ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: తాతా.. నీ ఓపికకు సలాం.. 78 ఏళ్ల వయసులో 9వ తరగతి విద్యార్థిగా.. రోజూ 3 కిలోమీటర్లు నడుస్తూ..!

ABN, First Publish Date - 2023-08-03T17:34:16+05:30

చదువుకోవాలన్న ఆయన కోరిక.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీరని కోరికగా మిగిలిపోయింది. ఈలోగా కాల చక్రం గిర్రున తిరిగేసింది. ప్రస్తుతం ఆయన వయస్సు 78 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా అన్ని కోరికలనూ పక్కన పెట్టి.. రామా, కృష్ణా.. అంటూ కాలం వెల్లదీస్తుంటారు. అయితే...

చదువుకోవాలన్న ఆయన కోరిక.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీరని కోరికగా మిగిలిపోయింది. ఈలోగా కాల చక్రం గిర్రున తిరిగేసింది. ప్రస్తుతం ఆయన వయస్సు 78 ఏళ్లు. ఈ వయసులో ఎవరైనా అన్ని కోరికలనూ పక్కన పెట్టి.. రామా, కృష్ణా.. అంటూ కాలం వెల్లదీస్తుంటారు. అయితే ఈ వృద్ధుడు మాత్రం అలా చేయలేదు. ఎలాగైనా తన చిన్ననాటి కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఈ వయసులో 9వ తరగతిలో చేరాడు. రోజూ మూడు కిలోమీటర్లు నడుస్తూ పాఠశాలకు వెళ్తున్నాడు. ఈ పెద్దాయనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

తూర్పు మిజోరాం (Mizoram) చంపై జిల్లాలోని హ్రుయికోన్ గ్రామానికి చెందిన 78ఏళ్ల లాల్రింగ్థరా అనే వృద్ధుడి (78 years old man) గురించి స్థానికంగా అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈయన ఈ ఏడాది స్థానికంగా ఉండే ప్రాథమిక పాఠశాలలో 9వ తరగతిలో (old man joined 9th standard) చేరాడు. ఈ పెద్దాయన.. ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని ఖువాంగ్లెంగ్ గ్రామంలో 1945లో జన్మించాడు. అయితే ఈయన రెండో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణించాడు. ఒకడే కొడుకు కావడంతో పాటూ వీరి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో తల్లికి పొలం పనుల్లో సాయం చేయాల్సి వచ్చింది. దీంతో తర్వాత చదువును కొనసాగించలేకపోయాడు. అయితే ఇతడికి చదువుకోవాలన్ని కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.

Money: పేపర్ ముక్కలు కాదండోయ్.. కరెన్సీ నోట్లే.. ఓ వృద్ధురాలు కష్టపడి రూ.5.40 లక్షలను దాచుకుంటే..!

ఈ క్రమంలో అతడి కుటుంబం వివిధ ప్రదేశాలు మారుతూ చివరకు 1995లో న్యూ హ్రుయికోన్ గ్రామంలో స్థిరపడింది. ప్రస్తుతం ఈ వృద్ధుడు స్థానిక చర్చిలో గార్డుగా పని చేస్తున్నాడు. తనకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా ఎన్నాళ్ల నుంచో కోరిక ఉండేది. దీంతో చివరకు ఎలాగైనా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో 9వ తరగతిలో చేరాడు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు రోజూ నడుచుకుంటూ వెళ్లి వస్తుంటాడు. స్కూలు డ్రస్సు వేసుకుని, తరగతి గదిలో పిల్లల పక్కన కూర్చుని బుద్ధిగా చదువుకుంటున్న ఈ పెద్దాయనను చూసి స్థానికులతో పాటూ చుట్టు పక్కల వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ వృద్ధుడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. (Viral photos and videos) సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.

Marriage: పెళ్లి వేడుకలోనే వరుడిని చితకబాదిన వధువు.. బంధువులంతా చూస్తుండగానే కింద పడేసి..!

Updated Date - 2023-08-03T17:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising