ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Scam : ఈడీ నుంచి రాని రిప్లై.. కేసీఆర్ ఫోన్ కాల్ తర్వాత ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్‌లో నరాలు తెగే ఉత్కంఠ!

ABN, First Publish Date - 2023-03-08T16:40:43+05:30

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఈడీ నుంచి నోటీసులు అందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఈడీ నుంచి నోటీసులు అందాయి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మార్చి 9న రావాలని నోటీసులో ఈడీ పేర్కొనగా.. 15న వస్తానని అధికారులకు కవిత లేఖ రాశారు. అయితే.. కవిత రెక్వెస్ట్‌పై ఈడీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేదానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కవిత కోరినట్లు 15న ఈడీ విచారణకు అనుమితిస్తుందా..? లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 9,15 తేదీల్లో కాకుండా మరోరోజు పిలుస్తుందా..? అనేదానిపై మరో గంటల్లో పూర్తి స్పష్టత అవకాశం కనిపిస్తోంది. నోటీసులు వస్తాయని ముందు నుంచే బీఆర్ఎస్ శ్రేణులు భావించాయని సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.

ఢిల్లీకి బయల్దేరిన కవిత..

ఈడీ నుంచి వచ్చే రిప్లయ్‌ను బట్టి ఢిల్లీకి బయల్దేరాలని మొదట కవిత భావించారు. అయితే.. ఈడీకి లేఖ రాసి గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేకపోవడంతో ముందుగా అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే కవిత ఢిల్లీకి బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. అంతకుముందు ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆమె.. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అవ్వాలని భావించారు. కానీ.. సమయం లేకపోవడంతో కవితకు ఫోన్‌ చేసిన కేసీఆర్ సుమారు 15 నిమిషాలపాటు ఈడీ నోటీసులు, న్యాయ సలహాలపై చర్చించాక కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియవచ్చింది.

కేసీఆర్ ఏం చెప్పారు..?

ఢిల్లీలో నువ్వు చేపట్టిన నీ కార్యక్రమం కొనసాగించు. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. న్యాయపరంగా బీజేపీ ఆకృతాలపై పోరాడుదాం. పార్టీ అండగా ఉంటుంది అని కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పి ఢిల్లీ పంపారు. కవితతోపాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో ఏం చేస్తారు..?

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఎల్లుండి (మార్చి-10న) జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవితే దగ్గరుండి చూస్తున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. దీక్షా కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటారు. కవిత దీక్షకు జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డి. రాజా హాజరుకానున్నారు. కవిత దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు, ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా కవిత చేపట్టిన ఈ దీక్షకు రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ప్రత్యేకంగా హాజరుకానున్నారు.

Updated Date - 2023-03-08T21:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising