ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: ఖాకీ నీడన గొర్రెల కాపరి.. రెండేళ్లుగా రక్షణ కల్పిస్తున్న పోలీసులు..!

ABN, First Publish Date - 2023-05-01T15:13:04+05:30

గన్‌మెన్‌ రక్షణ అంటే వీవీవీఐపీలకేనన్నది అందరికీ ఎరుకే. కొంతమంది ప్రాణ రక్షణకు గన్‌మెన్‌ను పెట్టుకుంటుండగా, మరికొంతమంది అధికారదర్పం ప్రదర్శించడానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాకీ నీడన గొర్రెల కాపరి

పోలీసు పహారా నడుమే రోజువారీ పని

రెండేళ్లుగా రక్షణ కల్పిస్తున్న పోలీసులు

చెన్నై (ఆంధ్రజ్యోతి): గన్‌మెన్‌ రక్షణ అంటే వీవీవీఐపీలకేనన్నది అందరికీ ఎరుకే. కొంతమంది ప్రాణ రక్షణకు గన్‌మెన్‌ను పెట్టుకుంటుండగా, మరికొంతమంది అధికారదర్పం ప్రదర్శించడానికి వినియోగిస్తుండడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ తూత్తుకుడి జిల్లాలో సామాన్యమైన ఓ గొర్రెల కాపరి పోలీసు పహారా నడుమే తన పనులు చేసుకుంటున్నాడంటే నమ్మగలరా?.. ఆశ్చర్యంగా అనిపించినా నమ్మి తీరాల్సిందే! మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులతో పోలీస్‌శాఖ ఆ గొర్రెల కాపరికి రేయింబవళ్లు రక్షణ కల్పిస్తోంది. అయితే ఇది అదృష్టమో, శాపమో అర్థం కావడం లేదని ఆ గొర్రెల కాపరి వాపోతున్నాడు. ఇంతకీ అసలు కథేంటంటారా?.. అయితే తూత్తుకుడి జిల్లా అగరం వెళ్దాం రండి!..

అగరం అనే కుగ్రామానికి చెందిన బాలకృష్ణన్‌ మేకలు, గొర్రెల్ని పెంచుకుంటున్నాడు. అదే అతని ప్రధాన వృత్తి. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు సభ్యుడిగా విజయం కూడా సాధించాడు. అదే ఏడాదిలో అగరం శివారులోని తామ్రభరణి నది ఒడ్డున ఇసుక అక్రమంగా తరలించడం గమనించిన బాలకృష్ణన్‌.. మురప్పనాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టు మదురై బెంచ్‌ను ఆశ్రయించాడు. దీంతో ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ బాలకృష్ణన్‌కు ఇసుక మాఫియా నుంచి తీవ్రమైన బెదరింపులు వచ్చాయి.

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కృపాకరన్‌, జస్టిస్‌ పుళహేందితో కూడిన ధర్మాసనం.. బాలకృష్ణన్‌కు సాయుధ పోలీసు భద్రత కల్పించాలని 2020 నవంబరు 19న ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీస్‌శాఖ అతనికి రేయింబవళ్లు ఇద్దరేసి పోలీసుల్ని కాపలాకి నియమిస్తోంది. ఆ పోలీసు పహారా నడుమే బాలకృష్ణన్‌ గొర్రెల్ని మేపుతున్నాడు. సాయుధ పోలీసులను వెంటేసుకుని గొర్రెల్ని కాస్తున్న బాలకృష్ణన్‌ను చుట్టుపక్కల వారు సంభ్ర మాశ్చర్యాలతో చూస్తున్నారు.

దీని గురించి బాలకృష్ణన్‌ మాట్లాడుతూ.. రేయింబవళ్లు తుపాకుల నడుమ కాలం గడపడం నరకప్రాయంగా వుందని, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని వాపోయాడు. తమ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాతో పాటు గంజాయి విక్రయాలు కూడా అధికంగా జరుగుతున్నాయని, వాటిపై ఫిర్యాదు చేసినందుకే తనకీ పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ తప్పులు చేసి అరెస్టయిన వారు తన కళ్ల ముందే కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతుంటే అన్నింటి కంటే ఎక్కువ బాధగా వుందని బాలకృష్ణన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-05-01T15:13:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising