Bandi Sanjay Vs Ranganath : బండి సంజయ్ చేసిన ప్రతి ఆరోపణకు స్ట్రాంగ్ రియాక్షనిస్తూ.. ఛాలెంజ్ చేసిన సీపీ రంగనాథ్..
ABN, First Publish Date - 2023-04-11T18:40:29+05:30
బండి మాట్లాడిన ప్రతి ఆరోపణపైనా ప్రెస్‌మీట్ వేదికగా వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టెన్త్ పేపర్ లీకేజీ (Tenth Paper Leak) ఘటనను తెలంగాణ పోలీసులు (TS Police) సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే వరుసగా టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ ఆ తర్వాత టెన్త్ పేపర్లు లీకవ్వడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ సర్కార్ (KCR Govt).. నిందితులు ఎంతటివారైనా సరే వదల్లేదు. అయితే.. టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (TS BJP Chief Bandi Sanjay) పాత్ర ఉందని తేలడంతో ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌తో ఇది కాస్త బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా (BJP Vs BRS) మారిపోయింది. అయితే అరెస్ట్ తర్వాత పరిస్థితులు మరింత హీటెక్కాయి. తనపై కక్షగట్టి సీపీ రంగనాథ్ (Warangal CP Ranganath ) ఇదంతా చేస్తున్నారని.. ఆయన్ను వదిలే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బండి. దీంతో సీపీ రంగనాథ్ వర్సెస్ బండి సంజయ్ (Bandi Sanjay Vs Ranganath) పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం నాడు మీడియా ముందుకొచ్చిన బండి.. సీపీపై సంచలన ఆరోపణలు చేయడమే కాకుండా.. ఛాలెంజ్‌లు సైతం చేశారు. బండి మాట్లాడిన ప్రతి ఆరోపణపైనా ప్రెస్‌మీట్ వేదికగా వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు.
నిరూపిస్తే ఉద్యోగం వదిలేస్తా..!
‘బండి సంజయ్ నాపై అనేక ఆరోపణలు చేశారు. నేను ఎవరి పక్షాన ఉంటానో ప్రజలకు తెలుసు. వివిధ కేసుల్లో నేను కఠిన చర్యలు తీసుకుంటే వాళ్లకు బాధ ఉండొచ్చు.. వాళ్లు పోలీసులపై ఆరోపణలు చేస్తుంటారు. సెటిల్మెంట్‌లు చేశాననే ఆరోపణలు చూసి నవ్వాలో, ఏడవాలో నాకు అర్థం కావడం లేదు. నేను సెటిల్మెంట్‌లు చేసినట్లు నిరూపించండి. బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగానే ఉద్యోగం చేశాను. నాపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. పోలీస్ స్టేషన్ అన్నది న్యాయం అందించే తొలి మెట్టు. నా దగ్గరికి వచ్చిన వాళ్లకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రమాణం అనే మాట వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ప్రతి కేసులో ప్రమాణాలు చేసుకుంటూ పోతే నేను ఇప్పటి వరకూ 10వేల సార్లు ప్రమాణం చేయాల్సి వచ్చేది. నేను ప్రమాణం చేసే డ్యూటీలోకి వచ్చాను. కేసును కేసుగానే చూస్తాం.. నేను ఎలాంటి సెటిల్మెంట్లు చేయను. నేను సెటిల్మెంట్లు చేసినట్టు, నాకు అక్రమాస్థులు ఉన్నాయని నిరూపించండి, ఉద్యోగం వదిలి వెళ్లిపోతాను’ అని బండి సంజయ్‌కు సీపీ రంగనాథ్ ఛాలెంజ్ చేశారు.
ఫ్రస్టేషన్ ఉండటం సహజమే..!
