ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Protests: ఇక్కడ ర్యాలీలు ఎందుకు అన్న కేటీఆర్‌కు ఇవే సమాధానాలు..!!

ABN, First Publish Date - 2023-09-26T20:50:30+05:30

టీడీపీ ఏపీలోనే కాదని.. తెలంగాణలో కూడా ఉందని పలువురు నెటిజన్‌లు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు సీఎంగా చేశారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కామెంట్లు పెడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ అభిమానులు ర్యాలీలు చేపట్టారు. అయితే ప్రభుత్వం టీడీపీ ర్యాలీలపై ఆంక్షలు విధించింది. దీనిపై మంత్రి కేటీఆర్‌ను మీడియా ప్రశ్నించగా.. ఏపీ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకని.. ఏపీలో చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. రాజమండ్రిలో భూమి బద్దలు కొట్టేలా ర్యాలీలు చేసుకోవాలని.. ఇక్కడ ఎవరు ర్యాలీలు, నిరసనలు చేపట్టినా ఊరుకునేది లేదని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. అయితే కేటీఆర్‌కు సమాధానంగా సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

టీడీపీ ఏపీలోనే కాదని.. తెలంగాణలో కూడా ఉందని పలువురు నెటిజన్‌లు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు సీఎంగా చేశారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ ఇంకా కామన్ క్యాపిటల్ అన్న సంగతి కేటీఆర్ మరిచిపోయారని గుర్తుచేస్తున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన నేతల్లో చంద్రబాబు ముందుంటారని గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు పలుమార్లు అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయంలో మీకు కృతజ్ఞత లేకపోయినా ప్రజలకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకా మాట్లాడాలంటే.. ప్రస్తుతం కేసీఆర్ పార్టీలో టీడీపీకి చెందిన చాలా మంది నేతలు ఉన్నారని.. 2019 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని.. కేటీఆర్‌కు ఈ విషయం గుర్తులేదా అని నిలదీస్తున్నారు. జాతీయ పార్టీ పేరుతో ఏపీలో బీఆర్ఎస్ శాఖ ఓపెన్ చేసి సభలు పెట్టినప్పుడు.. టీడీపీ అభిమానులు ఇక్కడ శాంతియుతంగా ర్యాలీలు చేస్తే శాంతిభద్రతలకు విఘాతం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా ఎక్కడైనా నిరసనలు, ర్యాలీలు చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని.. ఈ విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

ఇది కూడా చదవండి: Nara Lokesh: కేటీఆర్ వ్యాఖ్యలకు నారా లోకేష్ కౌంటర్.. అంత భయం ఎందుకు?

కాగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా ఆ పార్టీలో పలువురు నేతలు ఈ అంశంపై స్పందించక తప్పడం లేదు. అటు సీఎం కేసీఆర్ సైతం చంద్రబాబు అరెస్టుపై జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-26T20:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising