ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gannavaram YCP: టీడీపీలోకి యార్లగడ్డ? ఈ వార్తలు ఎందుకు గుప్పుమన్నాయంటే..

ABN, First Publish Date - 2023-08-12T14:06:06+05:30

యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో ఈనెల 13న గన్నవరంలో భారీ ఎత్తున ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గన్నవరం రావ్‌ఫిన్‌ వెంచర్‌లోని ఎస్‌ఎం కన్వెన్షన్‌ హాలులో జరిగే ఈ సమావేశానికి అటు వైసీపీ కార్యకర్తలు, నాయకులతోపాటు ఇటు టీడీపీ వారినీ ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి): వైసీపీ సీనియర్‌ నేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీ మారేందుకు రంగం సిద్ధమైందా? జరుగుతున్న సన్నాహాలను పరిశీలిస్తే ఔననే సమాధానం వస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో ఈనెల 13న గన్నవరంలో భారీ ఎత్తున ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. గన్నవరం రావ్‌ఫిన్‌ వెంచర్‌లోని ఎస్‌ఎం కన్వెన్షన్‌ హాలులో జరిగే ఈ సమావేశానికి అటు వైసీపీ కార్యకర్తలు, నాయకులతోపాటు ఇటు టీడీపీ వారినీ ఆహ్వానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. అప్పటి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో వైసీపీ అధిష్ఠానం ఆయనకు కేడీసీసీబీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. అదే సమయంలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా ఆయనే కొనసాగుతూ వచ్చారు.


అయితే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వంశీ వైసీపీలోకి మారడంతో యార్లగడ్డ వర్గం క్రమంగా నియోజకవర్గానికి దూరం కావాల్సి వచ్చింది. మరోవైపు రానున్న ఎన్నికల్లో గన్నవరం వైసీపీ టికెట్‌ను వంశీకి ఇచ్చే అవకాశాలు ఉండటంతో వెంకట్రావు రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ అంశంపై వైసీపీ అధిష్ఠానం నుంచి స్పష్టత తీసుకునేందుకు పార్టీ అధినేత జగన్‌ను కలిసేందుకు వెంకట్రావు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన రాజకీయ భవిష్యత్తును ఖరారు చేసుకునేందుకు వెంకట్రావు 13న తన క్యాడర్‌తో సమావేశం అవుతున్నట్లు చెబుతున్నారు. ఆ సమావేశంలో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

యువగళంలోనే టీడీపీ కండువా

టీడీపీ యువనేత లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఈ నెల 19న ఎన్టీఆర్‌ జిల్లాలోకి ప్రవేశించనుంది. సుమారు వారం రోజులపాటు ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో పెద్దఎత్తున కార్యకర్తలతో టీడీపీలో చేరేందుకు వెంకట్రావు సన్నాహాలు చేసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Updated Date - 2023-08-12T14:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising