Liquor Lovers : మందుబాబులకు జగన్ సర్కార్ బిగ్ షాక్..
ABN, First Publish Date - 2023-11-17T21:48:06+05:30
Liquor Rates Hike In Andhra Pradesh : వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధిస్తామని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) .. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇదే మద్యాన్నే ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు..
వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధిస్తామని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) .. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇదే మద్యాన్నే ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ నాలుగేళ్లుగా నియంత్రణ (Prohibition Of Alcohol) పేరుతోనే గడిపేసిన సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు ‘జగనన్న మద్యం పెంపు’ అంటూ లిక్కర్‌పై తెగ ధరలు పెంచేస్తున్నారు. కరోనా తర్వాత పలుమార్లు మద్యం ధరలు పెంచిన జగన్ రెడ్డి (YS Jagan Reddy) .. తాజాగా మరోసారి మందు బాబులకు భారీ షాక్ ఇచ్చారు.
పెంపు ఇలా..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఒక్కసారిగా ధరలు పెంచేసింది ప్రభుత్వం. క్వార్టర్‌పై 10 నుంచి 20 రూపాయలు పెంచింది. అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్‌ను సవరించి రూపాయల్లో నుంచి శాతంలోకి మార్చి పన్నురూపంలో ఇలా ధరలను ఇలా మోతెక్కిస్తోంది జగన్ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. అరిస్టోక్రాట్ ప్రిమియమ్, సుపీరియర్ విస్కీ, బ్యాగ్ పైపర్, గోల్డ్ రిజర్వ్ విస్కీలపై 750 ఎంఎల్‌కు 90 రూపాయలు వరకూ పెంచారు. మద్యం ప్రియులలో ఆధరణ ఉన్న ఆఫీసర్స్ చాయిస్, రాయల్ స్టాగ్ విస్కీలలో కొన్ని రకాల మధ్యం సీసాలకు రేట్లు పెంపు జరిగింది. మొత్తం 1365 రకాల మద్యం బాటిళ్ల ధరలలో 10 నుంచి 90 రూపాయలు వరకూ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఈ అధనపు ధర రేపటి (నవంబర్-18) నుంచే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
తగ్గింపు సంగతి దేవుడెరుగు!
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో మద్యంపై భారీ ఆదాయమే లక్ష్యంగా జగన్ ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. వైసీపీ శ్రేణులు మాత్రం ఇదంతా మద్యం నియంత్రణలో భాగమేనని చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. కాగా.. రెండేళ్ల కిందట మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. దీంతో మద్యం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని మందుబాబులు భావించినప్పటికీ నాటి నుంచి పెంపుడే తప్ప తగ్గించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-11-17T21:58:53+05:30 IST