ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YSRTP : సీపీఎం ఆఫీసుకెళ్లి.. ఆ పార్టీపైనే తీవ్ర దుమారం రేపే కామెంట్స్ చేసిన షర్మిల.. ఒక్కసారిగా సీన్ మారడంతో..

ABN, First Publish Date - 2023-04-04T19:54:53+05:30

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) డిఫరెంట్ రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) డిఫరెంట్ రాజకీయం చేస్తూ ముందుకెళ్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ను (TS CM KCR) గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షపార్టీలను ఏకం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు షర్మిల టచ్‌లోకి వెళ్లారు. మరోవైపు నిరుద్యోగుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడేందుకు కూడా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. మంగళవారం నాడు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంను (Kodandaram) కలిశారు. ఈ సందర్భంగా.. T-SAVE పోరులో భాగమై, నాయకత్వం వహించాలని షర్మిల కోరగా.. కోదండరాంకూడా సానుకూలంగానే స్పందించారు. అనంతరం వామపక్ష నేతలను కూడా షర్మిల కలిశారు. మొదట సీపీఎం ఆఫీసుకు వెళ్లిన షర్మిల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో (Tammineni Veerabhadram) భేటీ అయ్యారు. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై పోరాడేందుకు.. తమతో కలిసి రావాలని తమ ప్రతిపాదనను షర్మిల వివరించారు. సమావేశం అనంతరం తమ్మినేని, షర్మిల ఇద్దరూ కలిసే మీడియా ముందుకొచ్చారు. ఇక్కడ వరకూ అంతా బాగుంది కానీ.. సడన్‌గా మీడియా ముందే, అది కూడా సీపీఎం ఆఫీసులోనే.. షర్మిల వర్సెస్ తమ్మినేనిగా పరిస్థితులు మారిపోయాయ్.

షర్మిల ఏమన్నారు..?

కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది. యువత, విద్యార్థులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ బిడ్డలకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. సరుకులు అమ్మినట్లుగా ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నారు. నిరుద్యోగుల సమస్యలు తీరాలంటే అన్నిపార్టీలు ఏకం కావాలి. సీపీఎం నేతలతో చర్చించాం.. సానుకూలంగా స్పందించారు. సీపీఎం చేసే పోరాటాలకు నన్ను ఆహ్వానిస్తే పాల్గొంటాను. మేము బీజేపీకి బీటీమ్ కాదు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేశాం. కమ్యూనిస్టులే మునుగోడులో BRS కు బీటీమ్‌గా పనిచేశారుఅని సీపీఎం ఆఫీసులోనే షర్మిల తీవ్ర దుమారం రేపే కామెంట్స్ చేశారు. షర్మిల ఈ కామెంట్స్ చేసినప్పుడు తమ్మినేని కూడా పక్కనే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.

తమ్మినేని రియాక్షన్ ఇదీ..

అన్నిపార్టీలకు రాజకీయ వైఖరిలు ఉంటాయి. మునుగోడులో బీఆర్ఎస్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపాం. సీపీఎం తెరచాటు రాజకీయాలు చేయదు. షర్మిల మా ఆఫీస్‌కు వచ్చి మాపైనే విమర్శలు చేయడం తగదు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల కోసం అందరం పోరాడాలి. బీజేపీ ఉంటే మేము భాగస్వామ్యం కాలేమని చెప్పాం. షర్మిల మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాంఅని తమ్మినేని ఒకింత కౌంటరిచ్చారు. అయితే ఈ కామెంట్స్‌కు షర్మిల సైలెంట్ అయిపోయారు.

ఆలోచిస్తాం..!

ఇదిలా ఉంటే.. సీపీఎం నేతలతో సమావేశం అనంతరం సీపీఐ నేతలతో కూడా షర్మిల భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును కలిసి నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి కలిసి రావాలని తమ ప్రతిపాదనను షర్మిల వివరించారు. అనంతరం కూనంనేని, షర్మిల ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చారు. పార్టీల పరంగా ఎవరి విధివిధానాలు వారికుంటాయని.. నిరుద్యోగుల పట్ల ముందు నుంచి తమ పద్ధతిలో పోరాడుతూనే ఉన్నామని కూనంనేని అన్నారు. షర్మిల ప్రతిపాదనపై పార్టీ నేతలతో కలిసి సమాలోచనలు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూనంనేని మీడియాకు వెల్లడించారు. మరోవైపు షర్మిల మాట్లాడుతూ.. నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేయకుండా అణచివేస్తున్న నియంత కేసీఆర్‌పై ప్రతిపక్షాలంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పార్టీలు ఒక ఫోరంగా ఏర్పడి, నిరసన గళం వినిపించాలన్నారు.

మొత్తానికి చూస్తే.. సీపీఎం ఆఫీసుకెళ్లి మరీ షర్మిల చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా రేంజ్‌లో షర్మిలపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు నెటిజన్లు ఇదేం పద్ధతి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత షర్మిలతో కలిసి నిరుద్యోగ పోరులో, ప్రభుత్వంపై పోరాటానికి వామపక్షాలు ఏ మాత్రం ముందుకొస్తాయో వేచి చూడాల్సిందే మరి.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************
YSRCP Meeting : వైఎస్ జగన్ మీటింగ్‌కు డుమ్మా కొట్టడం వెనుక కారణాలేంటో చెప్పిన వల్లభనేని వంశీ.. ఇంతకీ ఆ పరీక్ష కథేంటో..?

*****************************

YSRCP Meeting : అరె ఏందిరా బై.. మొన్న మంత్రి పదవి.. ఇప్పుడేమో ఎమ్మెల్యే.. ఏంటో ఇది.. సీదిరి ఓ రేంజ్‌లో..!


*****************************

Updated Date - 2023-04-04T20:04:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising