ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Flight: మరో 45 నిమిషాల్లో విమానం ల్యాండ్ అవుతుందనగా ఎమర్జెన్సీ డోర్ అన్‌లాక్.. ఓ వ్యక్తి తింగరి పనులతో ప్రయాణీకుల్లో టెన్షన్ టెన్షన్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-03-07T16:54:03+05:30

ఈ మధ్య విమానాల్లో కొంతమంది ప్రయాణికులు చేసే తుంటరి వేషాలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. అటు మొన్నటికి ఎయిరిండియాలో ఓ మహిళపై మూత్రం పోసిన

టెన్షన్ టెన్షన్.. చివరకు..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఈ మధ్య విమానాల్లో కొంతమంది ప్రయాణికులు చేసే తుంటరి వేషాలు జుగుప్సాకరంగా ఉంటున్నాయి. అటు మొన్నటికి ఎయిరిండియాలో ఓ మహిళపై మూత్రం పోసిన సంఘటన సంచలనం రేపింది. ఇటీవల అలాంటి సంఘటనే మరో దేశంలో రిపీట్ అయింది. వారిపై కఠిన చర్యలు తీసుకున్నా మార్పు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి చేసిన తింగరి పనులతో ప్రయాణీకుల్లో టెన్షన్ పుట్టించడమే కాకుండా ఏకంగా సిబ్బందిపైనే దాడికి తెగబడ్డాడు.

అమెరికాకు (America) చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగా ఎమర్జెన్సీ విండో (Emergency window) తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది అతనిని వారించేందుకు ప్రయత్నిస్తే ఏకంగా వారిపైనే దాడికి పాల్పడ్డాడు. లాస్‌ఏంజిల్స్‌ నుంచి బోస్టన్‌ వెళ్తున్న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 5న యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు (United Airlines) చెందిన ఓ విమానం లాస్‌ఏంజిల్స్‌ నుంచి బోస్టన్‌ బయల్దేరింది. ఫ్లైట్ మరో 45 నిమిషాల్లో ల్యాండ్‌ అవుతుందనగా.. ఒక ఎమర్జెన్సీ డోర్‌ అన్‌లాక్‌ అయినట్లు కాక్‌పిట్‌లో అలారం మోగింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ ద్వారాన్ని తనిఖీ చేయగా డోర్‌ లాకింగ్‌ హ్యాండిల్‌ను ఎవరో లాగినట్లు కన్పించింది. దీంతో వెంటనే సిబ్బంది ఆ లాకింగ్‌ను సరిచేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ఇది కూడా చదవండి: Free Beer Offer: రెండు బీర్లు ఫ్రీ అంటూ ఊరంతా పోస్టర్లు.. ఒకే ఒక్క కండీషన్ పెట్టినా క్యూ కట్టిన జనం..!

అయితే ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ వద్ద కొంతసేపు ఉన్నట్లు గుర్తించారు. అతడే దాన్ని తీసి ఉంటాడని సిబ్బంది పైలెట్‌కు సమాచారమిచ్చారు. అదే విషయం గురించి ఆ ప్రయాణికుడిని అడగ్గా అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిలో ఒకరిపై తీవ్రంగా కొట్టడమే గాక పదునైన వస్తువుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులు గమనించి అతడిని అడ్డుకున్నారు. విమానం బోస్టన్‌లో దిగగానే విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిది మసాచుసెట్స్‌కు చెందిన ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్‌గా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: Baby Girl Born with Two Hearts: నాలుగు కాళ్లు.. నాలుగు చేతులే కాదు.. రెండు గుండెలు కూడా.. వింత శిశువు పుట్టిన 20 నిమిషాల్లోనే..

Updated Date - 2023-03-07T16:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising