ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRCP: వైసీపీలో ముసలం.. విశాఖలో బలహీనపడుతున్న పార్టీ

ABN, First Publish Date - 2023-07-15T15:03:08+05:30

వైసీపీలో ముసలం ఏర్పడింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేశారు. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు అదే దారిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో పరిస్థితి చేయి దాటకముందే ఇల్లు చక్కబెట్టుకునేందుకు పలువురు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని కీలక నేతలు పార్టీని వీడగా.. తాజాగా పాలన రాజధానిగా ప్రకటించిన విశాఖలోనూ జగన్ పార్టీ బలహీనపడుతోంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లను గెలిచి ప్రభంజనం సృష్టించినా.. విశాఖ నగరంలోని నాలుగు ఎమ్మెల్యే స్థానాలలో మాత్రం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా కొంతమంది టీడీపీ నేతలు వైసీపీలోకి జంప్ అయ్యారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

తాజాగా వైసీపీలో ముసలం ఏర్పడింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఇమడలేకపోవడం, పార్టీ విధానాలపై అసంతృప్తితోనే పంచకర్ల రమేష్‌బాబు వైసీపీకి గుడ్‌బై చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి పంచకర్ల టిక్కెట్ ఆశించారు. అయితే తనకు టిక్కెట్ వచ్చే అవకాశాలు లేవనే సంకేతాలు అందగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్‌పై తన అభిమానులు, స్థానికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పంచకర్ల ప్రకటించారు. జిల్లాలో పార్టీ పెద్దల ఆధిపత్యం నడుస్తోందని.. తమ నిర్ణయాలకు విలువ ఇవ్వడంలేదని ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపారు. అయితే ఎన్నికలకు ముందు పంచకర్ల రమేష్ వైసీపీని వీడటం పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు విశాఖ వైసీపీ నుంచి ఒక్కొక్కరు జారుకునే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖలో చాలా మంది వైసీపీ నేతలు పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పంచకర్ల గుడ్ బై చెప్పగా.. మరో ఇద్దరు, ముగ్గురు నేతలు అదే దారిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖను రాజధాని చేస్తామని.. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని రెండేళ్లుగా వైసీపీ చెప్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఆ పార్టీపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. అటు విశాఖ వైసీపీ నేతలు భూదందాలు చేయడం కూడా విమర్శలకు తావిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో పరిస్థితి చేయి దాటకముందే ఇల్లు చక్కబెట్టుకునేందుకు పలువురు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వైసీపీ నుంచి మరికొందరు జంపింగ్ జిలానీలు ఉంటారని ప్రచారం జరుగుతోంది.

కాగా విశాఖ వైసీపీ బాధ్యతలను ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చూసుకుంటున్నారు. ఒకవైపు టీటీడీ వ్యవహారాలను, మరోవైపు పార్టీలో లుకలుకలను ఆయన సమన్వయం చేయలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో విశాఖలో వైసీపీ క్రమంగా బలహీనపడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పంచకర్ల రమేష్‌బాబు ప్రకటించినా అందులో ఏ మాత్రం నిజం లేదని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు. విశాఖలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పెత్తనం ఎక్కువైందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో పార్టీలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు జగన్ రంగంలోకి దిగి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో.. పంచకర్ల రమేష్‌బాబు స్థానంలో తదుపరి జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి. 2019లో పంచకర్ల రమేష్‌బాబు టీడీపీ తరఫున యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2021 ఆగస్టులో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరారు.

ఇవి కూడా చదవండి:

AP Politics: వైసీపీ హయాంలో ఇక రాజధాని లేనట్లేనా?


AP Politics: పరువు తీసుకున్న పోసాని.. ఉమెన్ ట్రాఫికింగ్ అంటే తెలుసా?


Updated Date - 2023-07-15T15:03:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising