Avinash In YS Viveka Case : విచారణ కీలక దశలో ఉండగా కొత్త కోణాలు బయటపెట్టిన ఎంపీ వైఎస్ అవినాష్.. సునీతక్క అని సంబోధిస్తూనే..
ABN, First Publish Date - 2023-04-25T22:17:56+05:30
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) సీబీఐ (CBI) విచారణ కీలక దశలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు విచారణ పూర్తి కాగా..
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) సీబీఐ (CBI) విచారణ కీలక దశలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు విచారణ పూర్తి కాగా.. ఒకట్రెండు రోజుల్లో కీలక పరిణామాలే చోటుచేసుకుంటాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ వైపు విచారణ.. మరో కోర్టుల్లో విచారణతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కొత్త కోణాలు బయటపెట్టారు. మంగళవారం నాడు పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి.. ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
అవినాష్ లాజిక్ ఇదీ..
‘వివేకా కేసులో సునీతమ్మ మొదట సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్‌లలో చాలా వ్యత్యాసం ఉంది. సునీతక్క సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పలు అనుమానాలున్నాయి. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తూ నన్ను కుట్ర పూరితంగా ఇరికిస్తోంది. వివేకా హత్య కేసును ఛేదించే దానికంటే నన్ను ఇరికించే దానికే సీబీఐ ప్రయత్నిస్తోంది. నేను రెండేళ్లుగా సీరియస్‌గా తీసుకోకపోవడమే ఇలా జరిగిందనీ భావిస్తున్నాను. ఒక ఎంపీ స్థాయి వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు వస్తే.. సామాన్యుడి పరిస్దితి ఏమిటి..?. వివేక హత్య జరిగిన రోజు నేను జమ్మలమడుగు వెళ్తుతున్నాను. పులివెందుల రింగ్ రోడ్డుకు వెళ్ళిన తర్వాత శివప్రకాష్ రెడ్డి నుంచి నాకు ఫోన్ వచ్చింది. కానీ నేను ఆ రోజు ఇంట్లోనే ఉన్నట్లు చూపించి కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది. నాతో పాటు ఆ రోజు జమ్మలమడుగుకు 20 మంది పైనే వస్తున్నారు. నా వెనుక వచ్చిన వారిని సీబీఐ ప్రశ్నంచినా విషయం బయట పడుతుంది. హత్య జరిగిన రోజు విలువైన పత్రాలు ఎత్తుకెళ్ళామని దస్తగిరి చెబుతున్నాడు.. కానీ దానిపై ఎందుకు చోరీ కేసు సెక్షన్లు పెట్టలేదు ఆవిధంగా ఎందుకు విచారించడం లేదు. లెటరు, సెల్ ఫోన్ సాయంత్రం వరకు ఎందుకు దాచి పెట్టారు..? ఆ కోణంలో వారిని ఎందుకు ప్రశ్నించరు..? దర్యాప్తు చేయరు..?. ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఈ కేసులో విషయంలో నేను ఏ తప్పు చేయలేదని చాలా ధీమాతో ఉన్నాను’ అని అవినాష్ ఈసారి కొత్త లాజిక్‌లు, కొత్త కోణాలను బయటపెట్టారు.
ఇప్పటి వరకూ ఈ కేసులో పలు విషయాలు చెప్పిన అవినాష్.. ఇప్పుడు కొత్త కోణాల గురించి చెప్పడం పలు అనుమానాలు తావిస్తోంది. రెండ్రోజులుగా సీబీఐ బృందం పులివెందులలోనే తిష్టవేసి ఈ కేసుకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తోంది. మరోవైపు రేపో.. మాపో అవినాష్‌ను అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
TS BJP : చేవెళ్ల సభలో అమిత్ షా తీవ్ర అసహనం.. టూర్ ముగించుకొని వెళ్తూ.. వెళ్తూ.. అసలేం జరిగిందా అని ఆరాతీస్తే..!
******************************
AP Politics : వైఎస్ సునీతారెడ్డి టీడీపీలో చేరబోతున్నారా.. ఈ పోస్టర్లలో నిజమెంత.. సరిగ్గా ఈ టైమ్‌లోనే ఎందుకిలా..!?
******************************
Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉండగా.. డైరెక్టర్ ఆర్జీవీ పెను సంచలనం..
******************************
KCR BRS Sabha : మరాఠా గడ్డ నుంచి మాటిస్తున్నా.. మొత్తం మార్చేస్తా.. కీలక హామీలిచ్చిన కేసీఆర్..
******************************
SC Verdict On YS Viveka Case : సుప్రీం తీర్పుతో వైఎస్ అవినాష్‌కు దారులన్నీ క్లోజ్.. హైకోర్టు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ.. ఇదేగానీ జరిగితే..!
******************************
Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..
******************************
Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పురోగతి సాధించిన సీబీఐ.. సడన్‌గా ఇలా జరగడంతో...
******************************
Viveka Murder Case : సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక పరిణామం.. ఈసారి ఏకంగా..
******************************
Updated Date - 2023-04-25T22:26:59+05:30 IST