కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!

ABN, First Publish Date - 2023-06-29T22:27:31+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ రెడ్డికి (AP CM YS Jagan Reddy) యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddhartha Reddy) రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడిందా..? వైసీపీ (YSR Congress) అధినేతకు అల్టిమేటం జారీ చేశారా..? మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం.. ఈ నాలుగింటిలో ఎక్కడో ఒకచోట పోటీకి దింపుతున్నట్లు ప్రకటిస్తే సరే లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తేల్చిచెప్పేశారా..? ఇన్నిరోజులు పార్టీకి సేవలు చేసిన తగిన గుర్తింపు, ఇచ్చిన పదవితో సంతృప్తిగా లేరు.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమే అని తెలుస్తోంది...

Byreddy Vs Jagan : వైఎస్ జగన్‌కు బైరెడ్డి అల్టిమేటం.. నాలుగు ఆప్షన్లు ఇచ్చిన యువనేత.. దిక్కుతోచని స్థితిలో సీఎం.. ఏ నిమిషానికి..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ రెడ్డికి (AP CM YS Jagan Reddy) యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddhartha Reddy) రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడిందా..? వైసీపీ (YSR Congress) అధినేతకు అల్టిమేటం జారీ చేశారా..? మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ నియోజకవర్గం.. ఈ నాలుగింటిలో ఎక్కడో ఒకచోట పోటీకి దింపుతున్నట్లు ప్రకటిస్తే సరే లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తేల్చిచెప్పేశారా..? ఇన్నిరోజులు పార్టీకి సేవలు చేసిన తగిన గుర్తింపు, ఇచ్చిన పదవితో సంతృప్తిగా లేరు.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ లేదా పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని డిసైడ్ అయ్యారా..? అంటే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇవన్నీ అక్షరాలా నిజమే అని తెలుస్తోంది. ఇంతకీ బైరెడ్డి (Byreddy) ఇంత కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? యువనేత కోరుతున్న ఆ నియోజకవర్గాలేంటి..? ఒకవేళ ఆ నాలుగింటిలో ఏదో ఒక సీటు ఇచ్చినా అక్కడున్న సిట్టింగ్‌ల పరిస్థితేంటి..? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..

WhatsApp Image 2023-06-29 at 9.31.28 PM (1).jpeg

ఇదీ అసలు కథ..

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.. యూత్‌లో (Youth) ఈయనకున్న క్రేజే వేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ యువనేతకు (Yuvanetha) భారీగా అభిమానులున్నారు.. ఈయన సభ పెట్టినా, ఇంటి నుంచి బయటికొచ్చినా వందలాది మంది అభిమానులు, అనుచరులు వచ్చేస్తుంటారు. యూత్‌లో ఇంత క్రేజ్‌ ఉందిగనుకే దాన్ని క్యాష్ చేసుకోవడానికే అప్పట్లో బైరెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించి కండువా కప్పారు జగన్. మొదట అనుకున్నంత ప్రియారిటీ లేకున్నప్పటికీ ఆ తర్వాత ఏదో కాస్తో కూస్తో ప్రాధాన్యత ఉన్న శ్యాప్ (Sports Authority Of Andhra Pradesh) బాధ్యతలను జగన్ కట్టబెట్టారు కానీ.. రోజుకో వివాదం తప్పితే ఇంతవరకూ క్రీడలను ఉద్దరించిన దాఖలాల్లేవ్. దీంతో బైరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తన సేవలను నియోజకవర్గం, జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకుంటూ.. కనీసం చట్టసభలకు కూడా పంపరా..? ఇదేం న్యాయం అని అధిష్టానాన్ని బైరెడ్డి నీలదీశారట. అందుకే రానున్న ఎన్నికల్లో కర్నూలు సిటీ (Kurnool City) , పాణ్యం (Panyam) , శ్రీశైలం (Srisailam) ఈ మూడింటిలో ఏదో ఒకచోట టికెట్ ఇవ్వాలని.. కుదరని పక్షంలో నంద్యాల (Nandyal) ఎంపీ సీటు అయినా సరే ఇవ్వాలని.. ఇవేవీ ఇవ్వని పక్షంలో కీలక నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుందని డైరెక్టుగా జగన్‌కు అల్టిమేటం జారీచేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి చట్టసభల్లోకి అడుగుపెట్టాలని ఈసారి గట్టిగానే బైరెడ్డి నిర్ణయం తీసుకున్నారన్న మాట.

ఆ నాలుగు నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదీ..

కర్నూలు సిటీ నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. ఇక్కడ మైనార్టీ కమ్యూనిటీ ఎక్కువ. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ (Hafeez khan) ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసి గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇక్కడ్నుంచే పోటీచేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు.. ఇదే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి (SV Mohan Reddy) పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఎస్వీ.. టీడీపీలోకెళ్లి (Telugudesam) మళ్లీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. సీటు కోసం ప్రయత్నాలు చేశారు కానీ వర్కవుట్ అవ్వలేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే సీటు దక్కించుకోవాలని ఇప్పట్నుంచే జగన్ దృష్టిలో పడటానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. మరోవైపు అధిష్టానానికి దగ్గరగా ఉన్న కొందరు కీలక నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరిలో ఎవర్నో తేల్చలేకపోతున్న జగన్‌కు ఇప్పుడు బైరెడ్డి కూడా ఒకరు తోడు అయితే పరిస్థితేంటన్నది ప్రశ్నార్థకమే.

ఇక శ్రీశైలం నియోజకవర్గం విషయానికొస్తే.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణి రెడ్డి (Silpa Chakrapani Reddy) ఉన్నారు. శిల్పా ఫ్యామిలీకి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందే. పొరపాటున శిల్పా ఫ్యామిలీని (Silpa Family) కాదని బైరెడ్డికి టికెట్ ఇస్తే.. కచ్చితంగా ఈ ఫ్యామిలీ మరుక్షణం ఆలోచించకుండా టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ (Allagadda) ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి దబిడిదిబిడే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదేమోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడిక వైసీపీ చేజేతులారా ఒక్కసీటు కోసం పోయి.. రెండు సీట్లు పోగొట్టుకున్నట్లు అవుతుందన్నది విశ్లేషకుల మాట.

ఇక పాణ్యం విషయానికొస్తే.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి (Katasani Ramabhupal Reddy) ఉన్నారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో, ఫ్యాక్షన్‌లో ఆరితేరిన ఫ్యామిలీకి కాటసాని కుటుంబానికి గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచే అన్నదమ్ములిద్దరూ ప్రస్తుతం పాణ్యం (రామ్ భూపాల్ రెడ్డి), బనగానపల్లె (కాటసాని రామిరెడ్డి) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పొరపాటున ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని టచ్ చేసినా రెండు సీట్లు ఫట్ అంతేనట. ఎందుకంటే ఒకానొక సందర్భంలో రామ్ భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తే 60,598 ఓట్లు వచ్చిన పరిస్థితి. ఇలాంటి ఆయన్ను టచ్ చేస్తే ఇక రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి ఏ గతి పడుతుందో జగన్‌కే తెలియాలి మరి.

ఇక చివరిగా నంద్యాల పార్లమెంట్ స్థానం విషయానికొస్తే.. సిట్టింగ్ ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి (Pocha Brahmananda Reddy) ఉన్నారు. ఈయన రాజకీయాలకు కొత్త అయినప్పటికీ జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమలో (Rayalaseema) ఆయనకున్న అంగబలం, ఆర్థిక బలాన్ని చూసిన వైఎస్ జగన్ ఏరికోరి మరీ వైసీపీ కండువా కప్పి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈయన్ను మించిన బలమైన వ్యక్తి ప్రస్తుతానికి వైసీపీకి అక్కడలేరు. పైగా ఈసారి పోచా వద్దనుకుంటే మాత్రం ఇక్కడ్నుంచి పోటీచేయడానికి మాజీ ఎంపీ బుట్టా రేణుక రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలోనే ఈ సీటు కోరినప్పటికీ వైసీపీ అధిష్టానం ఇవ్వలేదు. ఈ ఇద్దర్నీ కాదని.. బైరెడ్డికి సీటిచ్చే పరిస్థితి మాత్రం కనిపించట్లేదని వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారట.

జగన్ ముందున్న ఆప్షన్లు ఏంటి..?

చూశారుగా.. కొండ నాలుకకు ముందేస్తే ఉన్న నాలుకే ఊడిందన్నట్లుగా జగన్ పరిస్థితి ఉందన్న మాట. పైన చెప్పిన నాలుగు నియోజకవర్గాల్లో ఏ ఒక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మార్చినా గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి అదోగతి అన్నట్లేనని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. సో.. బైరెడ్డి రూపంలో జగన్‌కు పెద్ద చిక్కే వచ్చిపడిందట. బైరెడ్డికి ఆప్షన్ లేదు కానీ.. పోటీ చేయాల్సిందేనని ఆయన తహతహలాడుతున్నారట. ఈ పరిస్థితుల్లో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారు..? జగన్ నిర్ణయం తర్వాత బైరెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది..? యువనేతను అడ్డుపెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించాలని భావించిన జగన్‌కు ఎన్నికలకు ముందే.. యువనేత ఇలా అల్టిమేటం జారీచేస్తే.. ఎన్నికలు సమీపించేకొద్దీ ఇంకెంత మంది తిరుగుబాటు చేస్తారో.. అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే మరి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎమ్మెల్యే లేదా ఎంపీ (MLA Or MP) అయితేనే ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అంటే అస్సలు వద్దే వద్దని కూడా జగన్ ముందే బైరెడ్డి తేల్చి చెప్పేశారట.

పొరపాటున ఇదేగానీ జరిగితే..!

మొత్తానికి చూస్తే.. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డికి టికెట్ అన్నది జగన్‌కు అతి పెద్ద టాస్కేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ యువజన సంఘం అధ్యక్షుడిగా, శ్యాప్ చైర్మన్‌గా ఉన్న బైరెడ్డికి గతంలోనే టీడీపీ (TDP), బీజేపీ (BJP) నుంచి ఆఫర్లు వచ్చాయన్నది అందరికీ తెలిసిందే. ఆ మధ్య టీడీపీలో చేరబోతున్నారని.. యువనేత నారా లోకేష్‌తో రహస్యంగా భేటీ అయ్యారని కూడా వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు మరోసారి బైరెడ్డి వ్యవహారం తెరపైకి రావడంతో ఏం జరుగుతుందా అని ప్రతిపక్ష పార్టీలు వేచి చూస్తున్నాయట. 175 అసెంబ్లీ స్థానాలన్నీ ఒక లెక్క అయితే.. బైరెడ్డి ఒక్కడికి సీటివ్వడానికి జగనే తల పట్టుకుంటున్న పరిస్థితి వచ్చిందట. ఈ పరిస్థితుల్లో బైరెడ్డి అల్టిమేటంకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? ఎవర్ని పక్కనెట్టి యువనేతకు ఛాన్స్ ఇస్తారో..? ఇవన్నీ కాదని కీలక పదవి ఏదైనా ఇస్తానని మాటిచ్చి.. పార్టీ మారకుండా చూసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. ఏ నిమిషానికి ఏం జరుగునో చూద్దాం మరి..!

ఇవి కూడా చదవండి


TS Congress : కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌదరి నిజంగానే బీజేపీలో చేరుతున్నారా.. ఇదిగో ఫుల్ క్లారిటీ..


TS Congress : పొంగులేటిని ఒప్పించి కాంగ్రెస్‌లో చేరికకు చక్రం తిప్పిన ఈ ‘పెద్దాయన’ ఎవరబ్బా.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. హీరో వెంకటేష్‌కు ఏంటి సంబంధం..!?



Big Twist : ఓహో.. విజయసాయిని వైఎస్ జగన్ పక్కనపెట్టింది ఇందుకా.. పెద్ద కథే నడుస్తోందే..!?


TS Politics : ఈటలకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందా.. జమున కీలక ప్రకటన చేయబోతున్నారా.. అభిమానులు, అనుచరుల్లో నరాలు తెగే ఉత్కంఠ..!


TS BJP : ‘కమలం’లో కల్లోల్లం.. గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైన ఎమ్మెల్యే రఘునందన్.. ఇదేగానీ జరిగితే..!


Updated Date - 2023-06-29T22:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising