ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS KCR: అచ్చం ఎన్టీఆర్ మాదిరిగానే ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్!?.. 1989 మాదిరిగానే జరిగితే బీఆర్ఎస్ ఫలితం ఏంటో..

ABN, First Publish Date - 2023-08-22T17:04:52+05:30

ప్రస్తుతం సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం రాజకీయవర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రస్తుత నిర్ణయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1989 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ (NTR) తీసుకున్న నిర్ణయాలతో రాజకీయ విశ్లేషకులు పోల్చిచూస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్, కేసీఆర్ మధ్య ఆ పోలికేంటి?. అసలు అప్పుడేం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో గమనిద్దాం..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) దూకుడుగా ముందుకెళ్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా సోమవారమే పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించి సంచలనానికి తెరలేపారు. 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 96 మందికి సీట్లు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. పనిలో పనిగా తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం సిట్టింగ్ స్థానం గజ్వేల్‌తోపాటు కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారని ప్రకటించడం రాజకీయవర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కేసీఆర్ ప్రస్తుత నిర్ణయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1989 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ (NTR) తీసుకున్న నిర్ణయాలతో రాజకీయ విశ్లేషకులు పోల్చిచూస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్, కేసీఆర్ మధ్య ఆ పోలికేంటి?. అసలు అప్పుడేం జరిగింది? ఈ ప్రత్యేక కథనంలో గమనిద్దాం..

రెండు స్థానాల్లో ఎన్టీఆర్ పోటీ.. కానీ ఫలితం మాత్రం..

1989లో జరిగిన అవిభజిత ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) హిందూపూర్‌ స్థానంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి కూడా పోటీ చేశారు. అయితే కల్వకుర్తిలో ఎన్టీఆర్ ఓటమిని చవిచూశారు. ఎన్టీఆరే కాదు.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కూడా అధికారాన్ని చేజార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సిట్టింగ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్టీఆర్ లెక్కచేయలేదు. మెజారిటీ స్థానాల్లో సిట్టింగులతోనే బరిలోకి దిగారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ప్రభావంతో తెలుగుదేశం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇక ప్రస్తుత రాజకీయాల విషయాలతో పోలిక విషయానికి వస్తే బీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పలు సర్వేల్లో తేలింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ సిట్టింగులవైపే మొగ్గుచూపారు. బీఆర్ఎస్‌కు చెందిన దాదాపు 50 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలినా లెక్కచేయలేదు. మొత్తం 105 ఎమ్మెల్యేల్లో ఏకంగా 96 మందికి తిరిగి సీట్లు కేటాయించి కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. కేవలం ఏడుగురిని మాత్రమే పక్కనపెట్టారు. దీంతో 1989 నాటి ఎన్నికల్లో ఎన్టీఆర్ నిర్ణయాలతో కేసీఆర్ ప్రస్తుత రాజకీయాలతో పోలికలు వస్తున్నాయి.


స్థానాలు మార్చడం కేసీఆర్‌కు కామన్...

గత చరిత్రను పరిశీలిస్తే స్థానాలు మార్చి పోటీ చేయడం సీఎం కేసీఆర్‌కి చాలాకామన్ అని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 2001లో టీఆర్ఎస్ (TRS) ఆవిర్భావం తర్వాత పలుమార్లు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను మార్చుకొని వేరే స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేశారు. అయితే ఒకేసారి 2 సీట్లలో ఎప్పుడూ పోటీచేయలేదు. మొదటిసారి ఇప్పుడే బరిలో నిలవబోతున్నారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడ్డాక మెదక్ నుంచి లోక్‌సభకు, గజ్వేల్ నుంచి అసెంబ్లీకి కేసీఆర్ పోటీచేశారు. రెండుచోట్లా గెలుపొందారు. అయితే ఎంపీ పదవిని వదులుకొని తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2018 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొంది రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.


ఇక అంతకుముందు అవిభజిత ఆంధ్రప్రదేశ్‌లో 1985-1999 మధ్య టీడీపీ తరపున సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే 2001లో తెలుగుదేశాన్ని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీని ఏర్పాటు చేశారు. సిద్ధిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే 2004లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో 2008లో రాజీనామా చేశారు. తిరిగి 2008లోనే కరీంనగర్ లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేసి గెలిచారు. ఇక మరోసారి 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ విధంగా కేసీఆర్ పలుమార్లు నియోజకవర్గాలు మార్చుకొని పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కనపెడితే 1989లో ఎన్టీఆర్ మాదిరిగానే ప్రస్తుతం ఎన్నికల్లో ముందుకెళ్తున్న కేసీఆర్‌కు ఎలాంటి ఫలితం ఎదురవుతుందో వేచిచూడాలి.

Updated Date - 2023-08-22T17:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising