ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS MLAs Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు.. సుప్రీంకోర్టుకు వ్యవహారం.. ఏం జరుగుతోందో..!

ABN, First Publish Date - 2023-02-07T20:14:11+05:30

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (BRS MLAs Poaching Case) హైకోర్టు నుంచి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (BRS MLAs Poaching Case) హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు (Supreme Court) చేరింది. ఇప్పటికే కేసును సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే తీర్పును మూడు వారాల పాటు నిలిపియాలని ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్‌లో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ న్యాయస్థానం రిట్ అప్పీల్ విచారణ డివిజన్ బెంచ్‌లో జరిగింది కాబట్టి.. చీఫ్ జస్టిస్ అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ న్యాయస్థానం కోరింది.. దీంతో ప్రభుత్వం డైరెక్ట్‌గా సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది... దీంతో వచ్చే వారం ఈ పిటిషన్‌పై విచారణ చేయనుంది.

మరో కీలక మలుపు..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు తిరిగింది. హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సిబిఐ కు బదిలీ చేస్తూ డిసెంబర్ 26వ తేదీన తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు 15 రోజులపాటు గడువు కావాలని గతంలో ప్రభుత్వం కోరింది. 15 రోజులు పాటు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీని సస్పెన్షన్‌లో ఉంచాలని ప్రభుత్వం కోరగా, ప్రభుత్వం కొరినట్లే జడ్జిమెంట్ సర్టిఫైడ్ కాపీపై సస్పెన్షన్ విధించింది. తీర్పు కాపీ రాగానే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోని డివిజన్ బెంచ్ కి వెళ్ళింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. క్రిమినల్ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ ఇచ్చిన కూడా డివిజన్ బెంచ్‌కి వెళ్లికూడదని, క్రిమినల్ పిటిషన్ తీర్పుపై సవాల్ చేయాలంటే సుప్రీంకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెపుతున్నారు. అయితే ప్రభుత్వం అలా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా.. హైకోర్టులోనే డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ పిటిషన్ వేశారు..

సుదీర్ఘ వాదనల తర్వాత..

ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణకు స్వీకరించింది. డివిజన్ బెంచ్‌లో కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి... ఢిల్లీ నుండి స్వయంగా సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ దవే ప్రభుత్వం వచ్చి తరపున వాదనలు వినిపించారు. డివిజన్ బెంచ్ లో సుదీర్ఘ వాదనలు తరువాత ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ రెండు రోజుల క్రితం తీర్పును వెలువరించింది హైకోర్టు. ఇందులో కేసు యొక్క మెరిట్స్ లోకి వెళ్లకుండా కేవలం రిట్ అప్పీల్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అని నిర్ధారించుకొని ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పును వెల్లడించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు సమర్థిస్తూ ఈ కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది.. అయితే సింగిల్ బెంచ్ ఆర్డర్ తో సీబీఐ (CBI) రంగంలోకి దిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించి, హుటాహుటిన మరోసారి హైకోర్టులోని సింగిల్ బెంచ్‌లో లంచ్ మోషన్ దాఖలు చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను 15 రోజులపాటు సస్పెన్షన్ చేయాలని కోరడంతో.. అప్పుడు ప్రభుత్వం కొరినట్లే 15 రోజులు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీపై సస్పెన్స్ చేసింది. ఇప్పుడు మరో మూడు వారాలపాటు తీర్పు అమలు కాకుండా సమయాన్ని పొడిగించాలని సింగిల్ బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ కోరారు.

మూడు సార్లు లేఖ తర్వాత..

ఇక అడ్వకేట్ జనరల్ వాదనలు కొనసాగుతుండగానే హైకోర్టు కలగజేసుకొని ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా? అని డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే, సీబీఐ ఇంకా కేసు నమోదు చేయలేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీకి మూడు సార్లు లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని హైకోర్టుకి తెలిపారు. అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ... కేసు వివరాలు అప్పగించాలని సీబీఐ ఒత్తిడి చేస్తుందని హైకోర్టు కి సమాధానం ఇచ్చారు. మీరు సుప్రీం కోర్ట్‌కు వెళ్లేందుకు ఎంత సమయం కావాలని న్యాయస్థానం అడగ్గా, తమకు వారం రోజులు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కోరారు.. అయితే పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకుని రావాలని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. బుధవారం ఉదయం చీఫ్ జస్టిస్‌ను అనుమతి కోరతామని ఏజీ హైకోర్టుకి తెలిపారు.

సుప్రీంకోర్టులో ఇలా..

ఈ లోగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ధర్మాసనాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే.. సాక్ష్యాలు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని దుష్యంత్ దవేకు (Dushyant Dave) సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ సూచించారు... బుధవారం ధర్మాసనం దృష్టికి తీసుకొస్తే వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామన్న సిజెఐ చంద్రచూడ్ సూచించారు. మీరు బుధవారం మెన్షన్ చేయకపోయినా వచ్చే వారం విచారణకు వస్తుందని సిజెఐ చంద్రచూడ్ (CJI Chandrachud) తెలిపారు.

ఏం జరుగుతుందో..

ఇప్పటికే రాజకీయంగా పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు లో హైకోర్టు తీర్పు ను సవాల్ చేశారు కాబట్టి బుధవారం చీఫ్ జస్టిస్ ముందు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉండదు. ఒక హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టుకు చేరింది కాబట్టి ఏమి జరగబోతోందో చూడాలి మరి.

******************************************

ఇవి కూడా చదవండి..

******************************************

MLA purchase Case: సుప్రీంకే వెళ్లండి!


******************************************

BRS MLAs Poaching Case: హైకోర్టు తీర్పుపై సుప్రీమ్‌కు వెళ్లాలని సిట్ నిర్ణయం

******************************************


Updated Date - 2023-02-07T20:19:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising