ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest : కీలక పరిణామం.. రేపు చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్

ABN, First Publish Date - 2023-09-13T15:33:32+05:30

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ములాఖత్ (Mulakhat) కాబోతున్నారు. గురువారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Jail) బాబుతో పవన్ భేటీ అయ్యి.. పరామర్శించనున్నారు.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (Chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ములాఖత్ (Mulakhat) కాబోతున్నారు. గురువారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Jail) బాబుతో పవన్ భేటీ అయ్యి.. పరామర్శించనున్నారు. ఇప్పటికే ములాఖత్‌కు అప్లయ్ చేయగా.. జైలు అధికారులు అనుమతిచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ ఇద్దరి భేటీ జరగనున్నట్లు తెలిసింది. ములాఖత్ పూర్తయి బయటికి వచ్చిన తర్వాత సేనాని మీడియాతో మాట్లాడనున్నారు. సేనాని ఏం మాట్లాడబోతున్నారా..? అని అటు టీడీపీ.. ఇటు జనసేన పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పవన్ పరామర్శించనున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. మంగళవారం నాడు బాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యి.. ఆయన భద్రత, ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ మీడియాతో మాట్లాడారు.


అండగా పవన్!

చంద్రబాబు అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన క్షణం నుంచి టీడీపీ శ్రేణులకు అండగా నిలిచారు. జనసేన ప్రధాన కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించిన పవన్.. వైసీపీపై తాను పోరాటం చేస్తానని ధైర్యం కల్పించారు. అంతేకాదు.. సోమవారం నాడు బాబు అరెస్ట్ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయగా.. జనసేన మద్దతిచ్చింది కూడా. అదే రోజు సాయంత్రం లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి.. పవన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌ను అన్నయ్య అంటూ లోకేష్ సంబోదించారు కూడా.

ఢిల్లీకి పవన్!

ఇదిలా ఉంటే.. ఈ స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసు విషయమై ఢిల్లీలోని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బాబు అక్రమ అరెస్టు, రిమాండ్ సహా తాజా పరిణామాలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. అంతేకాదు.. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నివేదిక ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు.. ఏపీలో శాంతి భద్రతల విషయాన్ని కూడా పవన్ ప్రస్తావనకు తెచ్చే అవకాశముంది. కేంద్రంలోని పెద్దలు తెలియకుండా ఏపీలో ఏమీ జరగదని.. మొత్తం బీజేపీనే ఆడిస్తోందనే ఆరోపణలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. బీజేపీ ఒకవేళ వైసీపీకి మద్దతుగా ఉండాలనుకుంటే ఆ విషయం స్పష్టంగా చెప్పేయాలని పవన్ కోరబోతున్నట్లు సమాచారం. కాగా.. ఏపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలోని పెద్దలు ఒక్కరంటే ఒక్కరూ కూడా స్పందించింది లేదు. దీంతో బీజేపీపై టీడీపీ, జనసేన శ్రేణులు గుర్రుమంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా బీజేపీని బాబు వీరాభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.


ఇవి కూడా చదవండి


NCBN Case : చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. సీఐడీకి కీలక ఆదేశాలు


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!


Chandrababu Case : ఏసీబీ కోర్టు తీర్పు, ములాఖత్ తర్వాత చంద్రబాబు లాయర్ల కీలక నిర్ణయం.. సర్వత్రా ఉత్కంఠ



Updated Date - 2023-09-13T15:39:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising