ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?

ABN, First Publish Date - 2023-09-14T17:34:22+05:30

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై (Chandrababu) జగన్ ప్రభుత్వం కక్షగట్టి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) .. ఆయన తరఫు న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తున్నారు...

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై (Chandrababu) జగన్ ప్రభుత్వం కక్షగట్టి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) .. ఆయన తరఫు న్యాయవాదులు న్యాయ పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసిన బాబు తరఫు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా (Siddarth Luthra), టీడీపీ లీగల్ టీమ్ (TDP Leagal Team) తాజాగా మరో అడుగు ముందుకేసింది.


కీలక పరిణామమే..!

చంద్రబాబుకు బెయిల్ (CBN Bail) ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో.. ఆయన తరణు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో (ACB Court) పిటిషన్ దాఖలు చేశారు. గింజుపల్లి సుబ్బారావు అనే న్యాయవాది పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ బెయిల్‌ పిటిషన్‌ను నిశితంగా పరిశీలించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. ఏపీ హైకోర్టు (AP High Court) కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది కదా..? అని ప్రశ్నించారు. అయితే.. కస్టడీ పిటీషన్‌కు, బెయిల్ పిటిషన్‌కు ఎలాంటి సంబంధం లేదని సుబ్బారావు న్యాయవాది చెప్పారు. అనంతరం పిటిషన్‌ను అనుమతించి సీఐడీకి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. కాగా.. ఇప్పటి వరకూ హౌస్ కస్టడీ కోసం, వైసీపీ బనాయించిన ఇతర కేసుల్లో బెయిల్ కోసం మాత్రమే ఏసీబీ, హైకోర్టుల్లో పిటిషన్లను బాబు తరఫు న్యాయవాదులు వేశారు. ఈ క్రమంలో మొదటిసారి బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయడం, దీనిపై సీఐడీకి న్యాయమూర్తి నోటీసులివ్వడం అంటే కీలక పరిణామమే అని చెప్పుకోవచ్చు.

మరో పిటిషన్ కూడా..!

చంద్రబాబు సాధారణ బెయిల్ (Bail) పిటిషన్‌తో పాటు మధ్యంతర బెయిల్‌కు (Interim Bail) సంబంధించి కూడా మరో పిటిషన్‌ను న్యాయవాదులు వేశారు. ఈ రెండు పిటిషన్లు కూడా స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులోనే. ఈ రెండు పిటిషన్లపై రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే సాధారణ బెయిల్ రాకపోయినా.. మధ్యంతర బెయిల్ మాత్రం కచ్చితంగా వస్తుందని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్ రావాలని మరోవైపు టీడీపీ కార్యకర్తలు, బాబు వీరాభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. రెండ్రోజులుగా లూథ్రా ఆచితూచి వేస్తున్న అడుగులు, ఆయన చేస్తున్న ట్వీట్స్‌ను బట్టి చూస్తే కచ్చితంగా రానున్నవి అన్నీ మంచిరోజులేనని.. రేపు కచ్చితంగా శుభవార్త ఉంటుందని తెలుగు తమ్ముళ్లు (TDP Leaders) చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Balakrishna : తగ్గేదేలే.. ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే!


Luthra On CBN Case : కత్తి దూసి పోరాడాల్సిందే.. బాబు అరెస్ట్‌పై సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్


YSRCP Vs TDP : వై‘చీప్’ పాలిట్రిక్స్‌ను పసిగట్టిన టీడీపీ.. వ్యూహాత్మకంగా ‘లూథ్రా’ అడుగులు.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్!


Updated Date - 2023-09-14T17:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising