ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Leaders : కర్ణాటక ఫలితాలతో పొంగులేటి, జూపల్లికి ఫుల్ క్లారిటీ వచ్చేసిందా.. వాట్ నెక్స్ట్..?

ABN, First Publish Date - 2023-05-13T17:13:42+05:30

కన్నడనాట కాంగ్రెస్ (Congress) జెండా ఉవ్వెత్తున ఎగిరింది..! ఎవరూ ఊహించని రీతిలో.. సర్వే సంస్థలు చెప్పిన దానికంటే ఎక్కువే సీట్లొచ్చాయి..! ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 113ను దాటి 136 స్థానాలను ‘హస్త’గతం (Congress) చేసుకోగా పూర్తి ఫలితాలు వచ్చేసరికి ఫిగర్ మారిపోనుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడనాట కాంగ్రెస్ (Congress) జెండా ఉవ్వెత్తున ఎగిరింది..! ఎవరూ ఊహించని రీతిలో.. సర్వే సంస్థలు చెప్పిన దానికంటే ఎక్కువే సీట్లొచ్చాయి..! ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 113ను దాటి 136 స్థానాలను ‘హస్త’గతం (Congress) చేసుకోగా పూర్తి ఫలితాలు వచ్చేసరికి ఫిగర్ మారిపోనుంది. ఈ విజయం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఎనలేని జోష్‌ను నింపింది. ఒక్క మాటలో చెప్పాలంటే వరుస ఓటములతో అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న ‘చేయి’కి మళ్లీ ఊపిరొచ్చి లేచినట్లయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో హిమాచల్‌ప్రదేశ్‌తో (HimachalPradesh) ప్రారంభమైన విజయోత్సాహం.. ఇప్పుడు కర్ణాటక (Karnataka) దాకా వచ్చింది. ఇదే సీన్ అన్ని రాష్ట్రాల్లోనూ రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) ఫీలవుతున్నారు. ఈ విజయాన్ని బీజేపీకి బద్ధశత్రువులుగా ఉన్న నేతలు, పార్టీల అధినేతలు హ్యాపీగా ఫీలవుతుండగా.. ఆ పార్టీలో చేరదామనుకున్న.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్న నేతలు మాత్రం ఆలోచనలో పడ్డారట. కర్ణాటక ఫలితాలతో తెలంగాణలో (Telangana) పరిస్థితి ఎలా ఉంది..? కాషాయ కండువా కప్పుకోవాలనుకున్న కీలక నేతలకు క్లారిటీ వచ్చేసిందా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..

ఏం చేద్దాం.. ఎటువైపు అడుగులు..!

ఒకే ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎందుకంటే పార్టీ ఏ పరిస్థితుల్లో గెలిచిందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు ఎవరి నోట విన్నా కర్ణాటక గురించే వినిపిస్తోంది. మరోవైపు.. ఈ ఘోర పరాభవంతో అసలు లోపమెక్కడుంది..? ఎందుకిలా జరిగిందని కమలనాథులు ఆలోచనలో పడగా.. ఇప్పుడా రాజకీయాలు తెలంగాణ ముడిపడుతున్నాయ్. అదెలాగంటే.. రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానంలో తమ పార్టీ ఉందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. మరింత బలోపేతం చేసుకోవడానికి నేతలను చేర్చుకునేందుకు ‘చేరికల కమిటీ’ పెట్టి మరీ కండువాలు కప్పుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో బిగ్ షాట్‌లు అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై (Jupally Krishna Rao) కమలనాథుల కన్నుపడింది. ఈ ఇద్దర్నీ పార్టీలో చేర్చుకుంటే పొంగులేటి ద్వారా అటు ఖమ్మం (Khammam) జిల్లాను.. జూపల్లి ద్వారా ఇటు మహబూబ్‌నగర్‌ (Mahaboobnagar) జిల్లాలో బలపడొచ్చని బీజేపీ భావించింది. ఈ క్రమంలోనే కీలకనేతలను పొంగులేటి ఇంటికి పంపి మరీ మంతనాలు జరిపారు. సీన్ కట్ చేస్తే ఈ ఇద్దరూ నాటి నుంచి నేటి వరకూ ఎటూ తేల్చుకోలేక మిన్నకుండిపోయారు. ఇప్పుడు కర్ణాటక ఫలితాల తర్వాత పొంగులేటి, జూపల్లి ఆలోచనలో పడ్డారట. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరూ ముందుకు అడుగులేయని పరిస్థితి.. కమలనాథులు కూడా ఎటూ సంప్రదించడానికి సాహసించట్లేదట.

ఇదీ అసలు కథ..!

పొంగులేటి, జూపల్లిని (Ponguleti-Jupally) బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని కార్యకర్తలు, అభిమానులు పట్టుబట్టారు. అయితే వీరు మాత్రం కాషాయ పార్టీవైపు అడుగులేయాలని భావించారట. ఆ తర్వాత మనసు మార్చుకున్నారని వార్తలు రావడం.. సరిగ్గా ఇదే సమయంలో ‘టీఆర్ఎస్’ పేరుతో కొత్త పార్టీ తెరపైకి రావడంతో కార్యకర్తల్లో కన్ఫూజన్ మొదలైంది. ఇప్పుడు కర్ణాటక ఫలితాలతో అసలు బీజేపీలో చేరాలా వద్దా..? అనేదానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందట. ఇప్పుడంతా కాంగ్రెస్ వైపే అడుగులు వేయాలని.. క్యాడర్ కోరుకుంటున్నది కూడా ఇదే కదా అని పొంగులేటి, జూపల్లి భావిస్తున్నారట. అంతేకాదు.. బీజేపీలో చేరాలనుకున్న మరికొందరు నేతలు, కాషాయ తీర్థం పుచ్చుకున్న కొందరు నేతలు సైతం కాంగ్రెస్ వైపు అడుగులేయడానికి సిద్ధమైపోయారట. ఇవన్నీ జరిగితే.. తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలంతా కలిసిమెలిసి ఉంటే.. పార్టీలోకి వచ్చే నేతల సేవలను సరిగ్గా వినియోగించుకుంటే మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

మొత్తానికి చూస్తే.. కన్నడనాట ఫలితాల ప్రభావంతో తెలంగాణలో మాత్రం పెనుమార్పులే చోటుచేసుకుంటాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరెవరు కాంగ్రెస్ గూటికి చేరతారు..? ఎంతవరకు వీళ్లంతా సఖ్యతతో మెలుగుతారు..? అధికార పార్టీని ఏ మాత్రం ఢీకొట్టగలరనే విషయాలు తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Karnataka Election Results : కర్నాటక ‘హస్త’గతం.. ఏదో అనుకున్న కేసీఆర్ ఇప్పుడెలా ఫీలవుతున్నారో..!?
******************************

******************************

Karnataka Election Results : హైదరాబాద్‌కు మారుతున్న కర్ణాటక రాజకీయాలు.. హోటల్స్ అన్నీ ఫుల్.. రేవంత్‌రెడ్డితో కీలక మంతనాలు

******************************

TS Congress : కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో కనిపించిన సీన్ ఇదీ..


******************************

Updated Date - 2023-05-24T17:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising