ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Husband: మా భర్త అతడే అంటూ ఒక్కరి పేరే చెప్పిన 40 మంది మహిళలు.. అనుమానంతో రెడ్‌లైట్ ఏరియాకు అధికారులు వెళ్లి చూస్తే..!

ABN, First Publish Date - 2023-04-26T15:12:19+05:30

ప్రభుత్వ అధికారులు ఇంటింటా తిరుగుతూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక ప్రాంతంలో వివరాలు సేకరిస్తుండగా దాదాపు 40 మంది మహిళలు (40 women) ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు.

Husband
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలభై మంది భార్యలు. అతడేమైనా శ్రీమంతుడా? అంటే అది కాదు. అతనో సామాన్యుడు. ఏ రోజు పనికెళ్తే ఆరోజే పూట గడిచే పరిస్థితి. అలాంటిది అతడికి ఏకంగా 40 మంది భార్యలు ఉన్నారు. ఓ సాధారణమైన వ్యక్తికి ఇంత భార్యలు ఎక్కడ్నుంచీ వచ్చారు. చట్ట ప్రకారం ఒక్క భర్తే ఉండాలి. ఒక్క భార్యే ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం తేడాగా కనిపించింది. అసలు ఏంటా కథ. తెలియాలంటే ఈ వార్త చదవండి.

బిహార్‌లో (Bihar Arwal district) ప్రస్తుతం రెండో విడత కులగణన జరుగుతోంది. ప్రభుత్వ అధికారులు ఇంటింటా తిరుగుతూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇలా ఒక ప్రాంతంలో వివరాలు సేకరిస్తుండగా దాదాపు 40 మంది మహిళలు (40 women) ఒకే పేరును తమ భర్త పేరుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు.

అర్వల్‌ జిల్లాలోని ఓ రెడ్‌లైట్‌ ఏరియాలో నివాసం ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లారు. ఇందులో భాగంగా కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతులు వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సిబ్బంది వివరాలు సేకరిస్తుంటే అక్కడ సుమారు 40 మంది మహిళలు.. తమ భర్త పేరు రూప్‌చంద్‌ (Roopchand) అని చెప్పారు. ఇక చాలా మంది పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్‌చంద్‌ అని తెలిపారు. దీంతో అధికారులు అవాక్కయ్యారు.

మహిళలు, పిల్లలు చెప్పిన విషయాలతో అధికారులు ఖంగుతిన్నారు. ఇలా ఎందుకు చెబుతున్నారని ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ రెడ్‌లైట్‌ ఏరియాలో (red light area) రూప్‌చంద్‌ అనే ఒక డ్యాన్సర్‌ ఉన్నాడు. అతడు చాలా ఏళ్లుగా పాటలు పాడుతూ.. డాన్స్‌ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి సొంతిల్లు కూడా లేదు. కానీ అక్కడి ప్రజలు మాత్రం రూప్‌చంద్‌పై చాలా అభిమానం పెంచుకున్నారు. ఆ అభిమానంతోనే మహిళలందరూ రూప్‌చంద్‌ పేరును తమ భర్త పేరుగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలో ఉండేవారికి కులం అంటూ ఏదీ లేదని కూడా అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-26T15:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising