ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena : బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. ఆవిర్భావ సభావేదికగా మాటిచ్చిన సేనాని..

ABN, First Publish Date - 2023-03-14T23:26:40+05:30

జనసేన-బీజేపీ పొత్తుపై చాలా రోజులుగా చిత్రవిచిత్రాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై ఆవిర్భావ సభా వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జనసేన-బీజేపీ పొత్తుపై చాలా రోజులుగా చిత్రవిచిత్రాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌పై ఆవిర్భావ సభా వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.నేను బీజేపీతో పొత్తులో ఉంటే ముస్లింలు నాకు దూరం అవుతారని కొందరు అంటున్నారు. వారికి ఇష్టం లేకపోతే నేను బీజేపీ దూరంగా జరుగుతాను. పొత్తులో ఉంటే మాత్రం.. ఎక్కడైనా మైనార్టీలపై దాడి జరిగితే చూస్తూ ఊరుకోను. వెంటనే పొత్తు నుంచి బయటకువస్తానని మాట ఇస్తున్నా. మళ్లీ చెబుతున్నా ముస్లింలపై ఎవరు దాడులు చేసినా సరే ఊరుకునేది లేదు.. తాట తీస్తానుఅని పవన్ తేల్చిచెప్పారు. ముస్లీం సమాజానికి ఏపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని సేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యువతకు కీలక సూచన..!

నేను ఎక్కడికెళ్లినా జనం మార్పు కోరుకుంటున్నారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీలు సంఖ్యాబలం ఉన్నా.. దేహి అనే పరిస్థితి ఉంది. ఇది వారి తప్పు కాదు అనైక్యతే సమస్య. నాకు అధికారం ఇస్తే మీ నేతలు పనిచేసేలా చేస్తాను. అగ్రవర్ణ పేదలు అండగా ఉంటే కుల, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటాను. మాకు ఏం చేస్తారని యువత కులనాయకులను నిలదీసే పరిస్థితి రావాలి. ఇంత అవినీతి జరుగుతుంటే యువతలో ఆవేశం ఎందుకు రాదు. యువతలో పరివర్తన రాకపోతే దేశం మారేది ఎప్పుడు..? ప్రభుత్వం కులాలను విడదీసే ప్రయత్నం చేస్తోంది. ఎప్పటికైనా సరే జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజలు అభిమానం కోసం అర్థాకలితో ఉంటానుఅని ఏపీ ప్రజానీకానికి, జనసేన కార్యకర్తలకు పవన్ భరోసా కల్పించారు.

బలిపశువును కాను..!

జనసేన ఒంటరిగా వెళ్లేందుకు కూడా భయపడదు. డేటా తెప్పించుకోవాలి, విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే.. టీడీపీ కంటే ఎదిగిపోయే వాళ్లం. విశాఖ స్టీల్‌పై భావోద్వేగంగా మాట్లాడాను. ఆంధ్రా అంతా బంద్‌ జరిగితే కేంద్రం ఎందుకు దిగిరాదు. అందరూ కలిసిరాకపోతే నేనేం చేయగలను. జనసేన, బీజేపీ కలిసి నేను అనుకున్నట్లుగా ముందుకు వెళ్లలేదు. అలా వెళ్లి ఉంటుంటే టీడీపీ అనేది వచ్చేది కాదు. టీడీపీపై ఎక్స్‌ట్రా ప్రేమ లేదు, గౌరవం ఉంది. ఆంధ్రా వాళ్ల ఓట్లు కావాలి, ఆంధ్రా వాళ్లు పోటీచేయకూడదా?. నేను బలి పశువును కాదల్చుకోలేదు. ఈసారి ప్రయోగాలు చేయను. పవన్‌కళ్యాణ్ సహా అందరూ అసెంబ్లీలో.. అడుగుపెట్టే విధంగా రాజకీయం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన సంతకం ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని మరోసారి పవన్‌ తేల్చిచెప్పారు.

కులం పెత్తనం పోవాలి..!

వైసీపీ కుల కార్పొరేషన్‌లు ప్రారంభించింది. ఏపీలో ఒక కులం పెత్తనం పోవాలి. ప్రతి కులం రిజర్వేషన్‌లు కావాలని అంటోంది. కులాల పెత్తనం ఆగిపోవాలి. అగ్రకులంలో ఉన్న పేదల గురించి డబ్బులతో మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా?. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాను. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు. మంత్రులకు ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకైతే డబ్బులుంటాయి. కానీ పేదలకు ఇవ్వడానికి మాత్రం ఉండవా?. డబ్బులతో కొనగలరా.. నేను అమ్ముడుపోతానా..?. సినిమాకు నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటాను. అమ్ముడుపోతాను అంటే చెప్పుతో కొడతాను. నేను డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాదు. కావాలంటే నేనే డబ్బులిస్తా. డబ్బులతో మీ గుండెల్లో స్థానం సంపాదించగలనా?. డబ్బులకు ఆశపడే వ్యక్తిని కాను అని పవన్ తేల్చి చెప్పారు.

Updated Date - 2023-03-14T23:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising