ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YS Jagan ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్.. పొగడ్తలతో ముంచెత్తుతున్న వైసీపీ శ్రేణులు..

ABN, First Publish Date - 2023-03-02T23:28:32+05:30

. పవన్ ట్వీట్‌ను చూసిన ఆయన వీరాభిమానులు, జనసేన కార్యకర్తలే కాదు వైసీపీ శ్రేణులు సాదరంగా స్వాగతించాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో శుక్ర, శనివారాల్లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ( Global Investors Summit) జరగనుంది. ఇందుకోసం నగరాన్ని ముస్తాబు చేశారు. ఈ సమ్మిట్ ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని ఏపీ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. ఏపీ పెవెలియన్‌ పేరుతో 137 స్టాళ్లు పెడుతున్నారు. వివిధ రంగాలకు చెందిన వారంతా వారి వారి ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు. ఐటీ, ఫార్మా, మెరైన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఏరోస్పేస్‌, టూరిజం, టెక్స్‌టైల్స్‌...ఇలా పలు రంగాలకు చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఇప్పటివరకు నాలుగు వేల మంది వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందించారు.

స్వాగతం.. సుస్వాగతం..!

దేశవిదేశాల నుంచి ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోంది. మా శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నాను. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం కల్పించడంతోపాటు ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నానుఅని పవన్ ట్వీట్ చేశారు.

హృదయపూర్వక విన్నపం..!

ఏపీలో ఆర్థికవృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించండి. రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించండి!. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం వైజాగ్‌కే పరిమితం చేయకండి. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడప.. ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలలో ఉన్న అభివృద్ధి అవకాశాలను కూడా ఇన్వెస్టర్లకు వివరించండి. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చండి అని పవన్ విన్నవించారు.

సంపూర్ణ మద్దతు..!

చివరిగా.. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని.. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమని స్పష్టం చేశారు పవన్. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సంపూర్ధ మద్దతును అందిస్తోందన్నారు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయం కంటే రాష్ట్రం మిన్న చివరిగా సేనాని తెలిపారు.

మొత్తానికి చూస్తే.. పవన్ ట్వీట్‌ను చూసిన ఆయన వీరాభిమానులు, జనసేన కార్యకర్తలే కాదు వైసీపీ శ్రేణులు సాదరంగా స్వాగతించాయి. ఆయన ట్వీట్స్‌కు చాలా చక్కగా రిప్లయ్‌లు కూడా ఇస్తున్నాయి. ‘ఇప్పుడు మీరు నిజమైన రాజకీయ నేత అనిపించుకున్నారు’ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదట్నుంచీ మీ నుంచి ఇలాంటివే కోరుకుంటున్నామని ఇంకొందరు వైసీపీ వీరాభిమానులు మెచ్చుకుంటున్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************


YSRCP : వైసీపీ కీలక నేతకు ఘోర అవమానం.. ప్లీజ్.. ప్లీజ్ వెళ్లకండని బతిమలాడిన పరిస్థితి..!

******************************

YSR Congress : అన్నొస్తున్నాడంటే ఆనందం కాదండోయ్.. అన్నీ తొలగించాల్సిందే.. ప్రకృతితో పరాచకాలు ఏంటయ్యా జగన్.. ఆ రోజులు మరిచారా..!?

******************************

పెను విషాదం.. గుండెపోటుతో టీడీపీ ఎమ్మెల్సీ కన్నుమూత..

******************************

Naveen Murder Case : నవీన్ హత్యకేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. ఇంత జరిగినా...

******************************
TS Congress : కొడంగల్ నుంచే పోటీచేస్తానంటున్న రేవంత్ రెడ్డి.. మల్కాజ్‌గిరి పరిస్థితేంటి.. పెద్ద మాస్టర్ ప్లానే ఉందిగా..!?

******************************

Updated Date - 2023-03-02T23:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!