ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

ABN, First Publish Date - 2023-02-19T17:02:17+05:30

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(Nandamuri TarakaRatna) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(Nandamuri TarakaRatna) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో కన్నుమూశారు. తారకరత్న ఇకలేరని తెలుసుకున్న కుటుంబీకులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. మరోవైపు.. మరికొందరు ప్రముఖులు హైదరాబాద్‌ మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి మరీ ప్రముఖులు తారకరత్న ఇంటికొచ్చి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

రాజకీయాలను పక్కనెట్టి..!

మరికాసేపట్లో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) మోకిలకు వెళ్లి తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. పార్టీకి చెందిన ముఖ్యనేతలతో షర్మిల బయల్దేరారు. నివాళులు అర్పించాక.. తారకరత్న కుటుంబ సభ్యులు, అలేఖ్యారెడ్డిని (Alekhya Reddy) పరామర్శించనున్నారు. అనంతరం తారకరత్న గురించి షర్మిల మీడియాతో మాట్లాడతారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే కోవలో వైఎస్ షర్మి్ల కూడా.. రాజకీయాలను పక్కనపెట్టి మోకిలకు వెళ్తున్నారు. మరోవైపు వీఐపీలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

27 నుంచి ఇలా..!

కాగా.. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం (YuvaGalam) పాదయాత్ర (Padayatra) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన తారకరత్న.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.

23 రోజులపాటు హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాత్రికి రాత్రే తారకరత్న పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. సోమవారం ఉదయం 8:45 గంటలకు తారకరత్న భౌతిక కాయాన్ని ఫిలింఛాంబర్‌కు తరలించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఛాంబర్‌లోనే ఉంచుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు ఛాంబర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో (Mahaprasthanam) అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-19T17:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising