రావాల్సిందేనని సీఎస్ స్పష్టం చేశారు. జడ్పీ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ చెప్పారు. అధికార పార్టీలో ఉంటే సమస్యలు ప్రస్తావించకూడదా..?. ప్రతిపక్షం నిద్రపోతే ఏం చేయాలి..?. సీఎం దగ్గరకు కాకుండా.. ఎవరి వద్దకెళ్లాలి..? చంద్రబాబు దగ్గరకో.. హు.. హ అనే వ్యక్తి దగ్గరకో వెళ్లాలా..?’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
మొత్తానికి చూస్తే.. ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్న పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో అయితే నాని గురించి చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మిమ్మల్ని జగన్‌కు నమ్మినబంటు అనుకున్నాం.. ఇలా చేస్తున్నారేంటి..? అని మండిపడుతున్నారు. మరోవైపు.. రానున్న ఎన్నికల్లో మచిలిపట్నం నుంచి తన కుమారుడు పేర్ని కిట్టును పోటీచేయించాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ నాని చేస్తున్నారు. అయితే అందుకు జగన్ ఒప్పుకోవట్లేదని.. చాలా రోజులు వినిపిస్తున్న మాటే. అందుకే జగన్ సర్కార్‌పై ఇలా తిరుగుబాటు చేస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో వేచి చూడాలి మరి.
ఇవి కూడా చదవండి
Jr Ntr : ‘కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ భారీగా ఫ్లెక్సీలు.. అసలు విషయం తెలిస్తే..?
Janasena : ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్న పవన్.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి..!
TS Power Politics : రాహుల్‌తో పోలికేంటి కేటీఆర్.. మంత్రికి తెలిసిందల్లా ఒక్కటే.. దిమ్మదిరిగే కౌంటరిచ్చిన రేవంత్ రెడ్డి!
BRS Vs Revanth : కేటీఆర్.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు.. ‘పవర్’పై తేల్చుకుందాం.. రేవంత్ రెడ్డి సవాల్
Chikoti Praveen : మరో వివాదంలో చికోటి ప్రవీణ్.. ఈసారి గట్టిగానే..?
Updated Date - 2023-07-20T18:59:10+05:30 IST