ఆ గ్రామంలో ఉండేది కేవలం నలుగురే.. ఉండేది ఒకే ఒక్క కుటుంబం మాత్రమే.. ఈ వింత ఊరు ఎక్కడ ఉందంటే..!
ABN, First Publish Date - 2023-03-02T17:43:56+05:30
మనిషి సంఘ జీవి. తన మనుగడ కోసం మనుషులతో కలిసి జీవిస్తుంటాడు. అలా కాకుండా మనుషులకు దూరంగా జీవిస్తే ప్రకృతికి విరుద్ధం అంటారు. అంతేందుకు కొన్ని
మనిషి సంఘ జీవి. తన మనుగడ కోసం మనుషులతో కలిసి జీవిస్తుంటాడు. అలా కాకుండా మనుషులకు దూరంగా జీవిస్తే ప్రకృతికి విరుద్ధం అంటారు. అంతేందుకు కొన్ని సార్లు మనుషుల మధ్యనే జీవిస్తున్న కొంత మంది భయపడుతుంటారు. ఇంకొందరు చెట్టును చూసినా... పుట్టను చూసినా భయపడేవారుంటారు. అలాంటిది మనుష్య సంచారం లేకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా బ్రతకడమంటే ఇంకెంత భయంగా ఉంటుందో ఊహించుకోండి. ఊహించుకుంటేనే చెమటలు పడుతున్నాయి కదా? అయితే ఇది వాస్తవం. ఓ కుటుంబం జనసంచారానికి దూరంగా ఓ గ్రామాన్ని నిర్మించి జీవిస్తోంది. ఎక్కడా? ఏంటో? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నేటి ప్రపంచం ఉరుకులు.. పరుగులతో బిజీ బిజీ అయిపోయింది. ఓ ట్రైన్ ఖాళీ ఉండదు. ఓ విమానం ఖాళీ ఉండదు. ఓ బస్సు ఖాళీ ఉండదు. చివరికి ఓ షాపింగ్ మాల్ కూడా ఖాళీగా ఉండదు. ఎక్కడ చూసినా జనం.. జనం. మరోవైపు పొల్యుషన్‌తో మనిషి మనుగడ కూడా దెబ్బతింటోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఓ ఫ్యామిలీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక స్థలాన్ని కొని ఏకంగా ఓ గ్రామాన్ని నిర్మించుకుని మరీ నివసిస్తోంది ఓ కుటుంబం. అంతేకాదండోయ్.. తల్లిదండ్రులు వేరుగా.. ఇద్దరు పిల్లలు చెరో ఇల్లును ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అక్కడనే ఓ స్విమ్మింగ్ పూల్, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లండన్ పట్టణ సమీపంలో ఈ నిర్మాణం చేసుకుంది.
ఇది కూడా చదవండి: పాపం.. ఈ 21 ఏళ్ల యువతికి ఎంత కష్టమొచ్చింది..? కేన్సర్ ట్రీట్మెంట్ కోసం నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టి మరీ..
మిషిగన్‌లో నివిసించే ర్యాన్ బ్రింక్స్, కెలీ దంపతులు. వీరికి కుమార్తె లెనాక్స్, కుమారుడు బ్రాడీ ఉన్నారు. అక్కడనే ప్రశాంతంగా జీవించేది. అయినా కూడా వారిలో ఏదో వెలితి కనిపించింది. అంతే పర్యావరణహితమైన విధానంలో జీవించాలన్న కోరిక కలిగింది. అంతే తడువుగా 2015లో లండన్ పట్టణ సమీపంలో 21 ఎకరాల భూమిని 57 వేల డాలర్లకు కొనుగోలు చేశారు. భూముల ధరలు చౌకగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకుని మరీ కొనుగోలు చేశారు. అనంతరం కంటైనర్లతో ఇళ్లు తయారు చేసే సంస్థను సంప్రదించి 20 వేల డాలర్లు చెల్లించి తమకు కావాల్సిన సదుపాయాలతో ఆరు గృహాలను ఏర్పాటు చేసుకున్నారు. 280 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిలో ర్యాన్ బ్రింక్స్, కెలీ దంపతులు జీవిస్తుండగా.. కుమార్తె లెనాక్స్, కుమారుడు బ్రాడీ ఒకొక్కటి 160 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకున్న రెండు ఇళ్లల్లో నివసిస్తున్నారు.
Updated Date - 2023-03-02T17:46:34+05:30 IST