Viral News: వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించిన పాక్ పెద్దాయన.. 65ఏళ్ల వయసులో ఏం చేస్తున్నాడో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-11-26T12:19:34+05:30
65ఏళ్ల వయసులో వృద్ధులు ఏం చేస్తారు..? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం.. ఇంటి పట్టున కూర్చొని.. హరే రామా, హరే కృష్ణ అంటూ కాలం వెళ్లదీయడం తప్పితే ఇంకేం చేస్తారు అని. కానీ, పాకిస్థాన్‌లో ఓ 65 ఏళ్ల పెద్దాయన మాత్రం దీనికి భిన్నం.
Viral News: 65ఏళ్ల వయసులో వృద్ధులు ఏం చేస్తారు..? అని అడిగితే అందరూ చెప్పే సమాధానం.. ఇంటి పట్టున కూర్చొని.. హరే రామా, హరే కృష్ణ అంటూ కాలం వెళ్లదీయడం తప్పితే ఇంకేం చేస్తారు అని. కానీ, పాకిస్థాన్‌లో ఓ 65 ఏళ్ల పెద్దాయన మాత్రం దీనికి భిన్నం. రిటైర్‌మెంట్ వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ వృద్ధుడు ఒకటో తరగతిలో చేరారు. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విద్యకు దూరమైన పెద్దాయన ఇప్పుడు ఆ ముచ్చట తీర్చుకుంటున్నాడు. చదువుపై తనకున్న మక్కువతో పిల్లలతో కలిసి స్కూల్ కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నాడు. విద్యార్థులు కూడా ఆయనకు తమవంతు సాయం చేస్తున్నారు. ఈ న్యూస్ కాస్త బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Viral News: బాబోయ్.. ఆ దేశంలో భార్య బర్త్‌డేను భర్త మర్చిపోవడం చట్ట విరుద్ధమట.. పైగా ఈ నేరానికి ఐదేళ్ల జైలుశిక్ష కూడా..!
ఈ అసాధారణ ఘటన పాకిస్థాన్‌లోని ఖైబర్ పాఖ్‌తున్ఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province) లో వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉండే దిలావర్ ఖాన్ (Dilawar Khan) ఇలా 65ఏళ్ల వయసులో ఇటీవల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరాడు. జీవిత చరమాంకంలో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించాడు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు భుజాన పడటంతో దిలావర్ చదువుకు దూరమయ్యాడు. సంసార సాగరం ఈదుతూ జీవితమంతా నిరక్షరాస్యుడిగా గడిపేశాడు. అయితే, చదువుకు వయసుతో సంబంధం లేదని బలంగా నమ్మే దిలావర్, మలివయసులో తనకు దొరికిన తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మళ్లీ చదువుపై దృష్టి పెట్టాడు. రిటైర్‌మెంట్ అయ్యే వయసులో భూజాన బ్యాగు తగిలించుకుని, మునిమనవళ్లలాంటి పిల్లలతో కలిసి రోజూ స్కూల్‌కి వెళ్తున్నారాయన.
Viral Video: నెట్టింట వైరల్ అవుతున్న వెరైటీ దోశ.. వీడియో చూస్తే నోరూరడం ఖాయం!
"చిన్నప్పుడు చదువుకునే అవకాశం లేదు. కుటుంబ బాధ్యతల కారణంగా స్కూల్‌కి వెళ్లలేకపోయా. కానీ పాఠశాలకు వెళ్లి, బాగా చదవాలని ఉండేది. ఇప్పుడు ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నా. అందుకే ఈ ఖాళీ సమయాన్ని ఇలా వినియోగించుకుంటున్నా. ప్రతిరోజు ఉదాయం స్కూల్ వెళ్తుంటే, చాలా బాగా అనిపిస్తుంది" అని దిలావర్ చెప్పుకొచ్చారు. ఇక వృద్ధుడి నిర్ణయంపై నెట్టింట సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 'తాత మీరు చాలా గ్రేట్', 'ఈ వయసులో ఇలాంటి ఫ్యాషన్ ఉండడం నిజంగా సూపర్' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Elections: ఈ ఎన్నికల్లో గెలుపెవరిది..? భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మరో పార్టీ నుంచి అదే సీట్లో పోటీ చేస్తున్న భార్య..!
Updated Date - 2023-11-26T12:19:35+05:30 IST