TarakaRatna : తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్.. ఆయన కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో పెరిగిపోయిన ఆందోళన.. ఏం జరుగుతుందో..?
ABN, First Publish Date - 2023-02-03T19:34:48+05:30
గుండెపోటుతో (Heart Attack) బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న...
బెంగళూరు/అమరావతి : గుండెపోటుతో (Heart Attack) బెంగళూరు నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakartna) ఆరోగ్యం ఇంకా విషమంగానే (Critical Condition) ఉంది. శుక్రవారం సాయంత్రం హిందూపురం టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ (Ambhika Lakshmi narayana).. తారకరత్నను పరామర్శించారు. ఐసీయూ (ICU) నుంచి బయటికొచ్చిన అంబికా మీడియాతో మాట్లాడుతూ కీలక అప్డేట్స్ ఇచ్చారు. ‘ తారకరత్నకు సంబంధించిన ఓ హెల్త్ రిపోర్ట్ (Health Report) కీలకం కానుంది. EEG స్కానింగ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇవాళ రాత్రిలోపు డాక్టర్ల చేతికి నివేదిక రానుంది. మెదడులో (Brain) కొంతమేర వాపు రావడంతో దాన్ని నయం చేసే చికిత్సపై డాక్టర్లు (Doctors) ఫోకస్ చేశారు. తారకరత్నకు వెంటిలేటర్‌పైనే ఇంకా చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది’ అని అంబికా లక్ష్మీ నారాయణ వెల్లడించారు. కాగా.. EEG అంటే.. ఎలెక్ట్రోఎన్సెఫలోగ్రామ్. ఇది మెదడులోని కార్యకలాపాలను పర్యవేక్షించే నాన్-ఇన్వాసివ్ వైద్య పరీక్ష.
అవసరమైతే విదేశాలకు..
‘ఇవాళ తారకరత్న మెదడు స్కానింగ్ చేశారు. వచ్చే నివేదికల ఆధారంగా మెదడు ఎలా పనిచేస్తుంది..? అనే విషయం తెలుస్తుంది. పరిస్థితిని బట్టి మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే ఆలోచన కూడా ఉంది. కుటుంబ సభ్యులు (Tarakaratna Family Members) అంతా చర్చించుకుని విదేశాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. తారకర్నతను బాలయ్యే దగ్గరుండి బాగోగులు చూసుకుంటున్నారు’ అని అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు.
అభిమానుల్లో టెన్షన్..
అంబికా కామెంట్స్‌తో తారకరత్న అభిమానులు (Fans), టీడీపీ కార్యకర్తల్లో (Telugudesam) ఆందోళన మరింత పెరిగింది. నిన్న, మొన్నటి వరకూ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని భావించినప్పటికీ విదేశాలకు అనే మాట వినిపించేసరికి నందమూరి అభిమానుల్లో (Nandamuri Fans) టెన్షన్ (Tension) ఒక్కసారిగా పెరిగిపోయింది. హెల్త్ రిపోర్టు అంతా మంచిగానే రావాలని అభిమానులు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. మరోవైపు.. తారకరత్న త్వరగా కోలుకోవాలని బాలకృష్ణ హోమం చేపట్టగా, ఆస్పత్రి వద్ద వినాయక ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావాలంటూ టీడీపీ నేతలు 101 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు.
Updated Date - 2023-02-03T19:55:35+05:30 IST