ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yuvagalam Udaya Bhanu: వైసీపీకి ఈ వంకర బుద్ధేంటో ఎవరికీ అర్థంకాదు.. మళ్లీ అదే ప్రవర్తన... ఈ ప్రశ్న అడిగితే ఏం చేస్తారో?

ABN, First Publish Date - 2023-07-31T11:52:44+05:30

3 రోజుల క్రితం ఒంగోలులో ‘జయహో బీసీ సభ’ జరిగింది. పెద్ద సంఖ్యలో జనం హాజరైన ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయ భాను అనుసంధానకర్తగా వ్యవహరించారు. లోకేష్ సమక్షంలో జరిగిన ఈ సభలో ఉదయ భాను బాధితులకు మైక్ అందించి వారి బాధలను సభ దృష్టికి తీసుకొచ్చారు. హూందాగా, ఓపిగ్గా వింటూ బాధితులకు ఓదార్పునిచ్చారు. వేర్వేరు ఘటనల్లో బాధితులైన బీసీలకు టీడీపీ కుటుంబం అండగా నిలుస్తుందని లోకేష్ సమక్షంలో ఆమె భరోసా కల్పించారు. ఆమె ఈ విధంగా బాధితులకు గొంతుకనివ్వడం, అందునా టీడీపీ కార్యక్రమంలో పాల్గొనడం పాలక పక్షానికి ఏమాత్రం రుచించలేదు.

అన్యాయాలు, అరాచకాలపై బాధితులు గొంతు విప్పినా.. వైఫల్యాలు, దౌర్జన్యాలపై విపక్షాలు ప్రశ్నించినా.. అక్రమాలను బయటపెట్టినా, నిలదీసినా.. ఏమాత్రం సహించలేని ప్రభుత్వంగా పేరొందిన జగన్ సర్కార్‌!!. (YS Jagan) విపక్ష పార్టీలకు ఎవరైనా మద్ధతు తెలిపితే మాత్రం ఊరుకుంటుందా?. తన సహజసిద్ధమైన నైజాన్ని, అక్కసును వెళ్లగక్కుతుంది. ఓర్వలేనితనంతో కూడిన ఈ బుద్ధినే వైసీపీ మరోసారి ప్రదర్శించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) దిగ్విజయంగా కొనసాగిస్తున్న ‘యువగళం పాదయాత్ర’లో (Yuvagalam Paadayatra) భాగంగా.. 3 రోజుల క్రితం ఒంగోలులో ‘జయహో బీసీ సభ’ జరిగింది. పెద్ద సంఖ్యలో జనం హాజరైన ఈ కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఉదయ భాను (Udaya Bhanu) అనుసంధానకర్తగా వ్యవహరించారు.

లోకేష్ సమక్షంలో జరిగిన ఈ సభలో ఉదయ భాను పలువురు బీసీ బాధితులకు మైక్ అందించి వారి బాధలను సభ దృష్టికి తీసుకొచ్చారు. హూందాగా, ఓపిగ్గా వింటూ బాధితులకు ఓదార్పునిచ్చారు. ధైర్యం చెప్పారు. బాధితులైన బీసీలకు టీడీపీ కుటుంబం అండగా నిలుస్తుందని లోకేష్ సమక్షంలో ఆమె భరోసానిచ్చారు. అయితే ఆమె ఈ విధంగా బాధితులకు గొంతుకనివ్వడం, అందునా టీడీపీ కార్యక్రమంలో పాల్గొనడం పాలక పక్షం శ్రేణులకు కంటగింపుగా మారింది. ఆ కార్యకర్తలు, నేతలు ఏమాత్రం రుచించలేకపోయారు.

టీడీపీ కార్యక్రమంలో ఉదయ భాను చురుకుగా కనిపించడం, పైగా ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడం వైసీపీ శ్రేణులకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే సోషల్ మీడియాలో ఉదయ భానును ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. తమకే సాధ్యమైన రీతిలో వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇక ‘అట్రాక్షన్’ జతచేసి జనాన్ని మొబిలైజ్ చేయడం మొదలుపెట్టారంటూ టీడీపీపై (TDP) విమర్శలు చేయడం మొదలుపెట్టారు. వైసీపీ సోషల్ మీడియా బ్యాచే కాదు.. ప్రధాన నేతలు సైతం యువగళం యాత్రకు గ్లామర్ అద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్‌ను హైదరాబాద్ నుంచి రప్పించడం చూశామని వ్యాఖ్యానించారు. ఇక నుంచి సినీ నటుల సందడి మొదలవుతుందని అర్థమవుతోందని అన్నారు. అయితే విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆ పార్టీకి సమాధానం చెప్పలేదని పరిస్థితి తెచ్చిపెట్టాయి. అంతేకాదు ఒకింత నవ్వుల పాలు కూడా చేస్తున్నాయి. ఆ పార్టీ నేతల దగ్గర సమాధానం లేని ప్రశ్నలను లేవనెత్తున్నాయి.


పృథ్వీ, అలీ, పోసాని వీళ్లంతా ఎవరు మరి?

ఉదయ భాను ఒక కార్యక్రమంలో పాల్గొని యాంకరింగ్ చేస్తేనే సినీ గ్లామర్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఇంతలా ఉలిక్కిపడ్డ వైసీపీ శ్రేణులకు టీడీపీ మద్ధతుదారులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ప్రముఖ సినీ నటులు పోసాని కృష్ణమురళీ, అలీ, పృథ్వీ, జీవిత, రాజశేఖర్, శ్యామల వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనలేదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఉందా?.. అని నిలదీస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ చేస్తున్న విన్యాసాలు మీకు కనిపించడం లేదా?.. టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. దీంతో వైసీపీ నుంచి సమాధానం లేకుండా పోయింది. రెండు నెలలక్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కూడా వైసీపీ ఇదేవిధంగా వ్యవహరించింది. చంద్రబాబు విజనరీ అన్న పాపానికి ఆయనను దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీంతో వైసీపీకి ఇదేం వంకరబుద్ధో ఎవరికీ అర్థంకావడంలేదని మాట వినిపిస్తోంది.

వైసీపీ పోకడని బట్టి చూస్తే విషయాన్ని జనాల్లోకి ప్రబలంగా తీసుకెళ్లేవారిని చూస్తే వైసీపీ కలవరపాటుకు గురవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక విపక్షాలకు మద్ధతు తెలిపే ప్రముఖులను భయపెట్టి, బెదిరించడం ద్వారా మరెవరూ మద్థతుగా నిలవకుండా చేయాలనేది వైసీపీ వ్యూహం, ప్రయత్నం కావొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ధోరణి ఏమంత మంచిది కాదని, జనాలు అంతా గమనిస్తున్నారంటూ హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-07-31T11:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising