ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : వైసీపీకి బాలినేని శ్రీనివాస్ నిజంగానే గుడ్ బై చెబుతున్నారా..!?

ABN, First Publish Date - 2023-08-11T18:00:43+05:30

మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తున్నారు..! సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ఆయనకు పడట్లేదు..! కో-ఆర్డినేటర్ పదవి ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) ఇవ్వడం, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు (Prakasam) తనకు వదిలేయాలని పదే పదే అడిగినా జగన్ ఒప్పుకోకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు.!...

మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తున్నారు..! సీఎం వైఎస్ జగన్ రెడ్డితో (CM YS Jagan Reddy) ఆయనకు పడట్లేదు..! కో-ఆర్డినేటర్ పదవి ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy) ఇవ్వడం, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు (Prakasam) తనకు వదిలేయాలని పదే పదే అడిగినా జగన్ ఒప్పుకోకపోవడంతో బాలినేని తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు.! ఇవీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని ఛానెల్స్‌లో వస్తున్న వార్తలు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్‌కు అత్యంత సమీప బంధువు కావడంతో ఈ వార్తలకు మరింత హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి బాలినేని చెవిన పడటంతో ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చి.. క్లారిటీ ఇచ్చుకున్నారు.


ఇదీ అసలు కథ..

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలో అసంతృప్తులు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హైకమాండ్‌పై తిరగబడి పార్టీకి గుడ్ బై చెప్పేయగా.. మరికొందరు అదే బాటలో నడవడానికి సిద్ధమూపోతున్నారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. పైగా ఈ మధ్యనే ఒకరిద్దరు మంత్రులకు ఎంపీలకు పడకపోవడంతో ఇదంతా నిజమేనని వైసీపీ నేతలే చెప్పుకోవాల్సిన పరిస్థితి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే బాలినేని పార్టీ వీడుతున్నారన్న వార్త ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. వారం రోజులుగా ఇలా వార్తలు రావడం, అధిష్టానం నుంచి గానీ.. బాలినేని నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే.. ఈ వ్యవహారంపై ఫస్ట్ టైమ్ బాలినేని స్పందించారు. ‘వైసీపీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్నాను. నేను పార్టీ మారుతున్నానని ఎప్పుడూ చెప్పలేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. వైఎస్ జగన్ నాయకత్వంలోనే పనిచేస్తాను’ అని బాలినేని క్లారిటీ ఇచ్చుకున్నారు.

కాగా.. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి బాలినేని తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డికి జగన్ కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాల బాధ్యతలను కూడా జగన్ అప్పగించారు. అయితే.. ప్రకాశం వరకు మాత్రం తనకే ఇవ్వాలని.. ఒకట్రెండుసార్లు జగన్‌ను బాలినేని అడిగారు కూడా. ఆ తర్వాతే బాలినేని అసంతృప్తికి లోనయ్యారు. పైగా మీడియాకు.. సోషల్ మీడియాకు ఈ మధ్య కాస్త దూరం ఉంటూ వస్తుండటంతో ఇలాంటి వార్తలు వచ్చాయి. దీంతో మీడియా ముందుకు వచ్చి బాలినేని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇకనైనా బాలినేనిపై ఇలాంటి వార్తలు ఆగుతాయో లేదో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Minister Vs MP : మధ్యాహ్నం ఒంటి గంటకే తాడేపల్లికి రావాల్సిన జగన్.. ఇంకా అమలాపురంలోనే మకాం.. చర్చలు సక్సెస్ అయ్యేనా..!?


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


YS Sharmila : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనమే.. ఈ ఒక్క పరిణామంతో క్లియర్ కట్‌గా తెలిసిపోయిందిగా..!?


TS Assembly Election 2023 : ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన కాంగ్రెస్.. ఇక అస్త్రాలు ప్రయోగించడమే ఆలస్యం.. ఈ దెబ్బతో..!


Updated Date - 2023-08-11T18:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising