Credit card: క్రెడిట్ కార్డును మూసివేయాలనే మీ కోరికను ఇలా తీర్చుకోండి..దరిద్రాన్ని వదుల్చుకోండి..
ABN, First Publish Date - 2023-03-15T11:54:24+05:30
కార్డుకు వార్షిక రుసుము(Annual fee per card) లేనట్లయితే.. దాన్ని కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, కార్డుపై అధిక రుసుము వసూల్
కార్డుకు వార్షిక రుసుము(Annual fee per card) లేనట్లయితే.. దాన్ని కొనసాగించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, కార్డుపై అధిక రుసుము వసూల్ చేస్తుంటే.. మీరు కార్డు జారీ చేసిన వారితో వార్షిక రుసుము లేని క్రెడిట్ కార్డు(Credit card)కు మార్చమని అడగవచ్చు. వారు అనుకూలంగా స్పందించనట్లయితే.. కార్డు రద్దు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే.. క్రెడిట్ కార్డు రద్దు చేసేటప్పుడు కొన్ని పనులు చేయాలి. అవి ఏంటంటే.. క్రెడిట్ రద్దు(Cancellation credit) చేయకముందు..క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించాలి. మీ బ్యాలెన్స్‌ను చెల్లించిన తర్వాత సబ్క్రిప్షన్లు, ఆటోమెటిక్ చెల్లింపులను వేరే కార్డుకు మార్చుకోవాలి. మీ కార్డు మూసేసిన తర్వాత ఈ చెల్లింపుల ఆమోదం ఆగిపోతుంది. కార్డును మూసివేసే ముందు కార్డుపై రివార్డులు కోల్పోకుండా ఉండాలంటే.. రివార్డ్‌లను రీడింగ్(Reading rewards) చేసుకోవాలి.. లేదంటే బదిలీ చేయడం మంచిది. మీ కార్డు రివార్డ్ ప్రొగ్రామ్ ను సమీక్షించండి. తద్వారా నిబంధనలు తెలుసుకుంటారు.
మీ బకాయి బ్యాలెన్స్ చెల్లించి..రివార్డులను రీడింగ్ చేసిన తర్వాత కార్డు రద్దు ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఫోన్ కాల్ ద్వారా కూడా ఈ పని చేయవచ్చు. కార్డు ప్రతినిధితో మాట్లాడటానికి క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్(Customer care) నెంబర్‌కు కాల్ చేయండి. కార్డును శాశ్వతంగా మూసివేయాలనుకుంటున్నానని ప్రతినిధికి తెలియజేయండి. కార్డు రద్దు చేయకుండా మిమ్మల్ని ఒప్పించడానికి నిరుత్సాహపరచడానకి ఆ ప్రతినిధి ప్రయత్నించవచ్చు. కానీ, కార్డు రద్దు చేయడం మీ చివరి నిర్ణయం కాబట్టి కార్డు రద్దునే మళ్లీ నిర్ధారించండి. అలాగే ఈ మెయిల్ ద్వారా కూడా కార్డును రద్దు చేయవచ్చు. క్రెడిట్ కార్డును మూసివేయాలనే మీ కోరికను పేర్కొంటూ.. మీకు కార్డు జారీ చేసిన వారికి ఈ మెయిల్ పంపవచ్చు. ఇందులో మీ క్రెడిట్ కార్డు నెంబర్, పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ మొదలైన వివరాలను తెలపాలి.
కార్డు క్యాన్సిల్ చేసిన తర్వాత క్రెడిట్ రిపోర్ట్(Credit report)లో కార్డు మూసివేసిన కారణం వినియోగదారుడి అభ్యర్థన మేరకు కార్డు క్యాన్సిల్ జరిగినట్లుగా ఉండాలి. అలా కాకుండా..వేరోక కారణం కనిపిస్తే.. మీ క్రెడిట్ స్కోర్‌కు హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి సమస్యను పరిష్కరించడానికి మీ బ్యాంకును సంప్రదించండి. మీ క్రెడిట్ అధికారికంగా మూసివేసిన తర్వాత కార్డును నాశనం చేయడం మంచిది. కార్డును చిన్న ముక్కలుగా కట్ చేయాలి..ఒక వేళ మెటల్ తో తయారు చేసిన కార్డయితే.. నిబంధనల ప్రకారం మీ బ్యాంకును సంప్రదించండి. పాత కార్డును తిరిగి మెయిల్ చేయడానికి ఉపయోగించే.. ప్రిపేయిడ్ అన్వంప్ను అభ్యర్థించాలి. బ్యాంక్ కార్డును స్వీకరించిన తర్వాత సురక్షితంగా పారవేస్తుంది.
Updated Date - 2023-03-15T11:54:24+05:30 IST