ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BRS list KTR: క్రిశాంక్‌ను ట్విటర్ వేదికగా బుజ్జగించిన కేటీఆర్..!

ABN, First Publish Date - 2023-08-21T17:45:51+05:30

చాలా సామర్థ్యం, అర్హత ఉన్నకొందరికి సీట్లు దక్కకపోవడంపట్ల కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే ప్రజాజీవితంలో నిరాశను కూడా ఒక ముందుడుగా తీసుకోని ముందుకెళ్లాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఒక పేరును ప్రస్తావించారు. ఆయనే మన్నే క్రిశాంక్ (Manne Krishank).

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించిన తొలి జాబితాపై అమెరికాలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ట్విటర్ వేదికగా స్పందించారు. జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులందరికీ అభినందనలు తెలిపారు. టికెట్లు దక్కనివారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. చాలా సామర్థ్యం, అర్హత ఉన్నకొందరికి సీట్లు దక్కకపోవడంపట్ల కేటీఆర్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే ప్రజాజీవితంలో నిరాశ చెండకుండా ముందడుగు వేసి ముందుకెళ్లాలని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఒక పేరును ప్రస్తావించారు. ఆయనే మన్నే క్రిశాంక్ (Manne Krishank). హేమాహేమీలకు టికెట్లు దక్కకపోయినా పట్టించుకోని కేటీఆర్.. క్రిశాంక్ అనే వ్యక్తి గురించి ట్విటర్‌లో ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.


కేటీఆర్ ఎమన్నారంటే..

‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి హామీ దక్కిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ అభినందనలు. సిరిసిల్ల అభ్యర్థిగా తనను మరోసారి నామినేట్ చేసిన గౌరవనీయ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ప్రజాజీవిత ప్రయాణంలో నిరాశను ఒక అడుగుగా భావించి ముందుకుసాగాలి. చాలా సామర్థ్యం, అర్హత ఉన్న మన్నే క్రిశాంక్ (కంటోన్మెంట్ టికెట్ ఆశించిన వ్యక్తి) లాంటి కొంతమందికి సీట్లు కేటాయించలేకపోవడం దురదృష్టకరం. పోటీ అవకాశం ఉన్నా తిరస్కరణకు గురైన క్రిశాంక్‌తో పాటు మిగతావారికి వేరే రూపంలో ప్రజలకు సేవ చేసుకునే భరోసా పార్టీ లభిస్తుంది. ’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా మొత్తం 115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ మొదటి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.


క్రిశాంక్ రియాక్షన్ ఇదే..

తనకు టికెట్ దక్కకపోవడంపై మంత్రి కేటీఆర్ స్వయంగా స్పందించడం పట్ల మన్నే క్రిశాంక్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ అన్నా.. బీఆర్ఎస్ పార్టీ అనే పెద్ద కుటుంబంలో నాకు సభ్యుడిగా అవకాశం ఇచ్చింది మీరే. ఈ కుటుంబం రాష్ట్రవ్యాప్తంగా నాకు అమితమైన ప్రేమనిచ్చింది. మీరు లేకుంటే నా రాజకీయ జీవితం 2018-19లోనే ముగిసిపోయి ఉండేది. సాధ్యమైనప్పుడల్లా మీరు నా చెయ్యి పట్టుకుని నడిపించారు. నాకు, మా ఆవిడ సుహాసినికి అదే చాలు. ఎప్పటికీ మీతోనే కేటీఆర్ అన్నా !!’’ అని క్రిశాంక్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి క్రిశాంక్ బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. అయితే ఆ స్థానం నుంచి దివంగత సాయన్న కుమార్తె లాస్య నందితకు టికెట్ కేటాయించడం గమనార్హం.

Updated Date - 2023-08-21T18:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising