TS BJP : బ్యాంక్‌కు కోట్ల రూపాయిలు ఎగ్గొట్టిన తెలంగాణ బీజేపీ మహిళా నేత.. వేలానికి ఆస్తులు.. రంగంలోకి దిగిన బడా కంపెనీ..!
ABN, First Publish Date - 2023-02-09T18:12:48+05:30
లోన్ తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు తెలంగాణ బీజేపీకి (TS BJP) చెందిన వారు కావడంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో..
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 కోట్లకుపైగా బ్యాంకు నుంచి రుణం (Bank Loan) తీసుకున్నారు. తీరా రుణం చెల్లించాల్సిన సమయానికి చేతులెత్తేశారు. సీన్ కట్ చేస్తే.. వారిద్దరి ఆస్తులు వేలం దాకా వచ్చాయి. అయితే లోన్ తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు తెలంగాణ బీజేపీకి (TS BJP) చెందిన వారు కావడంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో (Social Media) అయితే ఓ రేంజ్‌లో ట్రోలింగ్ నడుస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరు..? ఆ కథా, కహానీ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆ ఇద్దరూ వీరే..
జర్నలిస్టుగా పేరుగాంచిన రాణీ రుద్రమ.. (Rani Rudrama) ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యువ తెలంగాణ (Yuva Telangana) పార్టీని స్థాపించి ఒకట్రెండు ఎన్నికల్లో కూడా పోటీచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో (BJP) యువ తెలంగాణను విలీనం చేశారు. అయితే బీజేపీలోకి చేరకముందు రాణీ రుద్రమ, జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) ఇద్దరూ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (Laxmi Vilas Bank) నుంచి రూ. 18 కోట్లకు పైగా లోన్ తీసుకున్నారు. అయితే ఆ అప్పు చెల్లించకపోగా.. ఈ ఇద్దరూ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలియవచ్చింది. దీంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు రంగంలోకి దిగారు. ఒకట్రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఇక ఆస్తుల జప్తు వ్యవహారాన్ని రిలయన్స్ అస్సెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి (Reliance) అప్పగించింది సదరు బ్యాంక్. దీంతో రిలయన్స్ సంస్థ రాణీ రుద్రమ, జిట్టా ఆస్తులను వేలం వేస్తూ ప్రకటన ఇచ్చింది.
నో రియాక్షన్..
అయితే.. ఈ నోటీసులపై ఇంతా రాద్ధాంతం జరుగుతున్నా రాణీ కానీ, జిట్టా కానీ ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా దీనిపై స్పందించలేదు. ఈ లోన్ వ్యవహారంపై కోర్టులను ఆశ్రయించినా ఎదురుదెబ్బే తగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఏడాది కిందటే జరగ్గా ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి పార్టీని విలీనం చేసి మరీ బీజేపీ కండువా కప్పుకున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. బ్యాంకు ఎగువేతదారులకు బీజేపీనే శరణమా..? అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ (Comments) , మీమ్స్ (Memes) పేలుతున్నాయి. ఇక బీజేపీ వ్యతిరేక పార్టీల కార్యకర్తలు అయితే.. ఓ రేంజ్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
*************************
ఇవి కూడా చదవండి..
YS Jagan : ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం జగన్.. మారకపోతే బాగోదని సీరియస్ వార్నింగ్.. మౌనంగా వెళ్లిపోయిన మహిళా మినిస్టర్..!
*************************
YS Jagan : శభాష్ అంటూ ముగ్గురు మంత్రులను మెచ్చుకున్న వైఎస్ జగన్.. అందులో ఒకరు...!
*************************
YSRCP : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్న వైసీపీ ముఖ్యనేత.. భారీగా ఏర్పాట్లు చేస్తుండగా చంపుతామని బెదిరింపులు.. ఇంతకీ ఎవరాయన..?
*************************
KotamReddy : కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలేం జరిగిందో.. పూసగుచ్చినట్లుగా చెప్పిన బెస్ట్ ఫ్రెండ్.. ఇదీ అసలు కథ..
*************************
YSRCP : కోటంరెడ్డి తర్వాత పార్టీ లైన్ దాటిన కీలక నేత.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసేసిన YS Jagan.. అసలేం జరిగిందంటే...
*************************
Telangana: అధికారపార్టీ ఓటుకు లక్ష ఇచ్చి.. వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా గెలుస్తానంటున్న ఎమ్మెల్యే.. ఇంతకీ ఆయన ధీమా ఏంటి.. ఏ పార్టీ నుంచి పోటీచేస్తారు..?
*************************
YS Jagan YS Sharmila : రేపో మాపో జైలుకు వైఎస్ జగన్.. షర్మిలకు సీఎం అయ్యే ఛాన్స్.. ఆ కీలకనేత ఇలా అనేశారేంటి..?
*************************
BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. తెలంగాణ సర్కార్ పిటిషన్‌పై సుప్రీం నిర్ణయం ఇదీ..
*************************
YSRCP : నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక ఆదాల ఇచ్చిన మొదటి హామీ ఇదే.. ఇదేదో సరికొత్తగా ఉందే..
*************************
Updated Date - 2023-02-09T19:50:49+05:30 IST