Mystery: నెల రోజులు గడిచినా వీడని మిస్టరీ.. ఆ 42 మృతదేహాలు ఎవరివి..? మార్చురీలోనే భద్రపరిచిన అధికారులు..!
ABN, First Publish Date - 2023-07-07T16:25:27+05:30
దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి నెలకు పైగా అవుతున్నా ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి చాలా మంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తప్పుడు సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ అధికారులు.. ఇటీవల..
దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిన బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి నెలకు పైగా అవుతున్నా ఆ ఘటన తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి చాలా మంది ఇంకా బయటకు రాలేకపోతున్నారు. తప్పుడు సిగ్నలింగ్ వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే భద్రత కమిషన్ అధికారులు.. ఇటీవల రైల్వే బోర్డుకు నివేదించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 290 మందికి పైగా మృతిచెందగా.. సుమారు 1000మంది వరకు గాయపడ్డారు. అయితే చనిపోయిన వారిలో ఇంకా 42మందికి సంబంధించిన వివరాలు ఇప్పటివరకూ తెలియరాలేదు. దీంతో అధికారులు ఆ మృతదేహాలను మార్చురీలోనే భద్రపరిచారు.
ఒడిశాలోని (Odisha) బాలాసోర్‌లో జూన్ 2న జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదాన్ని (train accident) ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలును.. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే కొద్ది సేపటి తర్వాత యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ (Howrah Express) కూడా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టడంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో కొంతమందిని కుటుంబ సభ్యులు గుర్తించారు.
Viral Video: ఒక చేతిలో బిడ్డ.. మరో చేత్తో రిక్షా హ్యాండిల్.. తల్లిప్రేమకు అసలు సిసలు అర్థం..!
చాలా మృతదేహాలను అధికారులు డీఎన్‌ఏ పరీక్షల (DNA tests) ఆధారంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇప్పటికీ కొన్ని మృతదేహాలను (dead bodies) తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు గానీ, బంధువుల గానీ ఎవరూ రాలేదు. ప్రమాదం అనంతరం మొత్తం 81 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాల ఆధారంగా 39 మృతదేహాలను ఇటీవల కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే మిగిలిన 42 మృతదేహాలకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో ఈ మృతదేహాలు ఎవరివి, కుటుంబ సభ్యులెవరూ ఎందుకు ముందుకు రాలేదు.. అన్నది మిస్టరీగా మారింది.
Updated Date - 2023-07-07T16:31:08+05:30 IST