ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodali Nani: కొడాలి నాని యూటర్న్.. కాలమే గట్టి సమాధానం చెప్పిందంటున్న ఫ్యాన్స్

ABN, First Publish Date - 2023-08-22T16:57:23+05:30

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ఇటీవల తాను చిరంజీవిని విమర్శించలేదని అన్నారు. చిరంజీవిని రాజకీయంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు క్లారిటీ ఉందన్నారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవిని విమర్శించే సంస్కార హీనుడిని కాదన్నారు. ఇండస్ట్రీలోని పకోడి గాళ్లకే చిరంజీవి సలహాలు ఇవ్వొచ్చని మాత్రమే అన్నానని.. చిరంజీవిని తాను ఏమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు.

గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి ఎంత నోటి దురుసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రెస్‌మీట్ పెట్టారంటే అసభ్య పదజాలం హోరెత్తిపోతుంది. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. ప్రతిపక్ష నేతలపైనే కాకుండా సినిమా వాళ్లపైనా కూడా తన నోటి ప్రతాపాన్ని కొడాలి నాని చూపించిన సందర్భాలు ఉన్నాయి. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ ఎదుటి వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు ‘గాడు, కొడకా, సన్నాసి’ లాంటి పదాలను విరివిగా వాడటం కొడాలి నానికే చెల్లింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పకోడిగాడు అన్న కొడాలి నాని.. అంతకు ముందు రజనీకాంత్ గురించి కూడా విమర్శలు చేశారు. వయసు అయిపోయి చీకేసిన తాటికాయ ముఖం లాంటి రజనీకాంత్ సినిమాలను చూసేవాళ్లు ఎవరూ లేరని కొడాలి నాని నోరు పారేసుకున్నారు. కానీ జైలర్ లాంటి మూవీతో రజనీకాంత్ కమ్‌బ్యాక్ అదిరిపోయింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఎగబడి చూస్తున్నారు. తెలుగులో రూ.13 కోట్ల బిజినెస్ చేసిన జైలర్‌ మూవీ రెండు వారాలు కూడా పూర్తవ్వకముందే రూ.46 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు విలువ లేకుండా పోయింది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు కూడా వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన నటించిన భోళా శంకర్ సినిమా ఆడకపోయినా మెగాస్టార్ ఇమేజ్ ఇంచు కూడా తక్కువ కాలేదు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో ఇండస్ట్రీ హిట్‌ను చిరంజీవి అందుకున్నారు. ఆ సినిమా 200 రోజుల వేడుకల్లో పాల్గొన్న మెగాస్టార్ ఏపీలో టిక్కెట్ రేట్ల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలు ఎందుకంటూ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీపై చూపించే ఇంట్రస్ట్ ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం వంటి అంశాలపై పెట్టాలని హితవు పలికారు. దీంతో వైసీపీ నేతలు నోటితో రెచ్చిపోయారు. ముఖ్యంగా కొడాలి నాని స్పందిస్తూ సినిమా పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని.. వాళ్లు తమకు సలహాలు ఇచ్చే బదులు తన వాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అని సూచించారు. దీంతో మెగాస్టార్ అభిమానులు కొడాలి వ్యాఖ్యలను ఖండించారు. చిరంజీవిని పకోడిగాడు అనడం సబబు కాదని సోషల్ మీడియా వేదికగా కొడాలి నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


కట్ చేస్తే.. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ఇటీవల తాను చిరంజీవిని విమర్శించలేదని అన్నారు. చిరంజీవిని రాజకీయంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు క్లారిటీ ఉందన్నారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవిని విమర్శించే సంస్కార హీనుడిని కాదన్నారు. ఇండస్ట్రీలోని పకోడి గాళ్లకే చిరంజీవి సలహాలు ఇవ్వొచ్చని మాత్రమే అన్నానని.. చిరంజీవిని తాను ఏమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కొడాలి నాని యూటర్న్ తీసుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో కాపు వర్గం, ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఓడిపోయే అవకాశం ఉందని భయపడ్డారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. జగన్ సొంత మీడియానే చిరంజీవిపై కొడాలి నాని విమర్శలు అని కథనాలు ప్రసారం చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కొడాలి నాని బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని పలువురు హితవు పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: AP Politics: ఏపీలో దొంగ ఓట్ల కలకలం.. మీ ఓటు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి..!!

Updated Date - 2023-08-22T18:01:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising