INDIA Name Change: ప్రజలు మళ్లీ క్యూ కట్టాల్సిందేనా.. ఇవన్నీ తప్పక మార్చుకోవాలా?
ABN, First Publish Date - 2023-09-05T16:30:35+05:30
దేశంలోని ప్రజలందరి దగ్గర ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంది. ఆయా కార్డులన్నింటిపైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది. ఇప్పుడు దేశం పేరు మారిస్తే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని కార్డులపై ఉండాలి. లేకపోతే గుర్తింపు కార్డులు చెల్లే అవకాశాలు ఉండవు. దీంతో ప్రజలు మరోసారి ప్రభుత్వ కార్యాలయాల ముందు బారులు తీరి వాటిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరు మార్చబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మన దేశం పేరును ఇండియా అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో భారత్ అని పేర్కొనడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది. జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ప్రింట్ చేయాల్సింది బదులు ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడం వివాదాస్పదంగా మారింది. అంతేకాకుండా త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇండియా పేరును మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ తీర్మానాన్ని తీసుకురాబోతోందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి.
దేశానికి పేరు మార్పు రాద్ధాంతం అంతా విపక్షాల కూటమికి ఇండియా అని పేరు పెట్టినందుకే అని.. దేశం పేరు మార్పును రాజకీయాల కోసం వాడుకుంటారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును మారిస్తే.. ప్రజలు తమ గుర్తింపు కార్డులను మార్చుకోవాల్సి ఉంటుందని కొందరు అనుమానం రేకెత్తిస్తున్నారు. దీంతో పలువురు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే నోట్ల రద్దు సమయంలో పెద్ద నోట్లను మార్చుకునేందుకు సామాన్యులు బ్యాంకుల ముందు కొన్నిరోజుల పాటు పడిగాపులు కాశారు. ఇప్పుడు మరోసారి ప్రజలు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే కొందరు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టబోతుందని.. ప్రజలను గందరగోళానికి గురిచేయబోతుందంటూ విమర్శిస్తున్నారు.
వాస్తవానికి దేశంలోని ప్రజలందరి దగ్గర ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంది. పేదలు ప్రభుత్వ పథకాలను అందుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి. అటు ఉద్యోగులు ఇంకమ్‌ట్యాక్స్ కట్టాలంటే పాన్ కార్డు తప్పనిసరి. విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా పాస్‌పోర్టు తప్పనిసరి. వాహనాలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆయా కార్డులన్నింటిపైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది. ఇప్పుడు దేశం పేరు మారిస్తే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని కార్డులపై ఉండాలి. లేకపోతే గుర్తింపు కార్డులు చెల్లే అవకాశాలు ఉండవు. దీంతో ప్రజలు మరోసారి ప్రభుత్వ కార్యాలయాల ముందు బారులు తీరి వాటిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. మరోవైపు కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంటుంది. ఇప్పుడు దేశం పేరు మారిస్తే మరోసారి కరెన్సీ నోట్లను మార్చుకోవాల్సిన అవసరం కూడా రావొచ్చని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం సాగింది. ఈ మేరకు ముందస్తు ఎన్నికలకు బీజేపీ ప్లాన్‌చేస్తోందని ఊహాగానాలు వినిపించాయి. ఇక ఇప్పుడు.. ఇండియా పేరు మార్పు అంశం తెరపైకి వచ్చింది. కానీ బీజేపీ సర్కారు మనసులో ఏముందో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఒకవేళ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి పేరు మార్పుపై బిల్లు తెస్తే అది ఆమోదం పొందడం పెద్ద కష్టమేమీ కాదు. బీజేపీకి ఉన్న మెజారిటీ దృష్ట్యా ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ దేశం పేరు మార్పుపై బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. దేశ ప్రజల సందేహాలు తొలగిపోవాలంటే బీజేపీ పెద్దలు స్పందించి ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
Udhayanidhi Stalin: సున్నిత అంశాలనూ వదలరా?.. రాజకీయ చిచ్చురేపుతున్న ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు..
YS Jagan UK Trip: కూతురి పేరుతో జగన్నాటకం.. యూకే వెళ్లింది అందుకోసమేనా?
Updated Date - 2023-09-05T16:30:35+05:30 IST