ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Mutthireddy: కౌన్సిలర్ల తిరుగుబాటు.. ఎమ్మెల్యే టిక్కెట్‌కే ఎసరు తెచ్చిన అసమ్మతి సెగ

ABN, First Publish Date - 2023-02-10T13:34:55+05:30

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందులోనూ.. జనగామ పాలిటిక్స్‌ పీక్‌ స్టేజ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పుడూ ఏదో అంశంతో వార్తల్లో ఉండే ఆ ఎమ్మెల్యే మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. సొంత గడ్డపైనే పార్టీ నేతలు ఆ ఎమ్మెల్యేపై తిరుగుబావుటా ఎగరేశారు. ఆయనపై వరుసగా వస్తున్న ఆరోపణలతో అధిష్టానం అలెర్ట్‌ అవుతోంది. ఆ ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తోంది. అదిష్టానం ఆలోచన.. ఆ నేతకు తెలియడంతో రంగంలోకి దిగిపోయారు. అనుచరగణంతో గ్రౌండ్‌ వర్క్‌ కూడా చేసేస్తున్నారు. ఇంతకీ.. హాట్‌టాపిక్‌గా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు?.. ఆయన స్థానంలో తెరపైకి వస్తున్న ప్రత్యామ్నాయ శక్తి ఏంటి?.. అనే మరిన్ని విషయాలు ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

ఎమ్మెల్యేను నిలదీసిన 11మంది కౌన్సిలర్లు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందులోనూ.. జనగామ పాలిటిక్స్‌ పీక్‌ స్టేజ్‌కు చేరాయి. విపక్షం గురించి పక్కనబెడితే... అధికార పక్షంలో మాత్రం విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ వార్తల్లో ఉండే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు . జనగామ మున్సిపాలిటీ పాలకవర్గం మూడేళ్ల పదవీకాలం ముగియడంతో.. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ.. సొంత పార్టీకి చెందిన 11మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యేను నిలదీశారు.

అయితే.. ఆయన పాతవారినే కంటిన్యూ చేస్తామని చెప్పడంతో నిరసన గళం మరింత పెరిగినట్లు అయింది. అసమ్మతి కౌన్సిలర్లు ఏకంగా రెండు వారాలపాటు క్యాంపులో ఉన్నారు. ప్రస్తుత పాలకవర్గం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. క్యాంపు నుంచే పలుమార్లు ఎమ్మెల్యేకు లేఖ రాశారు. దాంతో.. ముత్తిరెడ్డి అనుచరులు చర్చలు జరిపి.. ప్రలోభాలకు గురి చేసినా.. అసమ్మతి కౌన్సిలర్లు మాత్రం పట్టు వీడలేదు. ఆపై.. అజ్ఞాతం వీడిన కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు చెందిన మరో 8 మందిని కలుపుకుని.. 19మందితో మున్సిపల్‌ చైర్‌పర్సన్ పోకల జమునపై అవిశ్వాసం పెట్టాల్సిందేనంటూ అదనపు కలెక్టర్‌కు లేఖ అందజేశారు.

జనగామలో మరో నేతను రంగంలోకి దించుతారా?

ఇదిలావుంటే... జనగామ మున్సిపాలిటీ అసమ్మతి కౌన్సిలర్ల ఎపిసోడ్‌లో పార్టీ పెద్దలు, బాధ్యులు, మంత్రి ఎర్రబెల్లి కలుగజేసుకోకపోవండం ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యవహారమంతా ఎమ్మెల్యే ముత్తిరెడ్డికే వదిలేసి.. అధిష్టానం ప్రతీ అంశాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆ వ్యవహారంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విఫలమయ్యారనే చర్చ పార్టీలోనూ, బయట జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం జనగామలో మరో నేతను రంగంలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీలో టాక్‌ నడుస్తోంది.

విపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం

వాస్తవానికి.. గతంలోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై అనేక భూకబ్జాలు, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. తాజా పరిణామాలతోపాటు గతంలో వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్‌ పరిగణనలోకి తీసుకుంటోంది. దానికి తగ్గట్లే.. జనగామలో మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని జనగామ నుంచి రంగంలోకి దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. పోచంపల్లిని బరిలో దింపితే.. ముత్తిరెడ్డిపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. ముత్తిరెడ్డిపైనున్న వ్యతిరేకతను కూడా కట్టడి చేయోచ్చని బీఆర్ఎస్‌ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పోచంపల్లి కూడా జనగామ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టు టాక్‌ నడుస్తోంది. నియోజకవర్గంలో అనుచరగణాన్ని యాక్టివ్ చేసినట్టు తెలుస్తోంది.

జనగామ బీఆర్ఎస్ టికెట్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికే

ఇక.. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి జనగామ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం గతంలోనూ జరిగింది. అయితే.. అప్పట్లో ఆ వార్తలను పోచంపల్లి కొట్టిపారేశారు. ఏకంగా.. ముత్తిరెడ్డితో కలిసి మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. కానీ.. మరోసారి ఇప్పుడు అదే అంశం తెరపైకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ బీఆర్ఎస్ టికెట్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికే అన్న ప్రచారం జోరందుకుంది. అయితే.. ఇప్పుడు మాత్రం పోచంపల్లి కొట్టి పారేయకపోవడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. అటు.. అధిష్టానం కూడా సైలెన్స్‌ మెయింటేన్‌ చేస్తుండడంతో ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో.. ఇక జనగామ పోచంపల్లికేననే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ పెద్దలు కూడా పోచంపల్లికే అనుకూలంగా ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. పోచంపల్లి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడం.. ఆయనపైన ఎలాంటి అవినీతి మరకలు లేకపోవడం, యంగ్ లీడర్ అనే అంశాలు కలిసొచ్చేవిగా చర్చించుకుంటున్నారు.

మొత్తంగా.. జనగామ మున్సిపాలిటీ ఎపిసోడ్.. ముత్తిరెడ్డి పదవికి గండం తెచ్చిపెడుతోంది. ఆయా పరిణామాలతో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కూడా జనగామపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. రాబోయే రోజుల్లో జనగామ టిక్కెట్‌ పాలిటిక్స్‌ ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి మరి.

Updated Date - 2023-02-10T14:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising