TS Politics : హిమాన్ష్ సూచన తప్పకుండా తీసుకుంటాం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-07-13T19:45:41+05:30
అవును.. టైటిల్ చూడగానే ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా.. మీరు వింటున్నది నిజమేనండోయ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు (HimanshuRao) సూచనను కాంగ్రెస్ (Congress) తప్పకుండా తీసుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ హిమాన్షు ఇచ్చిన సూచన ఏంటి..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన గురించే ఎందుకు చర్చించుకుంటున్నారు..? అసలు రేవంత్ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం..
అవును.. టైటిల్ చూడగానే ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా.. మీరు వింటున్నది నిజమేనండోయ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు (HimanshuRao) సూచనను కాంగ్రెస్ (Congress) తప్పకుండా తీసుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ హిమాన్షు ఇచ్చిన సూచన ఏంటి..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన గురించే ఎందుకు చర్చించుకుంటున్నారు..? అసలు రేవంత్ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం..
ఇదీ అసలు కథ..
హిమాన్షు రావు.. గౌలిదొడ్డిలోని కేశవనగర్ (Kesav Nagar) ప్రభుత్వ పాఠశాలకు సుమారు కోటి రూపాయిలు ఖర్చుపెట్టి మరమ్మతులు చేయించిన విషయం తెలిసిందే. తనతోపాటు చదువుకున్న స్కూల్ మిత్రులతో కలిసి విరాళాలు సేకరించి స్కూల్ పనులు చేయించారు. విరాళాలు సేకరించడం, స్కూల్‌ను బాగు చేయించడం.. ప్రారంభించడం ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ఈ కార్యక్రమంలో భాగంగా హిమాన్షు చేసిన ప్రసంగం ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఆయన చేసింది మంచి పనే అయినప్పటికీ ఇదే ఇప్పుడు బీఆర్ఎస్‌కు పెద్ద చిక్కులు తెచ్చిపెట్టింది.
మాటల్లో చెప్పలేను..!
‘ ఈ స్కూల్‌కు తొలిసారి నేను వచ్చినప్పుడు నా కళ్లలో నుంచి నీళ్లొచ్చాయి. ఆడపిల్లలకు సరైన బాత్‌రూమ్‌లు లేవు.. పందులు ఇక్కడే తిరుగుతున్నాయి. కనీసం స్కూల్లో మెట్లు కూడా సరిగా లేవు. ఆ బాధను నేను మాటల్లో చెప్పలేను. ఇలాంటి పరిస్థితులను నేనెప్పుడూ చూడలేదు. ఏదైనా నార్మల్‌గా చేసే అలవాటు లేదు.. గొప్పగా చేయాలన్నదే ఆలోచన. నిధులు సేకరించి పేదలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలనుకున్నాం. ఈ స్కూల్‌కు మంచి చేయడానికి మా తాత కేసీఆర్ గారే నాకు స్పూర్తి.. నా కుటుంబం, స్నేహితుల వల్లే సాధ్యమైంది ’ అని హిమాన్షు చెప్పుకొచ్చారు. కొందరు హిమాన్షును పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆయన ప్రసంగమే తెలంగాణలోని స్కూల్స్ ఎలా ఉన్నాయో చెప్పేస్తోందని విమర్శలు, తిట్ల వర్షం సైతం కురిపిస్తున్నారు. బంగారు తెలంగాణ అని సీఎం కేసీఆర్ అండ్ కో తెగ ఊదరగొడుతుంటారని సీన్ కట్ చేస్తే పరిస్థితేంటో ఆయన మనవడే చెప్పాడని ఇంకొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
రేవంత్ ఏమన్నారంటే..
తెలంగాణళో పాఠశాలల పరిస్థితి ఎలా ఉందో హిమన్ష్ బయట పెట్టారని రేవంత్ చెప్పుకొచ్చారు. హిమాన్ష్ సూచనను కాంగ్రెస్ తప్పకుండా తీసుకుంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను అధికారంలోకి రాకుండా చూసుకుంటామని రేవంత్ ధీమాగా చెప్పారు. వాస్తవానికి.. బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కూడా మెరుగుపడలేదని.. దాన్నే హిమాన్షు బయట పెట్టారనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంటే ఇప్పుడు స్వయంగా సీఎం మనవడే ప్రభుత్వం పరువు గోదాట్లో కలిపాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో చాలా స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవని.. ఆడపిల్లలు టాయ్‌లెట్లకు వెళ్లాలన్నా జంకుతున్నారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. కేసీఆర్ మనవడు స్కూల్ ప్రారంభం సంగతి అటుంచితే.. కాంగ్రెస్‌కు మంచి సువర్ణావకాశమే ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న, మొన్నటి వరకు రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్ నడవగా ఒక్కసారిగా హిమాన్షు హాట్ టాపిక్ అయ్యారు.
ఇవి కూడా చదవండి
Revanth Vs KCR : తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ నడుస్తుండగా.. షాకింగ్ సర్వే అంటూ సడన్‌గా బాంబ్ పేల్చిన రేవంత్ రెడ్డి
TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తేలిందంటే..!
TS BJP : తెలంగాణపై బీజేపీ దూకుడు.. పెద్ద ప్లాన్‌తోనే కమలనాథులు వచ్చేస్తున్నారుగా.. ముహూర్తం ఫిక్స్..!
Pawan Anna lezhneva : ఉంటే ఉంటా.. పోతే పోతా.. భార్యకు క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్.. భావోద్వేగం!
Kishan Reddy : కిషన్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడింది.. పయనం ఎటో తేల్చుకోలేక అయోమయంలో అధ్యక్షుడు..!?
Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?
Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?
Updated Date - 2023-07-13T19:52:55+05:30 IST