YS Avinash Vs CBI : నిన్న రెచ్చిపోయారు.. ఇవాళ సెంటిమెట్‌తో కొడుతున్నారు..రేపేంటో.. బాబోయ్ మాములు కథ కాదే..!
ABN, First Publish Date - 2023-05-23T23:14:17+05:30
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది. అందుకే దూకుడు పెంచిన సీబీఐ.. ఈ హత్యకేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని (Kadapa MP Avinash Reddy) విచారించి కీలక సమాచారం రాబట్టడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. అయితే సీబీఐ నోటీసులు (CBI Notice) ఇచ్చిన ప్రతిసారి.. విచారణకు హాజరవుతానని చెప్పి చివరి నిమిషంలో డుమ్మా కొట్టేస్తున్నారు. ఇప్పుటికే మూడుసార్లు విచారణకు రాకుండా ఎగ్గొట్టిన అవినాష్.. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో (Kurnool Viswa Bharathi Hospital) చికిత్స పొందుతున్న తన తల్లి శ్రీలక్ష్మి దగ్గరే ఉన్నారు. నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ తల్లి బాగోగులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే అవినాష్ ఆస్పత్రిలో ఉన్న ప్రతిరోజూ అదిగో సీబీఐ వచ్చేసింది.. ఇదిగో అరెస్ట్ చేసేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయే తప్ప.. అవేమీ జరగట్లేదు. దీంతో సీబీఐ, రాష్ట్ర పోలీసులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు వేదికగా ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో పులివెందుల నుంచి భారీగా అవినాష్ అభిమానులు, అనుచరులు, వైసీపీ కార్యకర్తలు, నేతలు కర్నూలు తరలివచ్చారు.
ఇదీ పరిస్థితి..!?
అరెస్ట్ చేయాలని సీబీఐ.. అదే జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని అవినాష్ వర్గం ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వభారతి ఆస్పత్రి దగ్గర సీబీఐ వర్సెస్ అవినాష్‌గా (CBI Vs Avinash) పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అవినాష్ అరెస్ట్‌కు (Avinash Arrest) సహకరించాలని జిల్లా ఎస్పీని సీబీఐ కోరినప్పటికీ డీజీపీ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలొస్తేనే ముందుకెళ్తామని చెబుతుండటంతో కేంద్ర బలగాలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. అంతా హడావుడి చేయడం.. హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా వార్తలొస్తున్నాయే తప్ప అరెస్ట్ జరిగిందేమీ లేదని సీబీఐపై ఒకింత విమర్శలు కూడా వస్తున్నాయ్. ఈ పరిస్థితుల్లో సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇంకా ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనే సీబీఐ బృందాలు ఉన్నాయి. అవినాష్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగానే కనిపిస్తుండటంతో.. ఇంతవరకూ రెచ్చిపోయిన వీరంగం సృష్టించిన అనుచరులు, కార్యకర్తలు ఇప్పుడు సెంటిమెంట్‌తో కొడుతున్నారు. కొన్ని ప్లక్లార్డులు చేయించి వాటిని ఆస్పత్రి ముందు ప్రదర్శిస్తున్నారు.
ప్లకార్డుల కథేంటో..?
‘దయచేసి అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి. మానవత్వంతో ఆలోచించండి సీబీఐ అధికారులారా..’ అని కొన్ని ప్లకార్డుల్లో ఉండగా.. ‘ అవినాష్ తల్లి ఆరోగ్యం కుదుట పడనందున మాకు కొంత సమయం కావాలి. మాకు సీబీఐ అంటే గౌరవం.. తప్పకుండా విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తాం’ అని సీబీఐని అభిమానులు వేడుకుంటున్నారు. ఆస్పత్రి ఆవరణలో పదుల సంఖ్యలో కార్యకర్తలు, వీరాభిమానులు ప్లకార్డులు హడావుడి చేస్తున్నారు. అంతేకాదు.. షిప్ట్‌ల వారీగా ఇలా ప్లకార్డులు పట్టుకుని మరీ ఉండటం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇలా అవినాష్ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు స్థానిక నేతలు.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు. వీళ్లంతా ఆస్పత్రి దగ్గర ఇలా ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే.. అటు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు #We Stand With Avinash అంటూ హడావుడి చేస్తున్నారు. ఇక ఈ ప్లకార్డులు అయితే ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. తల్లి బాగోగులు చూసుకుంటున్న అవినాష్‌ను ఎందుకింతలా వెంబడిస్తోంది..? ఆయనేమైనా రాష్ట్రం, దేశం పారిపోతారా..?.. సీబీఐకి మానవత్వం లేదా..? అని సెంటిమెంట్‌ను వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు.
మొత్తానికి చూస్తే.. నిన్న రెచ్చగొట్టారు.. మీడియా ప్రతినిధులపై దాడిచేశారు.. ఆఖరికి సీబీఐ అరెస్ట్ చేయడానికొస్తే దాడులు చేయాలని కూడా అవినాష్ అనుచరులు, కార్యకర్తలు ప్లానింగ్‌లు చేసుకున్నారు. అవన్నీ వర్కవుట్ అవ్వలేదో లేకుంటే కేంద్ర బలగాలు వచ్చే సరికి భయపడిపోయారో తెలియట్లేదు కానీ.. ఇప్పుడు సడన్‌గా సెంటిమెంట్‌తో కొడుతున్నారు..!. ఇప్పటికే రెండు కోణాలు చూపించిన ఈ కార్యకర్తలు రేపొద్దున ఇంకెన్ని కథలు పడతారో ఏంటో బాబోయ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అవినాష్ ఎపిసోడ్‌లో మున్ముందు ఇంకా ఎన్నెన్ని చూడాలో ఏంటో మరి..!
******************************
ఇవి కూడా చదవండి..
******************************
TS Politics : హవ్వా.. నిజంగానే ఈటల రాజేందర్ బీజేపీని ఇన్ని మాటలు అన్నారా.. ఒకవేళ ఇదేగానీ...!
******************************
Dimple Vs DCP : డింపుల్ హయాతీ వర్సెస్ డీసీపీ ఎపిసోడ్‌లో రెండు నెలలుగా అసలేం జరిగింది.. హీరోయిన్ ఏం చేయబోతున్నారు..!?
******************************
New Parliament Building : రాష్ట్రపతిని పక్కనెట్టి మరీ మోదీ చేతుల మీదుగానే ఎందుకు..? నాడు తిట్టిపోశారుగా.. ఇప్పుడు చేస్తున్నదేంటో..!?
******************************
Updated Date - 2023-05-23T23:20:39+05:30 IST