ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila : వైఎస్సార్ జయంతి ముందురోజే వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం.. అదేంటో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-07-07T22:17:12+05:30

అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి (YSR Jayanthi) ఒక్కరోజు ముందే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జూలై-08న వైఎస్టార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. అధికారిక ప్రకటన ఉంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవును.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి (YSR Jayanthi) ఒక్కరోజు ముందే వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జూలై-08న వైఎస్టార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని.. అధికారిక ప్రకటన ఉంటుందని మీడియాలో, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. షర్మిల కూడా పెద్దగా ఈ వార్తలను పెద్దగా ఖండించకపోవడంతో లోలోపల ఏదో జరుగుతోందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంతా అయ్యే పనే కాదని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు తేల్చి చెప్పారు. ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం నాడే వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, వైఎస్ రాజారెడ్డి (షర్మిల కుమారుడు) ఇడుపులపాయకు చేరుకున్నారు.

అదేమిటంటే..!

కుటుంబ సభ్యులతో కడపకు చేరుకున్న వైఎస్ షర్మిల తన పేరిట ఇడుపులపాయలో ఉన్న ఆస్తులను కూతురు, కొడుకుకు పంపకాలు చేశారు. హైదరాబాద్ నుంచి కడప విమానాశ్రాయానికి వెళ్లిన షర్మిల.. అక్కడ్నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఇడుపులపాయలో తనపేరిట ఉన్న 9.53 ఎకరాల భూమిని షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మరోవైపు.. ఇడుపులపాయలోని 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలిరెడ్డి పేరిట షర్మిల రిజిస్ట్రేషన్ చేశారు. కాగా ఈ భూమి ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల గతంలో కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక .. కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. నాన్న జయంతికి ఒక్కరోజు ముందు ఆస్తుల పంపకాలు చేస్తే మంచిదని కొందరు పెద్దలు చెప్పడంతో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియవచ్చింది. కాగా.. త్వరలోనే హైదరాబాద్‌లోని ఆస్తులను కూడా షర్మిల పంచబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం వైఎస్సార్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

ఎవరికివారే..!

ఇదిలా ఉంటే.. వైఎస్సార్ జయంతి సందర్భంగా.. కుటుంబంలో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. జయంతి సందర్భంగా వైఎస్సార్‌కు నివాళులర్పించే కార్యక్రమంలో అన్న సీఎం జగన్ (CM Jagan), సోదరి షర్మిల విడి విడిగా కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో ఇద్దరూ కలిసి నివాళులర్పించినా ముభావంగా కనిపించేవారు. అయితే ఈసారి మాత్రం వేర్వేరు సమయాల్లో తండ్రి సమాధి దగ్గరకు వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నమే వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల.. తన కూతురు, కొడుకుతో కలిసి ఇడుపులపాయ చేరుకోనున్నారు. శనివారం ఉదయం వైఎస్‌కు నివాళులర్పించి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరనున్నారు. అయితే.. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్ రానున్నారు. అనంతపురం జిల్లా, కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇడుపులపాయ వెళ్లి వైఎస్‌కు నివాళులర్పించనున్నారు. షర్మిలతో విబేధాలు..రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనందువల్లే షర్మిల ఇడుపులపాయ నుంచి వెళ్లిపోయిన తర్వాతే జగన్ ఇడుపులపాయ వస్తున్నారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి


Bandi Sanjay : బండి సంజయ్ అసంతృప్తి చల్లారేది అప్పుడేనా.. తెరపైకి సరికొత్త డిమాండ్..!?


BRS Vs Congress : కేసీఆర్‌కు ఊహించని ఝలక్.. ‘కారు’ దిగడానికి సిద్ధమైన బిగ్ బ్రదర్స్.. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..!?


TS Politics : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఊహించని షాక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బిగ్ షాట్‌‌లు..!


Ponguleti Meets YS Jagan : తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన తెలంగాణ రాజకీయాలు.. సీఎం జగన్‌తో పొంగులేటి భేటీ.. షర్మిల గురించే చర్చ..!


Kishan Reddy : ‘బండి’ని తప్పించి మరీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక ఇంత కథుందా.. అది కూడా రెండోసారి..!?


TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?


Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్‌ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?




Updated Date - 2023-07-07T22:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising