ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Lokesh: ‘యువగళం’లో ప్రతిష్టాత్మక మైలురాయి.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

ABN, First Publish Date - 2023-07-11T14:05:03+05:30

ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం యువగళం అరుదైన మైలురాయిని (Key Milestone) చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ఇప్పటివరకు 152 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు 153వ రోజు కొనసాగనుంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ప్రస్తుతం యువగళం పాదయాత్ర సాగుతోంది. కొత్తపల్లి వద్ద లోకేష్ 2వేల కి.మీ మైలురాయిని చేరుకున్నారు.

ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగిందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) వర్గాలు తెలియజేశాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లోకేష్ తనదైన శైలిలో వాటిని దాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారని తెలిపాయి. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

ముఖ్యంగా తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల కోసం టీడీపీని బలోపేతం చేసే దిశగా నేతలందరినీ సమన్వయం చేస్తున్నారు. అలా ఇప్పటివరకు 49 బహిరంగ సభలను లోకేష్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో యువగళం కొనసాగిన పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించి ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ పేర్లను అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి, ఆత్మకూరులో ఆనం రాంనారాయణరెడ్డి పోటీ చేస్తారని లోకేష్ తెలిపారు. తాజా పరిణామాలతో గత ఎన్నికల్లో దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ బలంగా పుంజుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీకి గ్రాఫ్ పెరిగిందని వివరిస్తున్నారు.

అటు తాము అధికారంలోకి వస్తే యువత కోసం చేపట్టబోయే కార్యక్రమాలను తన పాదయాత్రలో లోకేష్ వివరిస్తున్నారు. మహానాడులో టీడీపీ అధినేత ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి 100 కి.మీ పాదయాత్ర పూర్తి కాగానే అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తున్నారు. మరోవైపు టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, తెచ్చిన పరిశ్రమల వద్ద పలువురితో సెల్ఫీ ఛాలెంజ్‌ను లోకేష్ చేపడుతున్నారు. దీంతో పలువురు అభిమానులు సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొని ఉత్సాహంగా లోకేష్‌తో దిగిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ముఖ్యంగా గతంతో పోలిస్తే యువగళం పాదయాత్రలో లోకేష్ మాటతీరులో పరిణితి కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తూ వైసీపీ అధినేత జగన్‌పై మాటల తూటాలను పేలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నారు. కాగా లోకేష్ పాదయాత్ర 2వేల కి.మీ మైలురాయి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో యువగళం హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా #2000kmOfYuvaGalam అనే హ్యాష్ ట్యాగ్ 3వ స్థానంలో ఉంది. ఈ హ్యాష్ టాగ్‌తో వేల సంఖ్యలో నెటిజన్‌లు ట్వీట్స్ వేస్తూ యువనేత పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు.

కాగా తన పాదయాత్ర 2వేల కి.మీ. మైలురాయికి చేరుుకున్న నేపథ్యంలో నారా లోకేష్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత తొలి అడుగుతో ప్రారంభమైన యువగళం జనగళమై, మహా ప్రభంజనమై, అరాచక పాలకుల గుండెల్లో సింహస్వప్నమై ప్రజలను చైతన్యపరుస్తూ లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ప్రజల కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ సాగుతున్న నా పాదయాత్ర ఈరోజు కావలి అసెంబ్లీ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద చారిత్రాత్మక 2వేల కి.మీ. మజిలీకి చేరుకోవడం జీవితంలో మరపురాని ఘట్టం. ఇందుకు గుర్తుగా కొత్తపల్లిలో ఆక్వారైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటుకు హామీ ఇస్తూ, శిలాఫలకాన్ని ఆవిష్కరించాను’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

AP Volunteers: వాలంటీర్లు పనిచేసేది రాష్ట్రానికా? వైసీపీకా?

Pawan Kalyan: పథకాలకు పేర్లు మార్చడం కాదు.. జగన్ ఇక్కడ బటన్ నొక్కు

Updated Date - 2023-07-11T14:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising