ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేస్తారా.. ఎందుకింత హైడ్రామా..!?

ABN, First Publish Date - 2023-10-02T10:24:07+05:30

టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని (Bandaru Saytya Naryana Murthy) పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారా..? అందుకే.. ఆదివారం అర్ధరాత్రి నుంచే భారీగా బందోబస్తు నిర్వహించారా..?

టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని (Bandaru Saytya Naryana Murthy) పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారా..? అందుకే.. ఆదివారం అర్ధరాత్రి నుంచే భారీగా బందోబస్తు నిర్వహించారా..? టీడీపీ అధినేత చంద్రబాబు (NCBN Arrest) అక్రమ అరెస్ట్ తర్వాత మరింత మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారా..? అంటే రెండు మూడ్రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది.


అసలెందుకీ రచ్చ!

ఏపీ మంత్రి రోజాపై (Minister Roja) బండారు సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) లేఖ రాశారు. మరోవైపు.. బండారుపై గుంటూరులో రెండు కేసులు నమోదయ్యాయి. నగరంపాలెం , అరండల్ పేట పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వైసీపీ కార్యకర్త మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారని ఫిర్యాదులో వైసీపీ కార్యకర్త పేర్కొన్నారు. దీంతో బండారుపై ఐపీసీ సెక్షన్ 153 (ఏ), 504, 354 (ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505, 506, 509, 499, ఐటీ చట్టం సెక్షన్-67 కింద కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. దీంతో.. నాటి నుంచే ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చని సోషల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆదివారం అర్ధరాత్రి నుంచి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు కూడలి, వెన్నెలపాలెం ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. అర్ధరాత్రి ఏమిటీ హంగామా.. హైడ్రామా అంటూ బండారు వీరాభిమానులు, టీడీపీ శ్రేణులు కన్నెర్రజేస్తున్నాయి.

ఏం జరగబోతోంది..?

రోజా విషయంలోబండారును అరెస్ట్ చేయడానికి ఆదివారం అర్ధరాత్రే పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరావు తన టీమ్‌తో అక్కడికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకొని మరీ లోపలికి ప్రవేశించారు. 41 ఏ కింద బండారుకు నోటీసు జారీచేసి స్టేషన్‌కు తరలించాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం ముందుగానే పసిగట్టిన స్థానిక ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బండారు ఇంటికి తరలివచ్చారు. మరోవైపు మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం గమనార్హం. పోలీసులు ఎక్కడికక్కడ మోహరించి.. పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని ఎవర్నీ బయట తిరగనివ్వకుండా చేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. పోలీసుల చర్యలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. బారికేడ్లు సైతం పెట్టి టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

బండారుకు అండగా..!

ఇదిలా ఉంటే.. బండారు అండగా ఉమ్మడి విశాఖపట్నంకు చెందిన టీడీపీ నేతలు ఉంటున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రాన్ని ఒక సైకో పాలిస్తున్నారని.. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఒక్క బండారును మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలను ప్రభుత్వం వేధిస్తోందని మండిపడుతున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే.. రానున్న ఎన్నికల్లో వైసీపీ తుడిచుకుపెట్టుకోడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరోవైపు.. బండారు నివాసం దగ్గర కార్యకర్తలు, వీరాభిమానులు సీఎం డౌన్.. డౌన్.. జగన్ డౌన్, డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జిల్లాలో టీడీపీకి అన్నీ తానై చూస్తూ.. పార్టీని ముందుకు తీసుకెళ్తున్న బండారును చూసి ఓర్వలేక, కక్షగట్టి వైసీపీ ఇలా.. పోలీసులను ఉసిగొల్పుతోందని టీడీపీ శ్రేణులు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. మరోవైపు ఇవాళ సాయంత్రంలోపు బండారును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని.. సమాచారం అందుతోంది.


ఇవి కూడా చదవండి


TS Politics : ప్రధాని మోదీ పాలమూరు సభకు దూరంగా బీజేపీ ముఖ్య నేతలు.. ఏదో తేడా కొడుతోందే..?


Lokesh On CBN Arrest : చంద్రబాబును చూసి తట్టుకోలేకపోయా.. చాలా బాధగా ఉంది!


Pawan Vs Jagan : సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ చేసి.. సలహా ఇచ్చిన పవన్


Pawan Kalyan : జగన్ రాసిపెట్టుకో.. మీరు ఓడిపోవటం ఖాయం!



Updated Date - 2023-10-02T10:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising