Avinash Vs CBI : హైదరాబాద్‌కు అవినాష్ తల్లి.. రూటు మార్చిన ఎంపీ.. ఇంకా వెంబడిస్తున్న సీబీఐ..!!
ABN, First Publish Date - 2023-05-19T16:44:56+05:30
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి ట్విస్ట్‌ల ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అటు అవినాష్ వర్గానికి.. ఇటు సీబీఐ అధికారులకు ఎవరికీ తెలియని పరిస్థితి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) వ్యవహారంలో ఇవాళ ఉదయం నుంచి ట్విస్ట్‌ల ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఎప్పుడేం జరుగుతుందో అటు అవినాష్ వర్గానికి.. ఇటు సీబీఐ అధికారులకు ఎవరికీ తెలియని పరిస్థితి. పులివెందులలో చికిత్స అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని (Avinash Mother) మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్సులో (Ambulence) కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. తల్లిని చూడటానికి సీబీఐ (CBI) విచారణకు డుమ్మా కొట్టి మరీ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరిన ఎంపీ.. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి..! తాడిపత్రి (Tadipatri) సమీపంలోని చుక్కలూరులో అంబులెన్స్ ఆపి తన తల్లిని చూశారు. అనంతరం అవినాష్ తన కాన్వాయ్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం అంబులెన్స్‌తో పాటే అవినాష్ కూడా హైదరాబాద్ వస్తున్నారు.
సస్పెన్స్‌కు తెర..!
అయితే.. గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై వచ్చిన తర్వాత హైదరాబాద్ వైపు వెళ్తారా..? బెంగళూరు వెళ్తారా..? అనే దానిపై సస్పెన్స్ కొనసాగింది. అయితే ఎంపీ రూటుమార్చి అటు తిరిగి.. ఇటు తిరిగి మళ్లీ హైదరాబాద్‌కే ఎంపీ వస్తున్నారు. ప్రస్తుతం అవినాష్ కాన్వాయ్‌లోనే ముందువైపు అంబులెన్స్ నడుస్తోంది. అంబులెన్స్‌లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. మరోవైపు అవినాష్ కాన్వాయ్‌ను పెద్ద ఎత్తున అభిమానులు, ప్రధాన అనుచరులు.. ఎమ్మెల్యేకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఫాలో అవుతున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం శ్రీలక్ష్మి ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
వెంబడిస్తున్నారా..!?
మరోవైపు.. సీబీఐ అధికారులతో ఉన్న రెండు కార్లు మాత్రం అవినాష్ కాన్వాయ్‌ను ఫాలో అవుతున్నాయి. అవినాష్‌కు ఫోన్ చేసి కారు ఆపాలని పదే పదే అధికారులు కోరినప్పటికీ తన తల్లిని చూసిన తర్వాతే మాట్లాడుతానని బదులిచ్చారు. మార్గమధ్యలోనే తల్లిని చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు అవినాష్ బయల్దేరారు. అయితే తల్లిని చూసిన తర్వాత మాట్లాడుతానన్న ఎంపీ.. ఆ తర్వాత కూడా మాట్లాడకపోవడం, కనీసం కారు కూడా ఆపకపోవడంతో సీబీఐ అధికారులు ఆయన్ను వెంబడిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సీబీఐ తీరును వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవానికి సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి.. అవినాష్‌ను అరెస్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. అవినాష్ విషయంలో సీబీఐ తీవ్ర ఆగ్రహం ఉందని.. వీలైతే హైదరాబాద్‌లో లేకుంటే పులివెందులకు వెళ్లయినా సరే ఎంపీని అరెస్ట్ చేయాలని క్లియర్ కట్‌గా ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే అవినాష్‌ను ఈ రేంజ్‌లో సీబీఐ అధికారులు వెంబడిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అటు పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి చూస్తే ఇవాళ రాత్రిలోపు కీలక పరిణామమే జరగబోతోందని స్పష్టంగా తెలుస్తోంది.
అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇలా..!
సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి కచ్చితంగా హాజరవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. ఎంపీ ఇప్పటికే 5-6 సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అవినాష్‌రెడ్డి తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్న మాట వాస్తవమేనన్నారు. తల్లికి అనారోగ్యం ఉందని క్రియేట్ చేయాల్సిన అవసరం అవినాష్‌కు లేదన్నారు. మరోసారి సీబీఐ విచారణకు వెళ్లేందుకు అవినాష్ సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం ఇదంతా కట్టు కథ అని చెబుతున్నారు.
******************************
ఇవి కూడా చదవండి..
******************************
Avinash Vs CBI : ఉదయం నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. అవినాష్‌పై సీబీఐ సీరియస్.. హెడ్‌క్వార్టర్స్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు.. ఏ క్షణమైనా..!?
******************************
Avinash Vs CBI : ఎంపీ అవినాష్ తల్లికి ఏమైంది.. విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు..? అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన లాయర్లు..
******************************
Avinash Vs CBI : ఆఖరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఎంపీ అవినాష్.. వెంటాడుతున్న సీబీఐ.. టెన్షన్.. టెన్షన్..!
******************************
Updated Date - 2023-05-19T16:59:11+05:30 IST