Home » Himanshu Kalvakuntla
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి (KK Mahender Reddy) సంచలన ఆరోపణలు చేశారు. 2009 నుంచి 2023 వరకు కేటీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.
అవును.. టైటిల్ చూడగానే ఇదేంటబ్బా..? అని అనుకుంటున్నారా.. మీరు వింటున్నది నిజమేనండోయ్.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు (HimanshuRao) సూచనను కాంగ్రెస్ (Congress) తప్పకుండా తీసుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ హిమాన్షు ఇచ్చిన సూచన ఏంటి..? ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన గురించే ఎందుకు చర్చించుకుంటున్నారు..? అసలు రేవంత్ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం..
హిమాన్షు చేసే పనులు చిన్నపిల్లల తరహాలో లేకుండా తాను పెద్దవాడినని చెప్పుకునే తరహాలో ఉంటున్నాయని నెటిజన్‌లు చెప్పుకుంటున్నారు. నిజానికి హిమాన్షు ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ కోసంం తన జేబులో నుంచి రూ.కోటి ఖర్చు చేయలేదు. ఫండ్ రైజింగ్ చేశాడు. సీఎం మనవడు, మంత్రి తనయుడు అంటే గొప్ప గొప్ప సంస్థలు కూడా భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో హిమాన్షు రూ.కోటి నగదును కలెక్ట్ చేయగలిగాడు.
కేశవనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు తరగతి గదుల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, బెంచ్‌లు, వంటి సదుపాయాలతో పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా హిమాన్షు ఏర్పాటు చేయించారు. బుధవారం హిమాన్షు రావు పుట్టిన రోజు సందర్భంగా ఆ పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.