కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCBN Health : చంద్రబాబు బరువు తగ్గారా.. పెరిగారా..? ఏమిటీ కన్ఫ్యూజన్, గోప్యత..!?

ABN, First Publish Date - 2023-10-13T23:04:15+05:30

చంద్రబాబు.. చంద్రబాబు.. (Chandrababu) ఎక్కడ చూసినా ఈ పేరే.. ఏ ఇద్దరూ కలిసిన ఈయన గురించే చర్చ.! టీడీపీ అధినేత అరెస్టయ్యి 35 రోజులు అయ్యింది.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రజా నాయకుడు ఎలా ఉన్నారు..?..

NCBN Health : చంద్రబాబు బరువు తగ్గారా.. పెరిగారా..? ఏమిటీ కన్ఫ్యూజన్, గోప్యత..!?

చంద్రబాబు.. చంద్రబాబు.. (Chandrababu) ఎక్కడ చూసినా ఈ పేరే.. ఏ ఇద్దరూ కలిసిన ఈయన గురించే చర్చ.! టీడీపీ అధినేత అరెస్టయ్యి 35 రోజులు అయ్యింది.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రజా నాయకుడు ఎలా ఉన్నారు..? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? జగన్ సర్కార్ ఎందుకిలా చేస్తోంది..? బాబు అరెస్టుతో వైసీపీకి ఒరిగిందేమిటి..? రోజురోజుకూ వైసీపీ గ్రాఫ్ (YSRCP Graph) ఘోరంగా పడిపోతోందే తప్ప.. ప్రయోజనం ఏమైనా ఉందా..? ఇవే ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా ఇదే చర్చ. తెలుగు రాష్ట్రాలు, ఢిల్లీనే కాదు.. తెలుగు ప్రజలు ఉండే ప్రపంచ దేశాల్లోనూ ఇంతకుమించి చర్చ జరుగుతోంది. కాస్త ఓపిక పడితే అంతా మంచే జరుగుతుందని.. న్యాయస్థానాల్లో కచ్చితంగా చంద్రబాబే గెలుస్తారని టీడీపీ శ్రేణులు, దేశవిదేశాల్లో ఉండే వీరాభిమానులు చెబుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు డీ హ్రైడేషన్‌కు గురవ్వడం, చర్మ సంబంధిత అలర్జీ రావడంతో సెంట్రల్ జైల్లో అసలేం జరుగుతోంది..? అని కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఓ వైపు బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్.. మరోవైపు జీజీహెచ్ సూపరిడెంట్.. ఇంకోవైపు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్.. ఇటు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఒక్కలా ప్రకటనలు చేస్తుండటంతో.. ఈ కన్ఫూజన్‌తోనే గంట గంటకూ టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.


CBN-Arrest.jpg

ఎవరేమన్నారు..?

చంద్రబాబు ఆరోగ్యంపై మొదట్నుంచీ కుటుంబ సభ్యులు, ఆయన తరఫు లాయర్లు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వాలని.. విచారణ లాంటివి ఇంటి దగ్గరే చేయాలని న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. తీరా చూస్తే.. ఇప్పుడు బాబు అనారోగ్యంతో బెయిల్ ఇచ్చి ఉంటే బాగుండుందేమో.. ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అంటూ టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు.. ఈ మధ్యనే చంద్రబాబుతో ములాఖత్ అయ్యాక ఆయన ఆరోగ్యంపై సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బాబుకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు (Chandra Babu Weight) తగ్గారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయిఅని ట్విట్టర్‌లో భువనేశ్వరి (Nara Bhuvaneswari) పేర్కొన్నారు.

కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ : చంద్రబాబుకు రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రస్తుతం 67 కేజీల బరువు ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఏ మందులు ఇస్తున్నారనేది డాక్టర్‌కు, పేషెంట్‌కు మధ్య ఉండే ప్రైవసీ. హైప్రొఫైల్‌ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తాం. జైలులో 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. చంద్రబాబు ప్రతీ మూమెంట్‌ సీసీటీవీలో రికార్డవుతుంది. చంద్రబాబు బరువు తగ్గారన్నది పూర్తిగా అవాస్తవం. ఇకపై ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం అని రవికిరణ్ ఒకింత హెచ్చరించారు.

వైద్యులు : చంద్రబాబుకు చర్మ సంబంధిత అస్వస్థత ఉందని జైలు శాఖ అధికారుల నుంచి లెటర్ వచ్చింది. చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీతలు బాబుకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. చంద్రబాబు వైద్య పరీక్షలపై వివరాలన్నీ సీల్డ్ కవర్‌లో (Sealed Cover) అందజేశాం’ అని లక్ష్మీ సూర్యప్రభ ఏబీఎన్‌తో చెప్పారు. మరోవైపు.. చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సునీతాదేవి కూడా ఏబీఎన్‌తో మాట్లాడారు. సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశాం. జైలులో చంద్రబాబుకు చర్మ సంబంధిత అస్వస్థతపై మందులు సిపార్సు చేశాంఅని తెలిపారు. అయితే.. సీల్డ్ కవర్‌లో ఏముంది..? అనేదానిపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎందుకీ కన్ఫూజన్!

ఇవన్నీ అటుంచితే.. చంద్రబాబు చర్మ సంబంధిత అలర్జీ వ్యాధికి గురయ్యాక వరుసగా రెండ్రోజులు వైద్య పరీక్షలు చేసి డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అయితే ఆయన బరువుపై ఇంతగా కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు కంగారుపడుతున్నా.. బులెటిన్‌గా ఆ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ఇవాళ సాయంత్రమే జైళ్ల శాఖ డీఐజీ మీడియా మీట్ పెట్టి మరీ బరువు తగ్గలేదు అని చెప్పారు కదా.. మరి అదే విషయాన్ని హెల్త్ బులెటిన్‌గా క్లారిటీగా ఎందుకు చెప్పలేకపోతున్నారని పెద్ద అనుమానంగా మారింది. వైద్యాధికారులు, జైలు శాఖ అధికారులు ఎందుకింత కన్ఫూజ్ అవుతున్నారు..? అయినా ఎందుకింత గోప్యత పాటిస్తున్నారు..? అనేది ఎవరికీ తెలియని పరిస్థితి. పోనీ బాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లే బరువుపై క్లారిటీ ఇవ్వాలంటే.. ఆయన బరువు ఎంత అనేది క్లారిటీ లెక్కేసి.. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బులెటిన్ రిలీజ్ చేస్తే క్లియర్ కట్‌గా తెలిసిపోతుంది కదా..?.. ఈ మాత్రం దానికే ఎందుకింత రచ్చ.. అంతకుమించి కన్ఫూజన్..?. ఇలా చేస్తే బాబు ఆరోగ్యం ఎలా ఉంది..? బరువు ఎంతున్నారు..? అనే విషయంపైనా క్లారిటీ వచ్చేస్తుంది కదా..?. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు ఎలా ముందుకెళ్తారు..? ఈ విషయంపై టీడీపీ ఎలా ముందుకెళ్తుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Ponnala Resign : పొన్నాల రాజీనామాపై రేవంత్ రెడ్డి రియాక్షన్ చూశారో..?


Big Breaking : ఫైబర్‌నెట్ కేసులో జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాక్.. వైసీపీలో టెన్షన్!



Updated Date - 2023-10-13T23:10:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising