ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP-Janasena Alliance: 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఎక్కడ నష్టపోయారంటే..?

ABN, First Publish Date - 2023-09-15T18:49:38+05:30

. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు కలిసి పోటీచేయడం వల్ల అధికార పార్టీ వైసీపీకి చుక్కలు కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దీంతో ఈ రెండు పార్టీలు ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఇప్పటి నుంచే రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి పోటీచేయడం వల్ల అధికార పార్టీ వైసీపీకి చుక్కలు కనిపించడం ఖాయమని అందరూ స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చిన ఓట్లు వైసీపీ కంటే అధికంగా ఉన్నాయని పలువురు లెక్కలతో సహా నిరూపిస్తున్నారు.

ఉదాహరణకు చూసుకుంటే అనకాపల్లి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి 73,207 ఓట్లు వస్తే.. టీడీపీకి 65,038 ఓట్లు, జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల అటు టీడీపీ, ఇటు జనసేన ఓడిపోవడంతో పాటు వైసీపీ తరఫున అమర్నాథ్‌రెడ్డి సుమారు 8 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. ఇదే పరిస్థితి పలు నియోజకవర్గాల్లో నెలకొంది. మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి 66,141 ఓట్లు, టీడీపీకి 60,290 ఓట్లు, జనసేనకు 18,807 ఓట్లు పోలయ్యాయి. దీంతో పేర్ని నాని విజయం సాధించారు.

అటు నగరి నియోజకవర్గంలో వైసీపీకి 80,333 ఓట్లు, టీడీపీకి 77,625 ఓట్లు వచ్చాయి. పొత్తు కారణంగా ఇక్కడి సీటును జనసేన పార్టీ బీఎస్పీకి కేటాయించింది. బీఎస్సీకి 3,044 ఓట్లు వచ్చాయి. చివరకు 2,708 ఓట్ల మెజారిటీతో రోజా సెల్వమణి గెలిచారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీకి 58,435 ఓట్లు, టీడీపీకి 50,764 ఓట్లు, జనసేన పార్టీకి 22,367 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించేవాళ్లు. కానీ వైసీపీకి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.

సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి 1,05,063 ఓట్లు, టీడీపీకి 84,187 ఓట్లు, జనసేనకు 9,279 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో రెండు పార్టీలు నష్టపోయాయి. దీంతో అంబటి రాంబాబు విజయం సాధించారు. మరోవైపు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీకి 75,040 ఓట్లు, టీడీపీకి 73,052 ఓట్లు, జనసేనకు 5,503 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 2వేల ఓట్లతోనే గట్టెక్కారు. తణుకు, శ్రీకాకుళం, భీమిలి, అమలాపురం, పెడన, భీమవరం, తాడేపల్లి గూడెం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, గుడివాడ వంటి నియోజకవర్గాల్లో కూడా స్వల్ప మెజారిటీతోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అసలు రంగు ఇదే.. వైరల్ అవుతున్న వీడియో

ABN Fact Check : పవన్ పొత్తు ప్రకటన చేసిన నిమిషాల్లోనే.. వైసీపీ చేసిన కుట్ర ఏంటో చూడండి..!

Updated Date - 2023-09-15T18:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising