ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash In Viveka Case : వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం తేల్చిందంటే..

ABN, First Publish Date - 2023-04-28T16:45:08+05:30

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్‌పై ఇవాళ వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఇప్పటికిప్పుడు వాదనలు వినాలంటూ.. కోర్టు మీద ఒత్తిడి చేయొద్దని కూడా హైకోర్టు తెలిపింది. రేపట్నుంచీ హైకోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్ తర్వాతే తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ కేసులో అర్జెన్సీ ఉందని అటు వైఎస్ సునీతారెడ్డి.. ఇటు వైఎస్ అవినాష్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని.. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది. అంతేకాదు.. కేసును వెకేషన్‌ బెంచ్‌కు మార్చుకోవచ్చని హైకోర్టు ఇరు పక్షాలకు సూచించింది. సీజే ఎదుట మెన్షన్ చేసి ఆర్జెన్సీ ఉందని చెబితే.. ఆయన నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది.

హైకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే..

సీబీఐ తన పని తాను చేసుకోవచ్చా అని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని అడిగారు. ఈ వ్యవహారంలో తాము కలుగ జేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ స్పష్టంగా ఉన్నాయని తెలిపిన న్యాయస్థానం.. సీబీఐ విచారణ చేసుకోవచ్చని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ముందోస్తు బెయిల్ ఇవ్వలేమని మరోసారి న్యాయస్థానం తెలిపింది. బెయిల్ పిటిషన్ తేలేవరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపాలని కోరిన పిటిషనర్ కోరగా.. సుప్రీంకోర్టు ఉత్వర్వులు నేపథ్యంలో మేము కలుగజేసుకోలేమని హైకోర్టు తెలిపింది. అనంతరం ఇలా ఇరు వాదనలు విన్న తర్వాత విచారణ జూన్-05కు వాయిదా వేసింది. 2 వారాలైన తదుపరి చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరఫు లాయర్లు కోర్టు కోరారు. తదుపరి చర్యలు సీబీఐ తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది.

ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలు అవినాశ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న సునీతారెడ్డి, అవినాష్ తరఫు లాయర్ల వాదనలు గురువారం నాడు విన్న హైకోర్టు.. ఇవాళ మరోసారి ఇరుపక్షాల వాదనలను న్యాయస్థానం విన్నది. దీంతో పాటు సీబీఐ తరపు న్యాయవాది కూడా వాదనలు కోర్టుకు వినిపించారు. సుమారు 45 నిమిషాలకు పైగా సునీతారెడ్డి, అవినాష్ రెడ్డి, సీబీఐ తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించగా.. ఫైనల్‌గా హైకోర్టు పై విధంగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు హాజరయ్యారు. నలుగురు నిందితులను కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. సీబీఐ కోర్టుకు ప్రధాన నిందితుడు ఎ1 ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కోర్టుకు హాజరజయ్యారు. దీనిపై తదుపరి విచారణ జూన్‌- 2కి వాయిదా వేసింది.

కాగా.. హైకోర్టు తీర్పు తర్వాత ఇరు పక్షాలు ఏం చేయబోతున్నాయ్..? కేసు ఎమర్జెన్సీ అని సీజే ఎదుట మెన్షన్ చేస్తారా..? లేకుంటే మళ్లీ హైకోర్టు తీర్పు వెలువరించేవరకూ వేచి చూస్తారా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు గడువు జూన్ 30 వరకే ఉండటంతో హైకోర్టు సూచన తర్వాత అధికారులు ఏం చేయబోతున్నారనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-04-28T17:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising