ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. కోర్టు మానవతా కోణంలో ఆలోచించి..!

ABN, First Publish Date - 2023-04-01T22:07:05+05:30

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డికి (Sarath Chandra Reddy) రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను శుక్రవారం రాత్రి కోర్టు మంజూరు చేసింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆరు వారాల పాటు బెయిల్ ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డి న్యాయస్థానాన్ని కోరాడు. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. మానవతా కోణంలో ఆలోచించి 4 వారాల మధ్యంతర బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. పూచీకత్తుతో పాటు కొన్ని కండీషన్స్‌తో న్యాయస్థానం బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎవరీ శరత్..!?

శరత్ చంద్రారెడ్డి.. అరబిందో ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అరబిందో గ్రూపులోని (Arabindo Group) మొత్తం 12 కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా ఉన్నాడు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్‌‌లో సీబీఐ చేర్చింది. సరిగ్గా అప్పుడే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు సీబీఐ, ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణం కేసులో పలుమార్లు అటు సీబీఐ.. ఇటు ఈడీ అధికారులు లోతుగా విచారణ జరిగిన తర్వాత నవంబర్ నెలలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అనంతరం తీహార్ జైల్‌లో శరత్ ఉన్నాడు. అయితే ఈ కేసులో శరత్ కీలక నిందితుడిగా ఉన్నాడు. మద్యం వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ ఇద్దరు పెద్ద వ్యాపారులకు సంబంధం ఉందని ఈడీ వెల్లడించిన విషయం తెలిసిందే. శరత్ చంద్రారెడ్డి, వినోయ్ బాబుకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని తెలిపింది. అప్పట్లో శరత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యింది. ముఖ్యంగా వైసీపీ శిబిరంలో ఒక్కసారిగా టెన్షన్ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి.

అప్పట్లో ఇలా..!

అప్పట్లో.. శరత్‌ చంద్రారెడ్డిని రౌజ్‌ అవెన్యూ కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలుసుకున్నారు. రిమాండ్‌ విధించిన తర్వాత శరత్‌ రెడ్డిని జైలుకు తరలించడానికి దాదాపు గంటకుపైగా సమయం పట్టింది. ఆ క్రమంలో చెవిరెడ్డి కోర్టుకు వచ్చారు. శరత్‌ రెడ్డిని జైలుకు తరలించడానికి కోర్టు హాలు నుంచి పోలీసు కారులో ఎక్కించే వరకు వారిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు.

కాగా.. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్‌‌లు వేశాడు. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లపై విచారణ జరిగింది. శరత్ చంద్రారెడ్డి తన నానమ్మ అంత్యక్రియలలో కర్మకాండలు జరపాల్సిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అనంతరం రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్ నాగ్‌పాల్ ధర్మాసనం 14 రోజుల బెయిల్ మంజూరు చేసింది.

******************************

ఇవి కూడా చదవండి

******************************

Delhi Liquor Scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎప్పుడేం జరిగింది.. పిన్ టూ పిన్ వివరాలివిగో..!

******************************

Delhi Liquor Scam: కనికారెడ్డి విమానాల్లోనే డబ్బు వచ్చిందా..

******************************
******************************

Jagan Team 3.0 : వైఎస్ జగన్ కేబినెట్ నుంచి ఔటయ్యేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు.. ఈసారి ఊహించని రీతిలో ట్విస్ట్‌లు ఉంటాయా..!?

******************************

Jagan Team 3.0 : ఏపీ కేబినెట్‌లో మళ్లీ మార్పులు.. ఆ ఇద్దరు మాజీ మంత్రులను తీసుకునే యోచనలో వైఎస్ జగన్..!

******************************

YSRCP : ఏప్రిల్-3 చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ తీసుకుంటారా.. ఆ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇవ్వబోతున్నారా..!?

******************************

YSRCP : హుటాహుటిన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు మంత్రి సీదిరి.. తమ్మినేని కూడా రావడంతో ఒక్కసారిగా..

******************************

YS Jagan House : బాబోయ్.. పేరుకేమో రూపాయి సీఎం వైఎస్ జగన్.. ఈ విషయంగానీ మీకు తెలిసిందో..!

******************************
YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!

******************************

Updated Date - 2023-04-01T22:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising