Viveka Murder Case : వివేకా కేసు విచారణ కీలక దశలో ఉండగా ప్రత్యక్ష సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత..
ABN, First Publish Date - 2023-05-02T22:39:37+05:30
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో ట్విస్ట్.. గంటకో మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో ట్విస్ట్.. గంటకో మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసిన సీబీఐ (CBI) రెండు మూడ్రోజుల్లో మరో కీలక పరిణామాలు చోటుచేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లో వివేకా ఇంటి వాచ్‌మెన్, కేసులో కీల సాక్షిగా (ప్రత్యక్ష సాక్షి) ఉన్న రంగన్న (Eyewitness Ranganna) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రంగన్న మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు, ఆయనకు భద్రత కల్పిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది స్థానికంగా పులివెందులలో ఉన్న ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడ్నుంచి అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఇంకా తెలియరాలేదు.
ఎవరీ రంగన్న..!?
2019 మార్చి 15న పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్ వివేకా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహాన్ని వాచ్‌మెన్ రంగన్న, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి లక్ష్మమ్మలు చూశారు. బెడ్‌రూంలో పరిస్థితిని వివేకా స్టెనో ఇనయతుల్లా ఫొటోలు తీసి వివేకా అల్లుడికి పంపించారు. అక్కడి సీన్ చూసిన తర్వాత గుండెపోటు కేసును చివరికి హత్యగా నమోదు చేశారు. ఆ తర్వాత సీబీఐ అధికారులు ప్రత్యేకంగా రంగన్నను విచారించారు. హత్య జరిగిన రోజు నలుగురు నిందితులను చూశానని రెండేళ్ల కిందట జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు సీఆర్పీసీ 164 కింద రంగన్న వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. రంగన్న వాంగ్మూలంలో వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి పేరును పదేపదే ప్రస్తావించారు. అంతేకాదు.. హత్య విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించాడని రంగన్న చెప్పడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఈ కేసు మొత్తంలో ఈయనే కీలక సాక్షి కావడంతో ఆయన్ను కాపాడుకోవడానికి సీబీఐ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం రంగన్నకు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని సీబీఐ కల్పించింది. రంగన్న అస్వస్థతకు గురవ్వడంతో ఆయన్ను మొదట పులివెందులకు, ఆ తర్వాత తిరుపతికి కూడా సెక్యూరిటీనే తరలించింది. భార్యతో రంగన్న పులివెందులలో నివాసముంటున్నారు. కేసు విచారణ కీలక దశలో ఉన్న ఈ సమయంలో రంగన్న ఆస్పత్రిపాలవ్వడంతో సీబీఐ అధికారులు కాస్త ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ దూకుడు..
ఇదిలా ఉంటే.. ఈ కేసులో సహనిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అటు హైకోర్టులో.. ఇటు సుప్రీంకోర్టు ఊహించని ఎదురుదెబ్బలు తగలడంతో సీబీఐ విచారణలో దూకుడు పెంచింది. ఇప్పటికే అవినాష్‌ను, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను విచారించిన సీబీఐ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు.. మంగళవారం నాడు వివేకా పీఏ కృష్ణారెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచీ సీబీఐ లోతుగా విచారించింది. హత్యను ప్రత్యక్షంగా చూసిన వారిలో పీఏ కూడా ఒకరు కావడంతో కీలక సమాచారం రాబట్టడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వివేకా హత్యరోజు దొరికిన లేఖ గురించి అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Chikoti Praveen : థాయిలాండ్‌లో అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పేసిన చికోటి ప్రవీణ్..
******************************
Balineni Meets CM Jagan : అరగంటపాటు బుజ్జగించిన సీఎం జగన్.. వద్దంటే వద్దని తేల్చిచెప్పేసిన బాలినేని.. మీడియా కంటపడకుండా..
******************************
Updated Date - 2023-05-02T22:48:02+05:30 IST