Lokesh: జగన్‌పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు.. ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు..
ABN, First Publish Date - 2023-04-04T19:08:53+05:30
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. 'జగన్‌కు 151 సీట్లు ఇచ్చింది ప్రతిపక్షాలపై కేసులు పెట్టడానికా?, ప్రభుత్వం సహకరిస్తే పాదయాత్ర.. లేకుంటే దండయాత్ర చేస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు జగన్ అహంకారం నేలపైకి వచ్చింది' అని లోకేష్ వ్యాఖ్యానించారు. అవినీతిపై ప్రశ్నించినందుకు సొంత ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారని లోకేష్ మండిపడ్డారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం విజయనగర్ బహిరంగ సభలో నారా లోకేష్ జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానని 10 ఏళ్ల క్రితం వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చాడని, అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయిందని, రింగ్ రోడ్డు ఎక్కడ కట్టాడో కనిపించడం లేదని లోకేష్ విమర్శించారు ప్రభుత్వ ఆస్పత్రిలో లేబర్ కాంట్రాక్టర్ నుంచి ఎమ్మెల్యే ప్రతి నెలా రూ. 5 లక్షల ముడుపులు తీసుకుంటున్నాడని ఆరోపించారు. టీడీపీ హయాంలో 6 వేల టిడ్కొ ఇళ్లు నిర్మాణం చేపట్టామని, వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి సిటీని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తామని, 12 వేల టిడ్కొ ఇళ్ళు పంపిణి చేస్తామని, కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. గుత్తి రోడ్డులోని డంపింగ్ యార్డును మరో ప్రాంతానికి తరలిస్తామని, నగరంలో రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-04-04T19:10:35+05:30 IST