‘నా గురించి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది. మా ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తున్నాం. మాకు ఏ ఒక్క రాజకీయ పార్టీపైనా కక్ష ఉండదు. బండి సంజయ్‌కు నాకు గట్టు పంచాయతీ లేదు. నాపై పరువు నష్టం దావా వేస్తే వేసుకోనివ్వండి. మా దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నాయి. కేసులో ముద్దాయి అయినప్పుడు ప్రస్టేషన్‌లో ఉండడం సహజం. బండి సంజయ్ ఫోన్ లాస్ట్ లొకేషన్ బెజ్జంకి దగ్గర ట్రేస్ అయింది. ఫోన్ మిస్సింగ్ కేసును కరీంనగర్ పోలీసులు చూస్తున్నారు. సీఆర్పీసీ 91 ప్రకారం కాల్‌డేటాను సేకరిస్తున్నాం. బీజేపీ వాళ్లను ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. . మాకు అలాంటి ఆలోచనే లేదు. ఇది లీకేజీ కేసు కాదు మాల్‌ప్రాక్టీస్ కేసు. మాల్ ప్రాక్టీస్ అని ముందుగా చెప్పింది నేనే. బయటికొచ్చిన పేపర్‌ను అందరికీ సర్క్యులేట్ చేశారు. మాల్ ప్రాక్టీసుకు ముందు జరిగిన విషయాలన్నింటినీ మేం సేకరిస్తున్నాం. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మీడియా ప్రతినిధులకు కూడా నోటీసులు ఇస్తున్నాం. సత్యంబాబు కేసు నేను హ్యాండిల్ చేయలేదు. నేను స్పెషల్ ఆఫీసర్‌గా నందిగామకు నన్ను పంపించారు. సత్యం బాబు కేసులో నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు’ అని రంగనాథ్ తేల్చిచెప్పారు.
ఇంతకీ బండి ఏమన్నారు..!?
సోమవారం నాడు ‘బలగం’ సినిమా (Balagam Movie) చూసిన అనంతరం సీపీపై సంచలన ఆరోపణలే చేశారు బండి సంజయ్. ‘ పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నాపై నిరాధార ఆరోపణలు చేసిన వరంగల్ సీపీ రంగనాథ్‌పై పరువు నష్టం దావా వేయబోతున్నాను. సీపీ ఫోన్‌కాల్ లిస్ట్ బయటపెడితే లీకేజీ వ్యవహారంపై సీఎంతో, మంత్రులతో ఎన్నిసార్లు ఎప్పుడెప్పుడు మాట్లాడారో తెలుస్తుంది. విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర మొదలు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆయన సంపాదించిన ఆస్తులు, పాల్పడిన అక్రమాలను వెలికితీస్తున్నాం. ఎంపీగా నా హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారు.. వీరిపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాను. నాపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు స్పీకర్ కార్యాలయాన్నీ తప్పుదోవ పట్టించారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు నేను పోలీసుల అదుపులోనే ఉన్నా, విడుదల చేసినట్లు స్పీకర్ కార్యాలయానికి తెలిపారు. సీపీకి దమ్ముంటే తనపై తప్పుడు కేసు నమోదు చేయలేదని ఖాకీ డ్రెస్‌పై ప్రమాణం చేయాలి. నా ఫోన్‌ను ఎత్తుకుపోయింది పోలీసులే. మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్న విషయం తెలిసి, భయపడి నా ఫోన్ దొంగిలించారు. సాయంత్రం 5 గంటలకు వాట్సాప్ ఆన్ చేశానని పోలీసులే అంటున్నారు.. మధ్యాహ్నమే పరీక్ష అయిపోతే సాయంత్రం ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో చూసి ఎవరికి పంపిస్తాను.. పోలీసులకు ఏమైనా తెలివి ఉందా..? ’ అని పోలీసులతో పాటు సీపీపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
మొత్తానికి చూస్తే.. ఇప్పుడు బండి సంజయ్- సీపీ రంగనాథ్ మధ్య పెద్ద ఎత్తునే మాటల తూటాలు, ఛాలెంజ్‌లు నడుస్తున్నాయ్. బండి ఆరోపణలకు సీపీ స్పందించగా.. ఇప్పుడు సీపీ కామెంట్స్‌కు బండి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అని బీజేపీ కార్యకర్తలు, వీరాభిమానులు ఎంతగానో వేచిస్తున్నారు. ఏం మాట్లాడుతారో చూడాలి మరి.
*****************************
ఇవి కూడా చదవండి..
*****************************
Ponguleti : మరికొన్ని గంటల్లో పొలిటికల్ ఫ్యూచర్ తేల్చేయనున్న పొంగులేటి.. ఆ తర్వాత నేరుగా ఢిల్లీకెళ్లి..!
*****************************
TS Politics : పొంగులేటి, జూపల్లికి టచ్‌లోకి వెళ్లిన బీజేపీ.. సరిగ్గా ఇదే టైమ్‌లో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
*****************************
TS Politics : పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు.. ఇద్దరి దారి ఒకటేనా.. వేర్వేరా.. టచ్‌లోకి వెళ్లిందెవరు..!
*****************************
Kiran Reddy : కిరణ్ రెడ్డిని ఒప్పించి దగ్గరుండి బీజేపీలో చేర్చింది.. కథ మొత్తం నడిపింది ఈయనే..!
*****************************
Updated Date - 2023-04-11T18:58:07+05:30 IST