ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SBI Clerk Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్బీఐలో 8 వేలకు పైగా పోస్ట్‌లు.. ఎలా అప్లయ్ చేయాలంటే..

ABN, First Publish Date - 2023-11-17T15:23:29+05:30

మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? బ్యాంక్ జాబ్ చేయాలనేది మీ కోరికా? అయితే మీకు శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 వేలకుపైగా క్లర్క్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ ప్రకటించింది. 8,773 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది.

మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? బ్యాంక్ జాబ్ చేయాలనేది మీ కోరికా? అయితే మీకు శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) 8 వేలకుపైగా క్లర్క్ పోస్ట్‌లకు నోటిఫికేషన్ (Job Notification) ప్రకటించింది. 8,773 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది (SBI Jobs). ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఈ రోజు (నవంబర్ 17) నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో ఈ 8283 జూనియర్ అసోసియేట్ పోస్ట్ లను ఎస్బీఐ భర్తీ చేస్తోంది (SBI Clerk Recruitment 2023).

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. వివిధ సామాజిక వర్గాల అభ్యర్థులకు కేటాయించిన సడలింపులు ఉంటాయి. అలాగే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా అర్హులే. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, స్థానిక భాషకు సంబంధించిన పరీక్ష ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ పరీక్ష జరిగే అవకాశముంది. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి (Bank Jobs).

ఈ పరీక్షను ఆన్ లైన్లో రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఈ పోస్ట్‌లకు అప్లై చేసే వారిలో జనరల్, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులు రూ. 750 లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 17, 2023

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2023

ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024

ప్రధాన పరీక్ష: ఫిబ్రవరి 2024

Updated Date - 2023-11-17T15:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising